»   » ఇక్కడ మగాడు ఎవరు? అరేయ్ నిన్ను కాదురా : హీరో నానితో ఆడుకున్న హీరోయిన్లు!

ఇక్కడ మగాడు ఎవరు? అరేయ్ నిన్ను కాదురా : హీరో నానితో ఆడుకున్న హీరోయిన్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
ఇక్కడ మగాడు ఎవరు? : హీరో తో ఆడుకున్న హీరోయిన్లు!

హీరో నాని నిర్మాతగా మారి చేస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ 'అ!'. కాజల్, నిత్యా మీనన్, రెజీనా, ఈషా రెబ్బ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి నాని కేవలం నిర్మాతగా వ్యవహరించడం మాత్రమే కాదు ఇందులో చేప పాత్రకు వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నారు. ఫిబ్రవరి 16న ఈ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో ఈ నలుగురు భామలతో పాటు నిర్మాత నాని ప్రమోషన్లలో బిజీ అయ్యారు. ఇటీవల నిర్వహించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ చాలా ఫన్నీగా సాగింది.

 ఇక్కడ మగాడు ఎవరున్నారు: నిత్యా మీనన్

ఇక్కడ మగాడు ఎవరున్నారు: నిత్యా మీనన్

ఇంటర్వ్యూ ప్రారంభం సందర్భంగా యాంకర్ మాట్లాడుతూ... ఇంత మంది బ్యూటిఫుల్ లేడీస్‌ ఒకే ఫ్రేములో కనిపించడం హ్యాపీగా ఉందని వ్యాఖ్యానించారు. ‘నన్ను మీరు పట్టించుకోవడం లేదు' అని నాని అనడంతో... యాంకర్ స్పందిస్తూ ‘ఇక్కడున్న లేడీస్‌ను మాత్రమే పలకరించాను, ప్రొడ్యూసర్ వరకు ఇంకా రాలేదు అంటూ సమాధానం ఇచ్చారు. వెంటనే నిత్యా మీనన్ కల్పించుకుని.... ఇక్కడ మగవాడు ఎవరున్నారు? అంటూ సెటైర్ వేశారు. దీనికి నాని బుంగమూతి పెట్టేశారు.

 అరేయ్ నాని నిన్ను కాదురా...

అరేయ్ నాని నిన్ను కాదురా...

అయితే నాని కాస్త ఫీలైనట్లు బుంగ మూతి పెట్టి లేచి పోవడానికి ట్రై చేశాడు. దీంతో నిత్యా మీనన్ స్పందిస్తూ..... అరేయ్ నాని నిన్ను కాదురా, నా మాటల అర్థం యాక్టర్స్‌ అని... నువ్వు ఈ సినిమాకు ప్రొడ్యూసర్ కదరా.... అంటూ కామెంట్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

 నాని-నిత్యా మీనన్ మధ్య సాన్నిహిత్యం

నాని-నిత్యా మీనన్ మధ్య సాన్నిహిత్యం

నాని, నిత్యా మీనన్ మధ్య ఎంత క్లోజ్ ఫ్రెడ్షిప్ ఉందో నిత్యా మీనన్ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో యాంకర్‌తో కలిపి అంతా లేడీసే ఉండటంతో ఇంటర్వ్యూ సాగినంత సేపు నాని ఓ ఆట ఆడేసుకున్నారు.

 అందరి కంటే ఎక్కువ కష్టపడింది నేను: నాని

అందరి కంటే ఎక్కువ కష్టపడింది నేను: నాని

సినిమాలో నటించిన ఆ నలుగురు హీరోయిన్లు తమ తమ పాత్రల గురించి చెబుతుంటూ.... మీ అందరి కంటే కష్టపడింది నేను, చేపలా కనిపించడానికి చాలా శ్రమించాను... అంటూ ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు.

 కథే హీరో

కథే హీరో

ఈ చిత్రంలో హీరో ఎవరు? అంటే ఎవరూ లేరు.... కథే ఈ చిత్రానికి హీరో అని నాని తెలిపారు. సినిమా కథల ఎంపిక విషయంలో నానికి మంచి అనుభవం ఉంది. అలాంటిది తానే డబ్బులు పెట్టిన నిర్మిస్తున్న ఈ చిత్ర కథ ఎంపిక విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ఉంటారో ఊహించుకోవచ్చు.

మేకప్ లేకుండా కాజల్

మేకప్ లేకుండా కాజల్

‘అ!' మూవీలో కాజల్ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. అయితే ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయం మాత్రం ఇంకా వెల్లడించలేదు.

 చెట్టు పాత్రలో రవితేజ

చెట్టు పాత్రలో రవితేజ

‘అ!' సినిమాలోని ముఖ్య పాత్రల్లో చెట్టు పాత్ర కూడా ఒకటి. ఈ పాత్రకు రవితేజ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు.

చెఫ్ పాత్రలో ప్రియదర్శి

చెఫ్ పాత్రలో ప్రియదర్శి

‘పెళ్లి చూపులు' ఫేం కమెడియన్ ప్రియదర్శి ఈ చిత్రంలో చెఫ్ పాత్రలో కనిపించబోతున్నారు.

 తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె.రాబిన్‌, సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని, ఆర్ట్‌: సాహి సురేష్‌, ఎడిటింగ్‌: గౌత‌మ్ నెరుసు, నిర్మాత‌: ప‌్ర‌శాంతి త్రిపిరినేని, ద‌ర్శ‌క‌త్వం: ప‌్ర‌శాంత్ వ‌ర్మ‌.

English summary
AWE Movie Team Nani, Kajal, Nitya menon Super Funny Interview. The film featuring Kajal Aggarwal, Nithya Menen, Regina Cassandra, Eesha Rebba, Srinivas Avasarala, Priyadarshi Pulikonda, Murali Sharma, Rohini Molleti. Voice over by Natural Star Nani and Mass Maharaja Ravi Teja. Directed by Prasanth Varma, Music is composed by Mark K Robin, Produced by Prashanti Tipirneni and Presented by Natural Star Nani under Wall Poster Cinema banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu