»   » ‘బాహుబలి 2’ ఆడియో ట్రాక్ లిస్ట్ ఇదిగో, అందులో అదిరిపోయే విశేషాలు ఇవీ

‘బాహుబలి 2’ ఆడియో ట్రాక్ లిస్ట్ ఇదిగో, అందులో అదిరిపోయే విశేషాలు ఇవీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి 2' ట్రైలర్ రీసెంట్ గా విడుదలై రికార్డ్ లు బ్రద్దలు కొడుతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ రెడీ అవుతున్న ఈ చిత్రం ఆడియో వేడుక కూడా త్వరలో భారీ ఎత్తున జరగనుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో ఆడియో ట్రాక్ లిస్ట్ ని ఆ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఎమ్.ఎమ్ కీరవాణి సోషల్ మీడియాలో షేర్ చేసారు.

మీరు గమనిస్తే ఈ చిత్రంలో ఐదు పాటలు ఉన్నాయని అర్దం అవుతుంది. ఆ పాటల్లో మూడు పాటలు కీరవాణి రాయగా, ఆయన కుమారుడు కాల భైరవ...రెండు పాటలను పాడటం విశేషం.


ఇక విడుదలైన నాటి నుంచీ ఇంటర్నెట్ లో 'బాహుబలి' సంచలనాలు సృష్టిస్తోంది. 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' ట్రైలర్‌ విడుదలైనప్పట్నుంచీ ఎక్కడ చూసినా దాని గురించే చర్చ. ఎవరి నోట విన్నా 'నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా... ' అంటూ ప్రభాస్‌ చెప్పిన సంభాషణే వినిపిస్తోంది.ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమా కాబట్టి అందుకు దీటుగా థియేట్రికల్‌ ట్రైలర్‌ని సిద్ధం చేశారు దర్శకుడు రాజమౌళి. విడుదలైన గురువారం నుంచి ఆ ట్రైలర్‌ సృష్టిస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. భారత దేశంలోనే అత్యధిక మంది చూసిన సినిమా ట్రైలర్‌గా ఇప్పటికే రికార్డుని సొంతం చేసుకొంది. అంతేకాదు.. ప్రపంచంలోనే ఎక్కువమంది చూసిన థియేట్రికల్‌ ట్రైలర్లలో ఒకటిగానూ నిలిచింది.


ఇప్పుడు మరో ఘనత 'బాహుబలి'కి దక్కింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఎక్కువ లైకులు సొంతం చేసుకొన్న భారతదేశపు వీడియోగా 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' ట్రైలర్‌ రికార్డుని సొంతం చేసుకొంది. పదిలక్షల కంటే ఎక్కువ సంఖ్యలో లైకులు ఆ ట్రైలర్‌ సొంతమవడం విశేషం. ఈ విషయాన్ని బాహుబలి అధికారిక పేజీలో రాశారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకొస్తుంది.ఈ క్రమంలో గూగుల్ బాహుబలి 2 పేరిట 6 సెకండ్ల నిడివి గల ఓ యానిమేటెడ్ క్లిప్‌ను విడుదల చేసింది. అందులో బాహుబలిగా ఉండే ప్రభాస్ ఆ తరువాత ఐన్‌స్టీన్ వేషంలోకి మారుతాడు. అనంతరం ఆ వేషధారణపై హోలీ రంగులు వచ్చి పడేటట్లు డిజైన్ చేసింది. తమ సెర్చ్ ఇంజిన్‌లో అత్యంత ఎక్కువగా ట్రెండ్ అవుతున్న విషయం కనుకనే బాహుబలి 2 కి చెందిన ఆ క్లిప్‌ను విడుదల చేసినట్టు గూగుల్ ఇండియా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.ఒక జీనియస్ మైండ్ యుద్ధ వీరుడి గుండెతో కలిస్తే కలర్ ఫుల్ గా ఉంటుంది అంటూ హోలీ రంగుల్ని చల్లింది. ఇలా గూగుల్ ఇండియా ఒక టైలర్ ట్రేండింగ్ ను ఇలా ప్రెజెంట్ చేయడం ఇదే మొదటిసారి.


English summary
The audio track list of 'Baahubali 2' album has come out. Music composer M M Keeravani shared it with his followers on social media.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu