»   » ‘అత్తారింటికి దారేది’ టైటిలే ఫైనల్ (అఫీషియల్)

‘అత్తారింటికి దారేది’ టైటిలే ఫైనల్ (అఫీషియల్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి 'అత్తారింటికి దారేది' టైటిల్ ఖరారు చేసారు. ఈ మేరకు చిత్ర నిర్మాతలు ఓ ప్రకటన విడుదల చేసారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 7న వరల్డ్ వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ..'పవన్ కళ్యాన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ ఇది. ఈ చిత్రానికి 'అత్తారింటికి దారేది' టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ అవుతుందని దాన్నే ఖరారు చేసాం. స్పెయిన్లో 25 రోజుల పాటు భారీ షెడ్యూల్ చేసి వెంటనే హైదరాబాద్‌లో షెడ్యూల్ కంటిన్యూ చేస్తున్నాం' అన్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్, సమంత, ఖుషి ఫేమ్ ముంతాజ్, హంసానందినిలతో పాటు 100 మంది డాన్సర్లు పాల్గొనగా గణేష్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో భారీ ఎత్తున సాంగు చిత్రీకరిస్తున్నాం. ఈ పాటతో టోటల్ షూటింగ్ పూర్తవుతుంది. వచ్చే వారం ఆడియో విడుదల చేస్తున్నాం. దేవిశ్రీ ప్రసాద్ ఎక్స్ ట్రార్టినరీ ఆడియో ఇచ్చారు. ఆగస్టు 7న సినిమాను విడుదల చేస్తున్నాం' అన్నారు.

అన్నపూర్ణ స్టూడియోలో 'ఇట్స్ టైం టూ పార్టీ' లిరిక్ తో సాగే రేవ్ పార్టీ సాంగ్ చాలా బాగా వచ్చిందని నిర్మాత చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో పవన్ సరసన సమంత హీరోయిన్. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
Atharintiki Daaredi has been officially finalized as the title of Pawan Kalyan’s latest film in the direction of Trivikram. The production house Sri Venkateswara Cine Chitra has also confirmed the release date as 7 August.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu