»   » మెగా స్పీడ్ : కొణిదెల నిహారిక మరో సినిమా కూడా!

మెగా స్పీడ్ : కొణిదెల నిహారిక మరో సినిమా కూడా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా స్టార్ వారసత్వంతో మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటి వరకు దాదాపు అరడజను మంది హీరోలు పరిచయం అయ్యారు. అయితే ఆ ఫ్యామిలీ నుండి హీరోయిన్ మాత్రం ఇప్పటి వరకు సినిమా రంగంలోకి రాలేదు. నాగబాబు కూతురు నిహారిక మెగా ఫ్యామిలీలో కొత్త శకానికి నాంది పలికింది. హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి మెగా అభిమానులను అలరించబోతోంది.

గత కొంత కాలంగా బుల్లితెరపై యాంకర్ గా అదరగొడుతున్న నిహారిక త్వరలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మధుర శ్రీధర్‌ నిర్మించే సినిమా ద్వారా నిహారిక ఎంట్రీ ఇస్తోన్నసంగతి తెలసిందే. ఈ సినిమా ఇంకా ప్రారంభం కాక ముందే ఆమెకు హీరోయిన్ గా మరో ఆఫర్ కూడా వచ్చినట్లు సమాచారం.

అవార్డు సినిమా దర్శకుడు అయోధ్య కుమార్ దర్శకత్వంలో ఆమె సినిమా అంగీకరించినట్లు సమాచారం.అయోధ్య కుమార్ మిణుగురులు చిత్రంతో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. మంచి కాన్సెప్టుతో కూడిన కథ చెప్పడంతో నాగబాబు ఓకే చేసినట్లు సమాచారం. మరో విశేషం ఏమిటంటే....ఈ చిత్రం తెలుగు-తమిళంలో తెరకెక్కబోతోందట.

Ayodhya Kumar Movie with Niharika

ఇక నిహారిక ఓకే చేసిన మొదటి సినిమా విశేషాల్లోకి వెళితే..‘మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు' వంటి ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు ఈ చిత్రానికి దర్శకుడు. నాగశౌర్య కథానాయకుడు. మధుర శ్రీధర్‌ మాట్లాడుతూ ‘‘రామరాజు చక్కని కథ, కథనాలతో కొత్తదైన ప్రేమకథ చెప్పారు. ఎటువంటి వల్గారిటీ లేకుండా స్వచ్చమైన ప్రేమకథతో రూపొందనున్న చిత్రమిది.

మెగా ఫ్యామిలీ వారసురాలైన నిహారికను మా బ్యానర్‌ ద్వారా హీరోయిన్‌గా లాంచ్‌ చేయడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్‌ నెలాఖరులో షూటింగ్‌ మొదలుపెడతాం'' అని తెలిపారు. ఈ చిత్రానికి ఎ.అభినయ్‌, డా.కృష్ణ భట్ట సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

English summary
Film Nagar source said that Ayodhya Kumar Movie with Niharika.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu