twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ 'బాద్ షా' పై రూమర్స్ పై కోన వెంకట్ వివరణ

    By Srikanya
    |

    హైదరాబాద్ : గతంలోనూ పెద్ద హీరోల సినిమాలపై ఎన్నో రూమర్స్ వచ్చేవి కానీ ...వెంటనే సినిమా వారు స్పందించటానికి అవకాసం ఉండేది కాదు. కానీ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్..ముఖ్యంగా ట్విట్టర్ వినియోగం సినిమావారు బాగా పెంచటంతో వెంటనే వారు బయిట ప్రచారంలో ఉన్న రూమర్స్ ని ఖండించి అభిమానులను ఆనందపరుస్తున్నారు. ఓ రకంగా ఈ విధానం సినిమా పబ్లిసిటీకి పనికి వస్తుంది..మరొకటి అభిమానుల్లో సినిమాపై ఉండే అపోహల్ని తొలిగించినట్లు అవుతుంది. తాజాగా కోనవెంకట్..తన ట్వీట్ లో ఎన్టీఆర్ బాద్షా చిత్రంపై వచ్చిన రూమర్ పై వివరణ ఇచ్చారు.

    కోన వెంకట్ ట్వీట్ లో..." నేనూ,గోపీ మోహన్ రాసిన బాద్షా కథ 100% ఒరిజనల్ . ఆ కథ ఎక్కడనుంచి కాపీ, ఏ భాష నుంచీ కాపీ చెయ్యలేదు. రూమర్స్ అన్నీ అంసంబద్దమే. మర్కెట్ లో ఉన్న బాద్షా స్టోరీ పై ఉన్న రూమర్స్ అన్నీ చదివాను. అవి నిజానికి అంత బ్యాడ్ గా లేవు. మొదటిసారి రూమర్స్ లో కూడా క్రియేటివిటీ కనపడింది. ", అన్నారు.

    ఇక ఈ చిత్రం కోసం తమిళ హీరో శింబు ఓ పాటను ఆలపించారు. 'డైమండ్‌ గాళ్‌..' అంటూ సాగే హుషారైన పాటను ఆయన పాడారు. ఈ చిత్రానికి తమన్‌ స్వరకర్త. 'బ్యాక్‌ బెంచ్‌ స్డూడెంట్‌' చిత్రం కోసం కూడా శింబు గాయకుడి అవతారం ఎత్తారు. ఎన్టీఆర్‌తో ఉన్న స్నేహం కారణంగానే 'బాద్‌ షా' కోసం శింబు పాట పాడేందుకు అంగీకరించారని తెలుస్తోంది. వచ్చే నెలలో 'బాద్‌షా' పాటల్ని విడుదల చేస్తారు.

    ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ- ''తెలుగు చిత్రపరిశ్రమలోనే భారీ బడ్జెట్ చిత్రం ఇది. ఎన్టీఆర్, కాజల్‌లతో పాటు తెలుగు, తమిళ, హిందీ రంగాలకు చెందిన 50మందికి పైగా ప్రముఖ నటీనటులు ఇందులో నటిస్తున్నారు. ఆసక్తిగొలిపే కథ, కథనాలతో ఈ సినిమా రూపొందుతోంది.ఇందులోని యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ ప్రేక్షకుల్ని అద్భుతంగా ఎంటర్‌టైన్ చేస్తాయి. 'బాద్‌షా'గా ఓ కొత్త ఎన్టీఆర్‌ని చూస్తారు'' అని తెలిపారు. తమన్, గోపీమోహన్, కోన వెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు తెరవెనుక ప్రముఖంగా పనిచేస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల.

    English summary
    Writer Kona Venkat has cleared that the rumours that the story of NTR's upcoming film,'Baadshah', in the direction of Srinu Vytla is inspired from some other movie is false. "Baadhshah is a 100% original story written by me and Gopimohan. It is not copied from any film in any language. All the rumours are trash. I read the story doing rounds in the market as Baadshah story. Actually it is not bad. For the first time, I found creativity in a rumour", he said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X