Don't Miss!
- News
లీటర్ పెట్రోల్, డీజిల్‌పై హఠాత్తుగా రూ.35 పెంపు..!!
- Sports
Australia Open 2023 విజేతగా నోవాక్ జకోవిచ్.. నాదల్ రికార్డు సమం!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
"సూపర్" హీరోయిన్ ఇలా అయిపోయిందేమిటీ??? వికటించిన ప్లాస్టిక్ సర్జరీ
ముద్దుగా బొద్దుగా ఉన్న ఆయేషా టకియా అందరికీ గుర్తుండే ఉంటుంది. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు నటించింది. తెలుగులో కూడా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్‌లో నాగార్జున పక్కన నటించింది. ఆ చిత్రంలో ఒక రొమాంటిక్ పాత్రలో కనిపించి కుర్రాకారును ఉర్రూతలు ఊగించింది.
ఆ తరువాత, ఆమె తెలుగు సినిమాలవైపు తొంగి చూడలేదు. బాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్ అయిన వాంటెడ్ (పోకిరీ రీమేక్)లో సల్మాన్ ఖాన్ పక్కన నటించింది. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అయినా కూడా ఆయేషాకి అవకాశాలు పెద్దగా రాలేదు. 2009లో ఎస్పీ లీడర్ అబు ఆజ్మీ కొడుకు ఫర్హాన్ ఆజ్మీని పెళ్లి చేసుకున్న అయేషా ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. . పెళ్లయిన తర్వాత అడపాదడపా సోషల్ మీడియాలో ఫొటోలతో అభిమానులకు దర్శనమిచ్చిన ఈ అమ్మడు..

తాజాగా గత గురువారం ఓ వేడుకకు హాజరయింది. అక్కడ ఆమెను చూసిన వారు నమ్మలేకపోయారు. పెళ్లయి, ఓ బిడ్డకు తల్లి అయిన అయేషా ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఒకప్పుడు స్లిమ్‌గా కుందనపు బొమ్మలా సినిమాల్లో అలరించిన ఈ అమ్మడు ఇప్పుడు కాస్తా బొద్దుగా ఏమాత్రం గుర్తుపట్టనంతగా మారిపోవడంతో ఆమె అభిమానులు, బాలీవుడ్ వర్గాలు విస్తుపోయారు.

మళ్ళీ వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వాలని భావించిందో ఏమో కాని అయేషా టకియా రీసెంట్ గా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందట. ఈ సర్జరీ బెడిసి కొట్టడంతో ఈ అమ్మడు గుర్తు పట్టలేనంతగా మారింది. అయినా అదేం పట్టించుకోనట్టు తన బాలీవుడ్ ప్రయత్నాలు మాత్రం ఆప్టం లేదు త్వరలోనే మళ్లీ తెరపై కనిపిస్తానని, ప్రస్తుతం కథలు వింటున్నానని ఈ అమ్మడు చెప్పింది.