»   » మహేష్ బాబు బావ అని తెలిసి అక్కడంతా షాక్... (ఫోటోస్)

మహేష్ బాబు బావ అని తెలిసి అక్కడంతా షాక్... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిన్న మొన్నటి వరకు బాలీవుడ్లో సుధీర్ బాబు అంటే ఎవరె తెలియదు. బాలీవుడ్ మూవీ 'బాఘీ' ట్రైలర్ విడుదలైన వెంటనే సుధీర్ బాబు ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు. బాఘీ చిత్రంలో సుధీర్ బాబు విలన్ గా నటిస్తున్నాడు. నిన్న విడుదలైన ట్రైలర్ లో సుధీర్ బాబు చేసిన టెర్రిఫిక్ యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి.

ట్రైలర్ విడుదలైన వెంటనే సుధీర్ బాబు యాక్షన్ సన్నివేశాలు చూసిన వారంతా.....అసలు ఎవరీ సుధీర్ బాబు? అని ఆరాతీయడం మొదలు పెట్టారు. చాలా కాలంగా బాఘీ చిత్రానికి సంబంధించిన న్యూస్ బాలీవుడ్ మీడియాలో వస్తున్నా నిన్న మొన్నటి వరకు సుధీర్ బాబును పట్టించుకున్న పాపాన పోలేదు బాలీవుడ్ మీడియా.

ట్రైలర్ విడుదలైన తర్వాత బాలీవుడ్ మీడియా దృష్టి అంతా ఒక్కసారిగా సుధీర్ బాబు వైపు మళ్లింది. ఇతను మహేష్ బాబుకు స్వయాన బావ అని తెలిసి బాలీవుడ్ ప్రేక్షకులు షాకవుతున్నారు. అప్పుడే అతడికి డెడ్లీ విలన్ అంటూ బిరుదు ఇచ్చేసారు. ట్రైలర్ విడుదలైన వెంటనే సుధీర్ బాబు ట్వీట్ చేసారు. 'ఎక్కడో బాలీవుడ్ లో ఓ ఛాలెంజింగ్ రోల్ కోసం వెతుక్కుంటూ ఓ తెలుగువాడిని తీసుకుపోయారు. మనం ఎవరికీ తక్కువ కాదు'' అంటూ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు అందరిలో హాట్ టాపిక్ గా మారింది.

టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా షబ్బీర్ ఖాన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోది. సాజిద్ నడియావాలా నిర్మాత. స్లైడ్ షోలో 'బాఘీ' సెట్స్ కు సంబంధించిన ఫోటోస్....

శ్రద్ధా కపూర్, సుధీర్ బాబు

శ్రద్ధా కపూర్, సుధీర్ బాబు


బాఘీ మూవీ సెట్స్ లో హీరోయిన్ శ్రద్దా కపూర్ తో కలిసి ఆ చిత్రంలో విలన్ సుధీర్ బాబు.

లొకేషన్ పిక్

లొకేషన్ పిక్


బాఘీ చిత్రానికి సంబంధించిన లొకేషన్ పిక్.

హీరోకు పోటీగా...

హీరోకు పోటీగా...


బాఘీ చిత్రంలో హీరోకు పోటీగా సుధీర్ బాబు రోల్ ఉంటుంది. టైగర్ ష్రాఫ్ కండలు తిరిగిన బాడీకి... తన సిక్స్ ప్యాక్ తో గట్టి పోటీ ఇచ్చాడు సుధీర్ బాబు.

డెడ్లీ విలన్

డెడ్లీ విలన్


బాఘీ ట్రైలర్ లో సుధీర్ బాబు స్టంట్స్ చూసిన బాలీవుడ్ ప్రేక్షకులు అతన్ని డెడ్లీ విలన్ అంటూ పిలుస్తున్నారు.

హీరో లుక్

హీరో లుక్


ఆల్రెడీ సుధీర్ బాబు తెలుగులో హీరో. బాఘీ ట్రైలర్లో సుధీర్ బాబును చూసిన ప్రేక్షకులు స్టన్నయిపోతున్నారు.

స్టైలిష్ లుక్

స్టైలిష్ లుక్


బాఘీ చిత్రంలో సుధీర్ బాబు స్టైలిష్ లుక్ తో ఆకట్టుకోబోతున్నారు.

మహేష్ బాబు బావ

మహేష్ బాబు బావ


సుధీర్ బాబు స్వయంగా మహేష్ బాబు బావ అని తెలిసి అంతా షాకవుతున్నారు.

ఒళ్లు గగుర్బొడిచే స్టంట్స్

ఒళ్లు గగుర్బొడిచే స్టంట్స్


బాఘీ చిత్రంలో సుధీర్ బాబు ఒళ్లు గగుర్బొడిచే స్టంట్స్ చేసారు.

English summary
Baaghi movie's trailer was out on March 14th evening, where the makers left the viewers and critics gasping for breath with its thrilling teaser. The movie directed by Sabbir Khan has Tiger Shroff and Shraddha Kapoor in the lead roles! We saw both actors do some crazy action scenes, but it is the villain of the movie, Sudheer Babu who got showered with compliments on social media following his deadly action scenes in the trailer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu