»   » బాహుబలి 2 సంబరాలు... ఎందుకో తెలుసా?

బాహుబలి 2 సంబరాలు... ఎందుకో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'బాహుబలి 2' ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం విజయవంతంగా 75 రోజులు పూర్తి చేసుకుంది.

దేశ వ్యాప్తంగా పలు థియేటర్లలో బాహుబలి-2 మూవీ ఇంకా రన్ అవుతోంది. త్వరలోనే 100 రోజులను అందుకున్నా ఎలాంటి ఆశ్చర్యం లేదని అంటున్నారు సినీ విశ్లేషకులు. సినిమాలు 100 రోజులు నడిచే కాలం ఎప్పుడో కనుమరుగైన ఈ రోజుల్లో బాహుబలి 2 మూవీ విడుదలైన అన్ని భాషల్లో సక్సెస్ ఫుల్‌గా ఇన్ని రోజులు రన్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు.


దేశ వ్యాప్తంగా సెలబ్రేషన్స్

దేశ వ్యాప్తంగా సెలబ్రేషన్స్

బాహుబలి మూవీ దేశ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా 75 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో బాగా లాభాలు ఆర్జించిన డిస్ట్రిబ్యూటర్లు సెలబ్రేషన్స్ నిర్వహించారు.


'Baahubali' Prabhas and Rajamouli to team up for Another Project
చైనాలో భారీ రిలీజ్

చైనాలో భారీ రిలీజ్

బాహుబలి 2 చిత్రాన్ని చైనాలో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. చైనాలో సక్సెస్ అయితే బాహుబలి 2 మూవీ దంగల్ రికార్డును తొక్కేసి నెం.1 స్థానంలో నిలిచే అవకాశం ఉంది.


టెక్యో, ఒసాకా

టెక్యో, ఒసాకా

ఇటీవలే బాహుబలి 2 మూవీ టోక్యో, ఒసాకాలో ప్రీమియర్స్ వేశారు. దీన్ని బట్టి జపాన్‌లో కూడా సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.రష్యాలో రిలీజ్

రష్యాలో రిలీజ్

ఇటీవల మాస్కో ఇంటర్నేషనల్ మూవీ ఫెస్టివల్ లో ‘బాహుబలి 2' చిత్రాన్ని ప్రదర్శించగా మంచి రెస్పాన్స్ వచ్చింది. రష్యాలో కూడా ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
English summary
Baahubali 2 has completed 75 days at the theaters and it wouldn’t be a surprise if it touches 100 days, making yet another record in the history of Indian cinema.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu