»   » హైదరాబాదీ క్రికెటర్ అజారుద్దీన్ మూవీ‘అజర్’ పబ్లిక్ టాకేంటి?

హైదరాబాదీ క్రికెటర్ అజారుద్దీన్ మూవీ‘అజర్’ పబ్లిక్ టాకేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాదీ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో తెరెక్కిన చిత్రం 'అజర్'. 'ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్' అనేది ట్యాగ్ లైన్. అజారుద్దీన్ పాత్రలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మి నటించాడు. టోనీ డిసౌజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ రోజు రిలీజైంది.

క్రికెట్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో...అజారుద్దీన్ క్రికెట్లో అంచలంచెలుగా ఎదిగిన ఘట్టాలు....మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం తర్వాత అతను ఎదుర్కొన్న పరిస్థితులును ప్రధానంగా ఫోకస్ చేసారు. ఇందులో అజారుద్దీన్ ప్రేమ వ్యవహారం, పెళ్లి అంశాలను కూడా ఇంట్రెస్టింగ్ గా చూపించడం గమనార్హం.

ప్రేక్షకులకు, అభిమానులను తెరపై ఉన్నది అజారుద్దీనే అనే ఫిలింగ్ కలిగేలా ఇమ్రాన్ హస్మి ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేందుకు చాలా కష్టపడ్డాడు. అజారుద్దీన్ స్టైయిల్‌లో బ్యాటింగ్ చేసేందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. ఈ విషయంలో అజారుద్దీనే వచ్చి ఇమ్రాన్‌కు స్వయంగా ట్రైనింగ్ ఇచ్చారు.

Azhar Movie Public Talk Hit or Flop

ఆ మధ్య విడుదలైన టీజర్లో నేను మూడు కారణాలు వలన బాగా ఫేమసయ్యాను. దేవుడ్ని నమ్మడం, పెళ్లి, మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ అజర్ డైలాగులు సినిమాపై ప్రేక్షకులకు అంచనాలు మరింత పెరిగేలా చేసాయి. అజార్ కు అత్యంత ఆప్తుడిగా పేరున్న వ్యక్తి ఆంటోనీ డిసౌజా. ఈ క్రికెటర్ జీవితాన్ని దగ్గర నుంచి పరిశీలించిన ఆంటోనీ సినిమాను వాస్తవానికి దగ్గరగా తీర్చిదిద్దాడు అనే ప్రచారం చేసారు.

ఈ ప్రచారం అంతా చూసి ప్రేక్షకులు అజారుద్దీన్ జీవితంలో అసలేంజరిగింది? అనే విషయాలు తెలుసుకునేందుకు థియేటర్లకు రావడం ఖాయం. అయితే సినిమా చూసిన చాలా మంది అసంతృప్తిగానే బయటకు రావడం కనిపించింది.

ఎందుకంటే ఈ చిత్రాన్ని బయోపిక్ లాగా కాకుండా....సినిమాటిక్ గా తీసారు. సినిమా ప్రారంభంలోనే ఇది బయోపిక్ కాదు సినిమాటిక్ డ్రామాను జోడించి తెరకెక్కించిన చిత్రం అంటూ ఓ ప్రకటన చేసారు. దీంతో ప్రేక్షకులు సినిమా ఏదో తేడా కొట్టేట్లు ఉంది అనే అనుమానం అక్కడే కలిగింది.

సినిమాల చాలా సాగదీసినట్లు ఉండటం, చప్పగా సాగే డైలాగులు, ప్రధాన తారాగణం నటన కూడా అంతగా ఆకట్టుకోలేక పోవడం సినిమాకు పెద్ద మైనస్ గా నిలిచింది. ఎండ్ అంటూ లేని కోర్టు సీన్లు కూడా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయి. ఓవరాల్ గా సినిమాను అటు గేమ్ స్పిరిట్ కోణంలోగానీ, ఇటు పర్శనాలిటీ(అజారుద్దీన్) పరంగా కానీ సంపూర్ణంగా తెరకెక్కించలేదనే విమర్శలు వస్తున్నాయి.

ఓరాల్ గా సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచినట్లే టాక్ వినిపిస్తోంది. మరికొన్నిసేపట్లో సినిమాకు సంబంధించిన పూర్తి రివ్యూ....

English summary
Film Folks Here it is Azhar Film Review It is an upcoming movie of Bollywood hero, Emraan Hashmi. The movie is a biographical sports film which is based on the real life of most favorite Former Indian Cricketer, Mohammad Azharuddin.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu