»   » హాట్ అండ్ సెక్సీగా ‘బిఎ పాస్’ తెలుగు ట్రైలర్ (వీడియో)

హాట్ అండ్ సెక్సీగా ‘బిఎ పాస్’ తెలుగు ట్రైలర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అజయ్ బాల్ దర్శకత్వంలో హిందీలో తెరకెక్కిన ‘బిఏ పాస్' అనే చిత్రం అక్కడ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకుంది. ‘చక్ దే ఇండియా' ఫేం శిల్ప శుక్లా, షాదాబ్ కమల్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎంజిఎం(మినిమమ్ గ్యారంటీ మూవీస్) బ్యానర్ పై నిర్మాత ఎం.అచ్చిబాబు అందిస్తున్నారు.

BA Pass Movie Telugu Theatrical Trailer

మాటల రచయిత వి.ఎస్.పి.తెన్నేటి ఈ చిత్రానికి డైలాగ్స్ అందించారు. ఆగస్టు 17న సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత ఎం.అచ్చిబాబు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, బెక్కం వేణుగోపాల్, మల్కాపురం శివకుమార్, గొట్టిముక్కల పద్మారావు, వి.ఎస్.పి తెన్నేటి తదితరులు పాల్గొన్నారు.

నిర్మాత మాట్లాడుతూ...మా బేనర్లో వస్తున్న తొలి చిత్రం ఇది. హిందీలో ఈచిత్రం ఘన విజయం సాధించడంతో పాటు అనే అవార్డులు సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో అనేక జాగ్రత్తలు తీసుకుని విడుదల చేస్తున్నాం. తెన్నేటిగారు మంచి డైలాగ్స్ రాసారు. ఈ నెల 17న సినిమా విడుదల చేస్తున్నాం అన్నారు.

English summary
Watch BA Pass Movie Theatrical Trailer : Latest Tollywood Movie 2015. Starring : Shilpa Shukla, Shadab Kamal, Dibyendu Bhattacharya, Rajesh Sharma, Geeta Agarwal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu