»   » పవర్ స్టార్ అంటే పిచ్చి...లాఠీ దెబ్బలకు ఓర్చి!(ఫోటోలు)

పవర్ స్టార్ అంటే పిచ్చి...లాఠీ దెబ్బలకు ఓర్చి!(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉందో మరోసారి స్పష్టమయింది. ఆ క్రేజ్‌తోనే అభిమానులు లాఠీ దెబ్బలను సైతం ఓర్చుకున్నారు. పవర్ స్టార్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదల రోజే చూడాలని అభిమానులు తాపత్రయ పడటం మామూలే. ఈ క్రమంలో టిక్కెట్ల కోసం పోటీ పడి పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చాలా చోట్ల ఇలాంటి సంఘటనలు జరిగాయి.

హైదరాబాద్‌ నగరం తార్నకలోని ఆరాధన థియేటర్ వద్ద జరిగిన అలాంటి సంఘటనకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు మీకు చూపెట్టబోతున్నాం. శుక్రవారం సినిమా విడుదలను పురస్కరించుకుని అభిమానులు ఉదయమే థియేటర్ వద్దకు చేరుకున్నారు. టిక్కెట్లు సంపాదించే క్రమంలో అభిమానుల మధ్య తోపులాటలు జరిగాయి.

అయితే టిక్కెట్లు దొరకని అభిమానులు తీవ్రంగా నిరాశ పడ్డారు. ఈ క్రమంలో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. పవర్ స్టార్ అభిమానులపై లాఠీలు ఝులిపించారు. అలా లాఠీ దెబ్బలు తిన్న అభిమానులు...పవర్ స్టార్ సినిమా చూస్తూ ఆ బాధను మరిచిపోయారు. అందుకు సంబంధించిన ఫోటోలు, సినిమాకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో చూద్దాం...

టిక్కెట్ల కోసం...

టిక్కెట్ల కోసం...

ఆరాధన థియేటర్ వద్ద సినిమా టిక్కెట్లు సంపాదించడానికి అభిమానులు ప్రయత్నించే క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

లాఠీ దెబ్బలు

లాఠీ దెబ్బలు

టిక్కెట్లు దొరకని అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో థియేటర్ వద్ద కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీలు ఝులిపించారు. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

అభిమానం

అభిమానం

సినిమా చూసేందుకు భారీగా తరలి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను ఈ ఫోటోలో చూడొచ్చు. ఇక్కడ మాత్రమే కాదు...రాష్ట్ర వ్యాప్తంగా సినిమా విడుదలైన ప్రతి థియేటర్ వద్దా ఇదే పరిస్థితి.

ఆనందం

ఆనందం

సినిమా చూసిన తర్వాత అభిమానుల ఫేసులో ఎంతో ఆనందం కనిపించింది. సినిమా అభిమానులను పూర్తి స్థాయిలో ఎంటర్టెన్ చేయడమే ఇందుకు కారణం. ఈ ఆనందంలో లాఠీ దెబ్బల బాధను సైతం మరిచిపోయారు అభిమానులు

English summary
Pawan Kalyan fans who have lined-up at the Aradhana Theatre counter at Taranaka to procure Attarintiki Daredi movie tickets went unruly and were lathicharged by the handful of police personnels yesterday in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu