»   » ప్రభాస్‌తో అనుష్క హాట్ హాట్‌గా.. మళ్లీ ఇద్దరు ఒక్కటవుతున్నారట..

ప్రభాస్‌తో అనుష్క హాట్ హాట్‌గా.. మళ్లీ ఇద్దరు ఒక్కటవుతున్నారట..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి2 తర్వాత ప్రభాస్ నటించబోయే సాహో చిత్రం కంటే ఆ సినిమాలో నటించనున్న హీరోయిన్ల ఎంపికపైనా మీడియాలో చర్చ జరుగుతున్నది. సాహో చిత్రంలో నటించే హీరోయిన్ల కోసం నిర్మాతలు వేట కొనసాగిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్లను తీసుకోవాలనే టార్గెట్‌గా నిర్మాతలు ఇటీవల అందాల తారలు శ్రద్ధాకపూర్, దిశాపటానీని సంప్రదించారనే మీడియాలో తాజా కథనం. ఆ తర్వాత కత్రినా కైఫ్ ఎంపిక ఖారారైనట్టు వార్తలు వచ్చాయి. ఇవన్నీ పక్కన పెట్టి జాతీయ మీడియాలో సాహో చిత్రంలో ప్రభాస్ పక్కన అనుష్కశెట్టి నటించనున్నారనే ఆసక్తికరమైన వార్త జోరుగా ప్రచారమవుతున్నది.

ప్రభాస్ సరసన హాట్ హాట్‌గా

ప్రభాస్ సరసన హాట్ హాట్‌గా

బాహుబలి2 తర్వాత దేశవ్యాప్తంగా ప్రభాస్ హాట్‌గా మారారు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభాస్ పక్కన హాట్ హాట్ యంగ్ హీరోయిన్లను ఎంపిక చేయాలని నిర్ణయించారు. అందుకోసం భారీగానే నిర్మాతలు ప్రయత్నం చేశారు. కానీ వర్కవుట్ కావడంతో దక్షిణాదిలో మంచి ఫాలోయింగ్ ఉన్న అనుష్కను ఎంపికచేస్తే బాగుంటుదనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

అనుష్కకు ఆఫర్ల వెల్లువ..

అనుష్కకు ఆఫర్ల వెల్లువ..

ఒకవేళ ఈ వార్త నిజమైతే.. బాలీవుడ్‌లో అనుష్క ఎంట్రీ ఖాయమైనట్టే. బాహుబలి సినిమా తర్వాత అనుష్కకు బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నదనే వార్త వినిపించింది.

కెమిస్ట్రీకి మంచి మార్కులు..

కెమిస్ట్రీకి మంచి మార్కులు..

టాలీవుడ్‌లో ప్రభాస్, అనుష్క జంటకు మంచి ప్రేక్షకాదరణ ఉంది. గతంలో ప్రభాస్‌తో కలిసి మిర్చి, బిల్లా చిత్రాల్లో నటించింది. ఈ రెండు చిత్రాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకొన్నాయి. తాజాగా ప్రభాస్, అనుష్క నటించిన బాహుబలి సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం గురించి అందరికీ తెలిసిందే. బాహుబలి1, బాహుబలి2 చిత్రాల్లో దేవసేన పాత్రలో అనుష్కకు మంచి మార్కులే పడ్డాయి.

ప్రభాస్, అనుష్క అఫైర్..

ప్రభాస్, అనుష్క అఫైర్..

ఇదిలా ఉండగా, ప్రభాస్, అనుష్క మధ్య అఫైర్ జోరుగా సాగుతున్నది. వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనే రూమర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే వాటికి సంబంధించిన ఆధారాలు, విషయాలు వెలుగుచూడకపోవడంతో ఆ వార్తలు చల్లబడ్డాయి.

శ్రద్ధాకపూర్, దిశాపటానీ డిమాండ్..

శ్రద్ధాకపూర్, దిశాపటానీ డిమాండ్..

సాహో చిత్రం కోసం బాలీవుడ్ హీరోయిన్లను సంప్రదించగా శ్రద్ధాకపూర్ రూ.8 కోట్లు, దిశా పటానీ రూ.5 కోట్లు డిమాండ్ చేశారనేది జాతీయ మీడియా కథనాలు. కత్రినా కైఫ్ రెమ్యునరేషన్ గురించిన న్యూస్ పెద్దగా బయటకు రాలేదు. కానీ తాజాగా ప్రభాస్ సరసన సాహో చిత్రంలో అనుష్కను ఎంపిక చేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి.

150 బడ్జెట్ కోట్లతో

150 బడ్జెట్ కోట్లతో

బాహుబలి2 తర్వాత ప్రతిష్ఠాత్మకంగా సాహో చిత్రాన్ని 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి రన్ రాజా రన్ ఫేం దర్శకుడు సుజిత్ డైరెక్టర్. ఈ చిత్రం ఏకకాలంలో తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో రూపొందనున్నది.

English summary
There were rumours that makers of Saaho were keen to rope in a Bollywood actor as the leading lady. In fact, buzz had it that Katrina Kaif was approached for the multi-lingual film. But that turned out to be false. According to a report in BollywoodLife.com, the makers are in talks with Anushka for Saaho.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu