»   » బూతులు, అసభ్య మెసేజ్‌లు: అవికా గోర్‌కు యువ హీరో వేధింపులు!

బూతులు, అసభ్య మెసేజ్‌లు: అవికా గోర్‌కు యువ హీరో వేధింపులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇపుడు ఓ న్యూస్ హాట్ టాపిక్ అయింది. టాలీవుడ్‌కి చెందిన ఓ యువ హీరో... హీరోయిన్ అవికా గోర్‌ పట్ల చాలా నీచంగా ప్రవర్తిస్తున్నాడని, వేధింపులకు పాల్పడుతున్నాడనే విషయం వెలుగులోకి వచ్చింది.

చిన్నారి పెళ్లి కూతురు సిరీయల్‌లో నటించిన అవికా గోర్..... తర్వాత 'ఉయ్యాల జంపాల' మూవీ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత కొన్ని తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అవికా గోర్ మీద కన్నేసి ఇండస్ట్రికీ చెందిన ఓ యువ హీరో ఆమె వేధిస్తున్నాడనే ప్రచారం మొదలైంది.

బూతులు, అసభ్యంగా...

బూతులు, అసభ్యంగా...

అవికా గోర్‌ను వాట్సాప్‌ ద్వారా అసభ్య, అశ్లీల మెసేజ్ లు పంపుతున్నాడని... గుర్తుతెలియని నెంబర్ నుండి తొలుత ఆ మెసేజ్‌లు రావడంతో అతడు ఎవరనే విషయం అవికాగోర్ గుర్తించలేక పోయింది. తర్వాత ఓ యువ హీరోనే ఇదంతా చేస్తున్న విషయం ఆమెకు తెలిసిందట.

నిఖిల్, రాజ్‌తరుణ్, సాయిధరమ్ తేజ్

నిఖిల్, రాజ్‌తరుణ్, సాయిధరమ్ తేజ్

ఇండస్ట్రీలో తనకు సన్నితంగా ఉండే నిఖిల్, రాజ్‌తరుణ్, సాయిధరమ్ తేజ్ లాంటి హీరోలతో పాటు హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, హెబ్బపటేల్ లకు యంగ్ హీరో వేధింపులకు విషయం చెప్పి, వారికి అతడు పంపిన అసభ్య మెసేజ్ లు చూపినట్లు సమాచారం,

ఏమీ చేయలేక...

ఏమీ చేయలేక...

అయితే ఆ యంగ్ హీరోకు ఇండస్ట్రీలో మంచి గ్రౌండ్ ఉండటంతో....... అవికా ఈ విషయాన్ని బయటకు చెప్పలేక పోతోంది. పోలీస్ కంప్లైంట్ చేస్తే మీడియాలో అదో పెద్ద ఇష్యూ అయి తన కెరీర్ మీద ప్రభావం పడుతుందని భయపడుతుదట.

తెలుగు ఇండస్ట్రీ పరువు తీస్తున్నారు

తెలుగు ఇండస్ట్రీ పరువు తీస్తున్నారు

గతంలో కొందరు హీరోయిన్లు కూడా తెలుగు సినీ పరిశ్రమపై ఇలాంటి కంప్లైంట్సే చేసారు. పరిశ్రమలో ఇలాంటి చీడ పరుగుల కారణంగా తెలుగు సినీ పరిశ్రమ పరువుపోతోందని కొందరు వాపోతున్నారు.

English summary
According to Film Nagar source, Actress Avika Gor was allegedly subject to a few inappropriate messages from a young Telugu actor, recently.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu