twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ఎఫెక్ట్ లేదు-‘బాద్ షా’ విడుదలపై బండ్ల గణేష్ ట్వీట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నిర్మాత బండ్ల గణేష్‌ ఇంటిపై ఇటీవల ఐటి దాడులు జరుగడం, రెండు రోజుల పాటు ఆదాయపుపన్ను శాఖ అధికారులు ఆయన ఇల్లు, ఆఫీసులో సోదాలు నిర్వహించడం, ఆ తర్వాత అతన్ని ఇన్‌కం టాక్స్ ఆఫీసుకు పిలిపించి ప్రశ్నించడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల ప్రభావం ఆయన ప్రస్తుతం జూ ఎన్టీఆర్ హీరోగా నిర్మిస్తున్న 'బాద్ షా' చిత్రంపై పడుతుందని అంతా భావించారు. అయితే ఆ అనుమానాలను నివృత్తి చేస్తూ బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా ప్రకటన చేసారు.

    'బాద్ షా ఆడియో మార్చి 10న విడుదల చేయబోతున్నాం. అదే విధంగా ఏప్రిల్ 5న సినిమాను విడుదల చేస్తాం. ఈ చిత్రం గొప్పవిజయం సాధిస్తుంది. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది' అంటూ బండ్ల గణేష్ తన ట్విట్టర్లో ట్వీట్ చేసారు. 'బాద్ షా' చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బేనర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

    సినిమాకు సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ ఇటలీ, స్విట్జర్లాండ్, బ్యాంకాక్ లలో జరిగింది. కొన్ని సీన్లను మాత్రం హైదరాబాద్ లో చిత్రీకరించారు. క్లైమాక్స్ కు సంబంధించిన కొన్సి యాక్షన్ సీక్వెన్స్ ఇటీవల నాగార్జున సాగర్ వద్ద చిత్రీకరించారు. దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు.

    ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    "Happy to share with u Baadshah audio will be on march10 Grand release April 5 it's a blockbuster:-)" Bandla Ganesh tweeted. The Srinu Vytla-directed film has completed major part of the shooting. Kajal Aggarwal is playing the female lead and SS Thaman is scoring the music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X