»   » అమితాబ్ కు క్షమాపణ చెప్పాల్సిందే: నరేంద్ర మోడీ

అమితాబ్ కు క్షమాపణ చెప్పాల్సిందే: నరేంద్ర మోడీ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Author of fake video must apologise to Amitabh Bachchan: Narendra Modi
ముంబై : ఇంటర్ నెట్ లో ఓ వీడియో అమితాబ్ ఆగ్రహానికి కారణమై వివాదమైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో నరేంద్ర మోడీ కూడా చాలా సీరియస్ అయ్యారు. ఆయన తక్షణమే ఆ వీడియో తయారు చేసిన వ్యక్తి ...అమితాబ్ కు క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేసారు. అది ఓ నకిలీ వీడియో అని..దాన్ని వెంటనే తొలిగించాలని, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆయన అల్టిమేటం జారి చేసారు.

అంతలా అమితాబ్,నరేంద్ర మోడీ ఆగ్రహానికి కారణమైన ఆ వీడియోలో ఏముంది అంటే...గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిగా చూడాలని ఉందనే అభిప్రాయాన్ని అమితాబ్ వ్యక్తం చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. దాదాపు ఐదేళ్ల క్రితం అమితాబ్ బచ్చన్ ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారట. ఆ ప్రచార సభలో మాట్లాడిన మాటలను, వేరే విధంగా మలిచి ఈ నకిలీ వీడియోను విడుదల చేసారని చెప్తున్నారు.

ఈ విషయమై అమితాబ్ స్పందిస్తూ... ఇది చిన్న విషయం కాదని, ఈ తప్పు చేసిన వ్యక్తిని వదిలిపెట్టేది లేదని, చట్టపరంగా చూసుకుంటానని అమితాబ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ విషయంలో అమితాబ్‌కి మోడీ కూడా సపోర్ట్ చేస్తూ, 'ఇలా చేయడం సరికాదు' అని పేర్కొన్నారు. లీడ్ ఇండియా ప్రచార కార్యక్రమంలో తాను మాట్లాడిన అంశాలను తీసుకుని ఎవరో ఓ నకిలీ వీడియో తయారుచేశారని, కావాలనే ఇలా మోడీ ప్రచారంలా తయారుచేసి పెట్టారని ఆయన అన్నారు. అమితాబ్ స్వయంగా ఈ విషయంలో తీవ్రంగా స్పందించడంతో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ సైతం నకిలీ వీడియో సృష్టికర్తల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నకిలీ వీడియోను సృష్టించింది ఉత్పల్ జీవ్జ్రనీ అనే వ్యక్తి అట. ఆయనకీ ఈ విషయం గురించి ఓ ప్రకటన విడుదల చేసారు.

ఉత్పల్ మాట్లాడుతూ... -''ఇలా జరిగినందుకు ముందుగా క్షమాపణలు చెబుతున్నా. నేను గుజరాతీ సినిమాలకు సంగీతదర్శకుడిగా చేస్తుంటాను. నేనా వీడియోను తయారు చేయలేదు. కనీసం ఎడిటింగ్ కూడా చేయలేదు. 'వాట్సప్' ద్వారా నా మొబైల్ ఫోన్‌కి ఈ వీడియో వచ్చింది. నేను మోడీ అభిమానిని. అమితాబ్ బచ్చన్ అంటే ఎనలేని గౌరవం. అందుకని ఆ వీడియోను అప్‌లోడ్ చేశాను. కానీ నకిలీ వీడియో అని ఆలస్యంగా తెలిసింది. వెంటనే తీసేస్తానని మాటిస్తున్నా'' అని పేర్కొన్నారు.

ఇక బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ మంచి నటుడే కాదు... సాయం చేయడంలోనూ ఎప్పుడూ ముందుంటారు. ఆయన ప్రస్తుతం యునిసెఫ్‌కి గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ చిన్నారుల కోసం పని చేస్తుంటుంది. గతంలో ఎన్నో మంచి కార్యక్రమాల్ని ముందుండి నడిపించిన అమితాబ్‌ ఇటీవల ఉత్తరాఖండ్‌ వరదల సమయంలోనూ తన వంతు సాయం అందించారు.

ఇప్పుడు ఐక్యరాజ్యసమితి ప్రపంచ జీవకారుణ్య దినోత్సవం (ఆగస్టు 19) సందర్భంగా 'ది వరల్డ్‌ నీడ్స్‌ మోర్‌- - -' అనే పేరుతో ఓ ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ప్రపంచానికి ఎక్కువగా ఏం కావాలి? అంటూ సాగే ఈ ఉద్యమంలో అమితాబ్‌ పాల్గొన్నారు. ఆయన చెప్పిన మాటల్ని యూట్యూబ్‌లో విడుదల చేశారు.


ఆ మాటల్లో అమితాబ్... ''పోలియోను అరికట్టాలి. మన పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి. అందుకోసం వ్యాధినిరోధక టీకాల అవసరం ప్రపంచానికి ఎంతో ఉంద''ని అమితాబ్‌ వెల్లడించారు. యూట్యూబ్‌లో వీడియో చూసిన వాళ్లంతా ఈ ప్రపంచానికి ఏం కావాలని భావిస్తారో ఆ పదాల్ని అందించాలని ఐక్యరాజ్యసమితి కోరింది.

English summary

 Earlier, the 70-year-old actor was furious over the fake video posted on YouTube which gave an impression of him endorsing a campaign promotion for Modi. Gujarat Chief Minister Narendra Modi today sought an apology from the creator of a fake online video, which allegedly used the Bollywood megastar Amitabh Bachchan's voice to praise the BJP strongman. "The author of the fake video should take action immediately and apologise to Amitabhji", Modi said on micro-blogging site Twitter today in response to Bachchan's demand for action against the person who uploaded it. Agree with SrBachchan . The author of the fake video should take action immediately and apologize to Amitabh ji. — Narendra Modi (narendramodi) August 22, 2013
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu