»   » పవన్ కళ్యాణ్ ఫిర్యాదుతో ఇబ్బంది పడ్డా, ఇలాంటివి మామూలే అంటున్న నిర్మాత!

పవన్ కళ్యాణ్ ఫిర్యాదుతో ఇబ్బంది పడ్డా, ఇలాంటివి మామూలే అంటున్న నిర్మాత!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన సినిమాల వల్ల నష్టాలు వస్తే ఆయా నిర్మాతలను, లేదా డిస్ట్రిబ్యూటర్లు ఆదుకునే ప్రయత్నం చేస్తారు. సాధారణంగా ఆయన సినిమాల విషయంలో, రెమ్యూనరేషన్ విషయంలో ఎవరిపైనా ఫిర్యదు చేసిన దాఖలాలేవు. కానీ అప్పట్లో 'అత్తారింటికి దారేది' సినిమా విషయంలో నిర్మాత తనకు డబ్బులు ఎగొట్టాడంటూ ఫిర్యాదు చేయడం ఓ సెన్సేషన్.

  పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్.... బివిఎస్ఎన్ ప్రసాద్ లాంటి పెద్ద నిర్మాతపై కంప్లైంట్ చేయడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. సాధారణంగా పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలు ఇలాంటి మనీ మ్యాటర్స్ ఏమైనా ఉంటే.... కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటారు. ఫిర్యాదుల వరకు వెళ్లడం చాలా అరుదు.

  బివిఎస్ఎన్ ప్రసాద్ ఎన్టీఆర్ హీరోగా నిర్మించిన 'నాన్నకు ప్రేమతో' రిలీజ్ ముందు పవన్ కళ్యాణ్ కంప్లైంట్ పైల్ చేయడంతో ఆయన ఇబ్బంది పడాల్సి వచ్చింది. తన తాజా సినిమా 'ఇంట్లో దెయ్య నాకే భయం' సినిమా విడుదల సందర్భంగా ఈ విషయమై స్పందించారు.

  తన దురదుష్టమే

  తన దురదుష్టమే

  బివిఎస్ఎన్ ప్రసాద్ స్పందిస్తూ...పవన్ కళ్యాణ్ కు డబ్బులు ఇవ్వడంలో ఆలస్యం జరిగిన మాట నిజమే. ఫిర్యాదు చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఆ సమయంలో తాను అలాంటి పరిస్థితిలో ఉండటం తన దురదృష్టమే' అని అన్నారు.

  ఇబ్బంది పడ్డా

  ఇబ్బంది పడ్డా

  'నాన్నకు ప్రేమతో' సినిమా రిలీజ్ కు ముందు పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేయడంతో... తాను చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పారు. సినీ పరిశ్రమలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని ఈ సందర్భంగా బివిఎస్ఎన్ ప్రసాద్ తెలిపారు.

  ఇంట్లో దెయ్య నాకే భయం

  ఇంట్లో దెయ్య నాకే భయం

  'అల్లరి' నరేష్‌ హీరోగా భోగవల్లి బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించిన హార్రర్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' డిసెంబర్‌ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ విశేషాలను గురించి పత్రికల వారికి తెలియజేశారు.

  సినిమా గురించి నిర్మాత

  సినిమా గురించి నిర్మాత

  2016 సంక్రాంతికి 'నాన్నకు ప్రేమతో' సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయింది. ఇయర్‌ ఎండింగ్‌లో 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది. ఇప్పటివరకు హార్రర్‌ చిత్రాలు చాలా వచ్చాయి. ఈ సినిమా వాటికి భిన్నంగా వుంటుంది. భయంతో కూడిన ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆడియన్స్‌ని థ్రిల్‌ చేస్తుంది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌గారు హీరోకి ఈక్వల్‌గా వుండే పాత్రలో నటించారు. చలపతిరావు, ప్రభాస్‌ శ్రీను, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, ప్రగతి ముఖ్య పాత్రలు పోషించారు. పాటలన్నీ అల్టిమేట్‌గా వచ్చాయి. రెండు పాటల్ని రాజు సుందరం నృత్య దర్శకత్వంలో బ్యాంకాక్‌లో అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించాం. మరో రెండు పాటల్ని హైదరాబాద్‌లో సెట్స్‌ వేసి చిత్రీకరించాం. ఒకటి దినేష్‌ మాస్టర్‌, ఒకటి గణేష్‌ మాస్టర్‌లు కంపోజ్‌ చేశారు. ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. యాక్షన్‌ సన్నివేశాలు హెవీగా వుండవు. రెండు, మూడు ఫైట్స్‌ సరదాగా వుంటాయి.

  English summary
  Attarintiki Daredi Producer about Pawan's Complaint. BVSN Prasad confessed that some amount of Pawan was due with him at that time and said that he didn't understand why the actor took such extreme step. 'I don't say that Pawan troubled me but I feel unfortunate to have found myself in such situation. Ever since, I have become more cautious.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more