»   »  '1-నేనొక్కడినే' ఆడియో రిలిజ్ టీజర్ (లింక్) రెస్పాన్స్

'1-నేనొక్కడినే' ఆడియో రిలిజ్ టీజర్ (లింక్) రెస్పాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు,సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం '1-నేనొక్కడినే' . ఈ చిత్రం ఆడియో మైక్రో టీజర్ (15 సెకండ్లు) రీసెంట్ గా విడుదలైంది. ఈ వీడియో ఇప్పుడు సంచలనం క్రియేట్ చేస్తోంది. ఈ ఒక్క టీజర్ తోనే ఆడియోతో పాటు,సినిమాపైనా విపరీతమైన అంచనాలు పెంచేసారు సుకుమార్,దేవిశ్రీప్రసాద్. ఆడియో విడుదలైతే పెద్ద హిట్టై...సంక్రాంతి వరకూ వేరే పాటలు వినపడవని అంటున్నారు. ఈ మైక్రో ఆడియో టీజర్ చూసిన ఫ్యాన్స్ ...సోషల్ నెట్ వర్కింగ్స్ సైట్స్ లో వైరల్ లాగ దీన్ని ముందుకు తీసుకు వెళ్లి సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.

ఆ టీజర్ లింక్ ఇదే...

ఇక ఈ టీజర్ లో రాక్ స్టార్ గా మహేష్ బాబులా అదరకొడుతున్నారు. ఆయన్ని ఇలా విభిన్నంగా చూసి ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు. దేవీశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ చిత్ర ఆడియోని డిసెంబర్ 19న రిలీజ్ చేయనున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. కృతి సనన్‌ హీరోయిన్. సుకుమార్‌ దర్శకుడు. నిర్మాణానంతర కార్యక్రమాలు ముగించుకొని సంక్రాంతి పండగ నాడు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. 'జనవరి 10న '1'ని తెచ్చేస్తున్నాం' అని మహేష్‌ కూడా చెప్పేశాడు. మహేష్‌కి సంక్రాంతి సీజన్‌ బాగా కలిసొచ్చింది 'ఒక్కడు', 'బిజినెస్‌మేన్‌', 'సీతమ్మ వాకిట్లో' ముగ్గుల పండక్కి విడుదలై విజయాన్ని సాధించాయి. ఇప్పుడు '1' కూడా పండగ బరిలో దిగబోతోంది.

http://videos.filmibeat.com/watch/87760/1-nenokkadine-micro-audio-teaser-hd.html

అలాగే ఈ చిత్రంలో కృతిసనన్‌ ఓ టీవీలో న్యూస్‌ రీడర్‌గా పని చేస్తోంది. ఇందుకోసం ఆమె ఏవో వార్తలు చదువటాన్ని మొన్నా మధ్య రామోజీఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో షూట్ చేసారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను గౌతమ్ పోషిస్తున్నాడు. ఇక్కడ అందుకు సంబంధించిన సీన్లతో పాటు యాక్షన్ సీన్లు, చేజింగ్ సీన్లు చిత్రీకరించారు.

డిఫరెంట్ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు సుకుమార్....చాలా కాలం పాటు స్క్రిప్టు వర్కు చేసి వైవిధ్యమైన అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినోదంతో పాటు అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రం ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ స్టార్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఛాయాగ్రహణం: రత్నవేలు, పోరాటాలు: పీటర్‌ హెయిన్స్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

English summary
The makers of mahesh babu's '1-Nenokkadine' released Audio Release Promo of '1-Nenokkadine'. They have been going on with aggressive promotions with innovative methods. The producers of the film have announced the launch date as the 19th December.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu