»   »  నాగ్ హాట్ హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి?...సర్జరీ చేయించుకుంటే ఇంత మార్పా?(ఫొటోలు)

నాగ్ హాట్ హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి?...సర్జరీ చేయించుకుంటే ఇంత మార్పా?(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై :నాగార్జున సరసన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సూపర్' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన భామ ఆయేషా టకియా. ఆ సినిమా తర్వాత మళ్లీ ఆమె తెలుగుతెరపై కనిపించలేదు. కానీ రీసెంట్ గా ఆమె తాజాగా కొన్ని ఫొటోలు బయిటకు వచ్చాయి. ఎంతో సెక్సీగా అదరకొట్టిన ఈమెను ఈ ఫొటోల్లో చూసి షాక్ అవుతున్నారు. సర్జీరీ చేయించుకుందని టాక్. నిజమో కాదో మీరే క్రింద ఫొటోలు చూసి చెప్పండి.

చిక్కని నవ్వులతో చక్కని చూపులతో అలరించే ఆయేషా టకియా తనకంటూ ఓ ప్రత్యేకమైన 'క్యూట్ ఇమేజ్'ను పొందగలిగింది. ఇప్పటి దాకా ఆమె కెరీర్‌లో బ్లాక్ బస్టర్లు లేకపోవచ్చు కాని, బాలీవుడ్ పెద్దల గుర్తింపు బాగానే పొందింది.

ఫర్హాన్ అజ్మీని పెళ్లాడి సినిమాలకు గుడ్‌బై చెప్తానన్న ఆయేషాటకియా మళ్లీ ఇప్పుడు సినిమాల్లో బిజీ అయిపోయింది. సినిమా రీ-ఎంట్రీని ఆయేషా భర్త ఫర్హాన్ అజ్మీ జీర్ణించుకోలేకపోతున్నాడంటూ బాలీవుడ్‌లో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆ వార్తలను నిజం చేస్తూ తెరపై కనపడలేదు. ఆమె ఓ బిడ్డకు తల్లైన తర్వాత మళ్లీ ఫీల్డ్ కు వస్తాను అన్నట్లుగా ఈ ఫొటోలు వదిలింది.

ఆయేషా లేటెస్ట్ పొటోలతో మరిన్ని విశేషాలు..స్లైడ్ షోలో

 ఇదే ఆయేషా లేటెస్ట్ ఫొటో

ఇదే ఆయేషా లేటెస్ట్ ఫొటో

ఈ ఫొటోలో ఆయేషాని చూస్తే మనకు షాక్ అనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా మారిన మనిషిలా ఇందులో మనకు ఆయేషా కనిపించింది. రీసెంట్ గా ఈ ఫొటోని ఆయేషాని షేర్ చేసింది తన ఇనిస్ట్రిగ్రామ్ ఎక్కౌంట్ లో . ఆయేషా టకియా బ్లాక్ అండ్ వైట్ సెల్ఫీ అని కాప్షన్ పెట్టింది. అయితే ఈ ఫొటోలో ఈమెను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.

 భర్తే చేయించాడా

భర్తే చేయించాడా

ఆయేషా రీఎంట్రీ టైమ్‌లోనే ఆయేషాను చంపేస్తామంటూ బెదిరింపుకాల్స్ వచ్చాయిన్నాడు భర్త అజ్మీకి. దాంతో తన భార్యకు సెక్యూరిటీ కావాలని పోలీసులను అజ్మీ ఆశ్రయించారు. అయితే ఈ విషయమై పలు అనుమానాలు వెల్లు వెత్తుతున్నాయి. తన భార్య సినిమాల్లో నటించడం ఏ మాత్రం ఇష్టంలేని అజ్మీయే ఇవన్నీ చేయిస్తున్నాడని బాలీవుడ్‌లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన మాత్రం ఈ వార్తలను ఖండించారు.

 ఆమె బోయ్ ఫ్రెండ్ గురించి నోరు విప్పేది కాదు

ఆమె బోయ్ ఫ్రెండ్ గురించి నోరు విప్పేది కాదు

ప్రేమకు సంబంధించి తన వ్యక్తిగతాన్ని ఇలా విప్పి చెప్పింది...‘జీవితంలో ప్రతి అంశం పట్ల, నా పనిమీద నేను ప్రేమగా వుంటాను. నాకు బాయ్‌ఫ్రెండ్ వుండవచ్చు. అయితే నాకు దాని గురించి మాట్లాడడం ఇష్టం లేదు. వాటి గురించి ఎక్కువగా మాట్లాడినట్లయితే సినిమాల కంటే వాటి పట్ల శ్రద్ధ ఎక్కువ అవుతుంది' అని. అది సరే.. కాని బాలీవుడ్‌లో ప్రస్తుతం తన పొజిషన్ ఏమిటో చెప్పదేం..? అనేవారు అంతా.

 అదీ ఆమె గ్లామర్ రహస్యం

అదీ ఆమె గ్లామర్ రహస్యం

‘నాకు సహజంగా మంచి చర్మం వుంది. దానిని కాపాడుకునేందుకు ఎల్లవేళలా పరిశుభ్రంగా వుంచుకుంటాను' అని చెప్పుకొచ్చింది ఒకనాటి ఆయేషా. ‘‘మన జీవన విధానం, కాలుష్యం చర్మాన్ని ప్రభావితం చేస్తుంటాయి. హైడ్రేటింగ్ లక్షణాలుండే చర్మం పట్ల రక్షణ ఉత్పత్తుల్ని వాడడానికి నేను ఇష్టపడతాను. రెండు నెలలకు ఒక సారి క్లీనప్ చేసుకుంటూ వుంటా. నా చర్మంపై సబ్బు అస్సలు ఉపయోగించను'' అంటూ తన గ్లామర్ రహస్యాన్ని అద్భుతంగా వర్ణించింది

 స్వీట్ స్వీట్‌గా...! చెప్పింది

స్వీట్ స్వీట్‌గా...! చెప్పింది

బాలీవుడ్‌లో ప్రస్తుతం మళ్లీ బిజీగా అవుదామని ప్రయత్నిస్తున్న ఆయేషా.. చక్కటి సినిమాలు కొన్ని చేసినా చాలు అంటూ మంచి కథ, మంచి పాత్రలకే తన ప్రాధాన్యం అని చెబుతోంది. అందాల నవ్వులు చిలకరిస్తూ ఎదుటివారిని ఆకట్టుకునే ఆయేషా తనకు సంబంధించిన ఇష్టాయిష్టాలను స్వీట్ స్వీట్‌గా ఏకరువు పెట్టిందిలా...అయితే ఎవరైనా ఫామ్ లేనివాళ్లని పట్టించుకుంటారా.

 ఆయేషాకి బిడ్డ పుట్టాకే

ఆయేషాకి బిడ్డ పుట్టాకే

ఆయేషా టకియా, రెస్టారెంట్ ఓనర్ ఫర్హాన్ అజ్మి వివాహం మార్చి1, 2009లో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. తెలుగులో ఆమె 'సూపర్' సినిమాతో పాటు టార్జాన్, వండర్ కార్, వాంటెడ్‌తో పాటు అనేక చిత్రాల్లో నటించింది. బిడ్డ పుట్టిన తర్వాత ఆయేషా దంపతులు చాలా ఆనందంగా ఉన్నారు.

 బోయ్ ఫ్రెండ్ నే చేసుకున్నాను

బోయ్ ఫ్రెండ్ నే చేసుకున్నాను

తన భర్త తనకు పెళ్లికు ముందు బోయ్ ఫ్రెండ్ అని చెప్పిందామె. అలాగే ఫర్హాన్ అజ్మీ ఓ పొలిటీషన్ కుమారుడు, ఓ బిజినెస్ మ్యాన్. ఉత్తరప్రదేశ్ లో వాళ్లుకు చాలా ఆస్దులు,పరపతి ఉన్నాయి. ఆయేషాని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు భర్త. ఆమె తన పర్శనల్ లైప్ చాలా హ్యాపీగా గడుస్తోందని చెప్తోంది ఆయేషా.

 కొడుకే నా జీవితం అయ్యాడు

కొడుకే నా జీవితం అయ్యాడు

ఇన్నాళ్లూ తనకు తన కుమారుడు మికాయిల్ జీవితం అయ్యాడని చెప్పింది ఆయేషా. తన కొడుకు పెట్టాక తన జీవితం మారిపోయింది. వాడి ఆలనా పాలనలో తనను తాను మర్చిపోయానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు వాడు రెండేళ్లు వాడయ్యాడని, వాడిని వదిలిపెట్టి తన కెరీర్ ని చూసుకోవటం కష్టమే అయినా ఆ కష్టం పడతానంటోంది.

 ఆయేషా సినీ కెరీర్ లో టర్నింగ్

ఆయేషా సినీ కెరీర్ లో టర్నింగ్

నగేష్ కుకునూర్ దర్శకత్వంలో వచ్చిన డోర్ చిత్రం ఆమె కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఈ లో బడ్జెట్ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది ఆమెకు . ఈ సినిమాలో ఆమె యంగ్ విడోగా కనిపించింది. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఒక్కసారిగా బాలీవుడ్ మొత్తం ఆయన వంక చూసింది. ఆఫర్స్ వెల్లువెత్తాయి.

 తల్లితో ఆయేషా

తల్లితో ఆయేషా

తన తల్లితో కలిసి ఆయేషా ఇలా కనిపించింది. ఆవిడ పేరు ఫ్రెడిష్ టకియా, తల్లి సగం మహారాష్ట్రియన్,సగం బ్రిటీష్. అందుకే ఆయేషా అలా ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని నవ్వేస్తూ చెప్తుంది ఆయేషా. తనకు జాతులు, మతాలు పెద్ద ప్రాధాన్యత కాదని, మనమంతా భారతీయులం అనే విషయమే తనకు ఆనందాన్నిస్తుందని ఈ విషయం చెప్తుంది.

 తొలిసారి అవార్డ్ అందుకుంటూ

తొలిసారి అవార్డ్ అందుకుంటూ

జయాపజయాలు ప్రక్కన పెడితే..ఆయేషాటకియా తన తొలి బాలీవుడ్ చిత్రానికే అవార్డ్ అందుకుంది. ఆమె టార్జాన్ చిత్రంలో నటించి, ఉత్తమ నటన చూపినందుకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ని అందుకుంది. టార్జాన్..ది వండర్ కార్ చిత్రంలో ఆమె క్యూట్ బబ్లి గర్ల్ గా నటించారు. ఈ చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

 పెద్ద ఫ్లాప్ ఇచ్చింది

పెద్ద ఫ్లాప్ ఇచ్చింది

ఆయేషా టకియా తన రెండో చిత్రాన్ని హీరో షాహిద్ కపూర్ తో చేసింది. ఈ చిత్రాన్ని ఆమె టార్జాన్ చిత్రం కన్నా ముందే కమిటైంది. ఈ చిత్రం టైటిల్ దిల్ మాంగే మోర్. ఈ చిత్రం చిన్న బడ్జెట్ తో తయారైంది. భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. అయినా ఆ చిన్న మొత్తం కూడా రికవరీ కాలేదు. దాంతో ఆమె కెరీర్ పై దెబ్బ పడింది.

పెటా మెంబర్ ఆయేషా

పెటా మెంబర్ ఆయేషా

ఆయేషా టకియాకు జంతువులంటే విపరీతమైన ప్రేమ. అందుకే ఆమె పెటాలో మెంబర్ అయ్యింది. మీరు ఆమె ఇనిస్ట్ర్రగ్రామ్ ఫాలో అయితే అందుకు సంభందించిన బోల్డు విషేషాలు దొరుకుతాయి. అంతేకాదు ఆమె తన కుకింగ్ ఎక్సపీరియన్స్ లు, కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లి చూసి, వాటిని ఫొటోలు తీసి తన అభిమానుల కోసం పెట్టడం చేస్తూంటుంది.

మిస్సయ్యాను అంటున్న ఆయేషా

మిస్సయ్యాను అంటున్న ఆయేషా

ఆయేషాను ఆ మధ్యన మీడియావారు మీరు బాలీవుడ్ ని మిస్సైనట్లు అనిపిస్తోందా అంటే ..ఆమె వెంటనే తడుముకోకుండా ఎందుకు కాదు..నేను రోజూ ఇప్పటికీ బాలీవుడ్ కలలు కంటూంటాను. నేను చాలా మిస్సయ్యాను. యాక్షన్ కు కట్ మధ్య మరోసారి నన్ను నేను చూసుకోవాలని ఎదురుచూస్తున్నాను అని చెప్పుకొచ్చింది.

 కెరీర్ లో పెద్ద హిట్

కెరీర్ లో పెద్ద హిట్

ఆయేషా కెరీర్ లో పెద్ద హిట్ చిత్రం వాంటెడ్. తెలుగులో మహేష్ హీరోగా వచ్చిన పోకిరి చిత్రానికి రీమేక్ గా వచ్చిన చిత్రం అది. సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన ఆ చిత్రానికి ప్రబుదేవా డైరక్ట్ చేసారు. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద సెన్షేషన్ క్రియేట్ చేసింది. ఆమెకు ఆ తర్వాత భారీ ఆఫర్సే వచ్చాయి. అయితే వాటిన్నటిని కాదని ఆమె పర్శనల్ లైఫ్ లో బిజీ అయ్యింది.

English summary
Remember Ayesha Takia? One of those few actresses, who made us crazy with her cute looks in her debut film, Nag's Super. We just came across her recent pictures and guys, she looks pretty different now! and it seems the actress has gone under the knife. From puffed lip to swollen face, Ayesha looks nothing like she used to look earlier!
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu