»   » తెల్లగా ఉండే హీరోయిన్లే కావాలంటే ఎలా?

తెల్లగా ఉండే హీరోయిన్లే కావాలంటే ఎలా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: భారతీయ ప్రేక్షకులు తెల్లగా ఉండే హీరోయిన్లకే ఎక్కువ ప్రధాన్యత ఇస్తున్నారు, అలా ఉండే హీరోయిన్లనే ఆదరిస్తున్నారు.....ఇది సరైన ఆలోచన కాదు, వారు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు బాలీవుడ్ నటి శ్వేతా తివారి.

బిగ్ బాస్-4 రియాల్టీ షో విజేత అయిన శ్వేతా తివారి మాట్లాడుతూ...‘సినిమాలు చూసే మన ప్రేక్షకులు కేవలం తెల్లగా ఉండే హీరోయిన్లను మాత్రమే ఇష్టపడుతున్నారు. కాస్త నలుపుగా ఉండే హీరోయిన్లను వారు ఇష్ట పడటం లేదు. ప్రేక్షకుల్లో ఇలాంటి మైండ్ మారాలి' అన్నారు.

Audience who like fair actresses should change mindset: Shweta Tiwari

కేవలం తెల్లగా ఉండే వారే అందంగా ఉంటారని భారతీయులు అనుకుంటారు. కాస్త రంగు తక్కువగా ఉండి ఆకట్టుకునే రూపురేఖలున్న వారిని అందమైన వారిగా పరిగణించరని నిరాశ వ్యక్తం చేసారు. సినిమాల్లో కథానాయకుల ఆత్మ సౌందర్యానికి కూడా ప్రాముఖ్యత ఇస్తారు. కానీ చాలా మంది ప్రేక్షకులు దాన్ని ఇష్ట పడటం లేదన్నారు.

English summary
Actress Shweta Tiwari today said that the audience who prefer fair-skinned heroines need to change their mindset.“People who come to see a movie like fair-skinned heroines. They dislike dark-skinned heroines. This mindset needs to be changed,” Shweta, the winner of reality show “Bigg Boss 4″, told reporters here.
Please Wait while comments are loading...