»   »  చిరంజీవి ‘ఆటోజానీ’కాపీ వివాదం: పూరి జగన్నాథ్ స్పందన

చిరంజీవి ‘ఆటోజానీ’కాపీ వివాదం: పూరి జగన్నాథ్ స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరంజీవి తన 150వ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఆటో జానీ' అనే టైటిల్ కూడా ఖరారు చేసారు. అయితే చిరంజీవి 150వ సినిమా ప్రకటన అలా వచ్చిందో లేదో...ఇలా వివాదం తెరపైకి వచ్చింది. ఈ చిత్రం స్టోరీ కాపీ కొట్టారంటూ వివాదం నెలకొంది.

ఈ వివాదం నేపథ్యంలో దర్శకుడు పూరి జగన్నాథ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘ఆటోజానీ పూర్తిగా నేను స్వయంగా డిజైన్ చేసిన స్టోరీ. కొంత మంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దు' అంటూ ట్వీట్ చేసారు. పూరి స్వయంగా వివరణ ఇవ్వడంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నాడు.

కాపీ వివాదం...
స్టోరీ కాపీ కొట్టారంటూ వివాదం.. చిరంజీవి 150వ సినిమాకు బివిఎస్ రవి కథ సహకారం అందించారు. అయితే యుఎస్‌కు చెందిన రచయిత దేవ్ వర్మ తన కథను ఎపి రైటర్స్ అసోశియేషన్ లో రిజిస్టర్ చేసానని, నా కథను కాపీ కొట్టి మార్పులు చేసి చిరంజీవి సినిమాకు కథ రెడీ చేసారని అంటున్నారు.

AUTOJAANI story conceived by me: Puri Jagannath

దేవ్ వర్మ మాట్లాడుతూ.... " నేను 2011 లో ఈ కథను రాయటం మొదలెట్టాను. అంతేకాదు... కృష్ణం రాజు గారికి ఈ కథను చెప్పటం జరిగింది. ఆయన చాలా ఇష్టపడి..వెంటనే దాన్ని నిర్మించటానికి ముందుకు వచ్చారు. ప్రభాస్ అందులో నటించటానికి ఆసక్తి చూపారు. కానీ ...కొన్ని కారణాలు వల్ల మొదట అనుకున్నది వర్కవుట్ కాలేదు. తర్వాత...తమిళ,తెలుగు భాషల్లో దర్శకుడు ఎఆర్.మురగదాస్ ఆధ్వర్యంలో ముందుకు వెల్దామనుకున్నాం... అని చెప్పుకొచ్చారు.

బి.వియస్ రవి దగ్గర ఉన్న కథ , మీ కథ ఒకటే అని ఎలా చెప్పగలరు? మీకు ఎలా తెలుసు? అనే ప్రశ్నకు సమాధానం చెప్తూ... నటుడు సుబ్బరాజు నాకు మంచి మిత్రుడు. గత నవంబర్ లో నేను ఇండియాలో ఉన్నప్పుడు ఆయన్ను కలిసాను. అదే సమయంలో సుబ్బరాజు ని కలవటానికి రచయిత రవి వచ్చారు. అలా ఆ సమయంలో క్లుప్తంగా చిరు కథ ఇది అని స్టోరీ లైన్ చెప్పటం జరిగింది. అంతేకాదు ఒక్క అడుగు టైటిల్ ని పెట్టాలనుకుంటున్నట్లు రవి చెప్పారని అన్నారు. దాంతో ఆ కథ విని షాక్ అయ్యానని చెప్పారు.

ఈ నేపధ్యంలో గోపీ మోహన్ ..స్పందించారు. గోపి మోహన్ స్పందిస్తూ ‘నేను బివిఎస్ రవితో కలిసి షేర్ చేసుకున్న కథని కాపీ అని పుకార్లు వస్తున్నాయి. వాటిల్లో అస్సలు నిజం లేదు. అలా వాదించే ఏ రైటర్ అయినా వచ్చి ధైర్యంగా రైటర్స్ యూనియన్ లో ఈ విషయాన్నీ పరిష్కరించుకోవచ్చని' గోపి మోహన్ తెలిపారు.

English summary
"AUTOJAANI story is completely and originally conceived by me.Don't believe false claims and rumours made in media" Puri Jagannth tweeted.
Please Wait while comments are loading...