»   » పవన్ కళ్యాణ్ స్పూర్తితోనే ‘బాహుబలి-2’లో ఆ సీన్ : విజయేంద్రప్రసాద్

పవన్ కళ్యాణ్ స్పూర్తితోనే ‘బాహుబలి-2’లో ఆ సీన్ : విజయేంద్రప్రసాద్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి-2 మూవీలో ఇంటర్వెల్ ముందు వచ్చే..... భల్లాలదేవుడి పట్టాభిషేకం సీన్ ఫస్టాఫ్ మొత్తానికి హైలెట్ అయిన సంగతి తెలిసిందే. మహిష్మతి రాజ్యానికి అమరేంద్ర బాహుబలి రాజు కావాల్సి ఉండగా... భల్లాలదేవుడు పన్నాగాలు పన్ని ఆ పదవి తనకే వచ్చేలా చేసుకుంటాడు. దీంతో మాహిష్మతి సర్వసైన్యాధ్యక్షుడిగా అమరేంద్ర బాహుబలి ప్రమాణ స్వీకరాం చేయాల్సి వస్తుంది.

సర్వసైన్యాధక్షుడిగా అమరేంద్ర బాహుబలి ప్రమాణ స్వీకరం చేస్తుండగా.... ప్రజలంతా అతడికి మద్దతుగా బాహుబలి... బాహుబలి అంటూ నినాదాలతో హోరెత్తిస్తారు. బాహుబలికి ఉన్న మద్దతు చూసి భల్లాలదేవుడు అసూయపడతాడు. ఈ సీన్ రాయడానికి తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పూర్తి అంటున్నారు ఈ చిత్ర కథా రచయిత విజయేంద్ర ప్రసాద్.

ఆ సీన్ రాస్తుండగా పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు

ఆ సీన్ రాస్తుండగా పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు

భల్లాలదేవుడికి మహారాజుగా పట్టాభిషేకం జరిగినా.... అతనిలో సంతృప్తి ఉండదు. అందుకు కారణం బాహుబలికే ప్రజామద్దతు ఉండటం. ఈ సీన్ ఎలా రాయాలి అని ఆలోచిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ గుర్తుకొచ్చాడని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

ఆడియో ఫంక్షన్ సంఘటన

ఆడియో ఫంక్షన్ సంఘటన

గతంలో జరిగిన పలు ఆడియో ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ పేరు వినిపించినప్పుడల్లా, అభిమానులు వెర్రిగా ఊగిపోతూ ఉంటారు. పవణ్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది. ఇతర హీరోలు అసూయ పడే పరిస్థితి అది. పవన్ కళ్యాణ్ స్పూర్తితోనే తాను ఆ సీన్ రాసానని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

మెగా ఫంక్షన్స్ అన్నింటిలోనూ అదే పరిస్థితి

మెగా ఫంక్షన్స్ అన్నింటిలోనూ అదే పరిస్థితి

మెగా ఫ్యామిలీకి చెందిన ఏ ఫంక్షన్ జరిగినా... పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన ఉన్నా, లేక పోయినా పవర్ స్టార్.. పవర్ స్టార్ అంటూ గోల చేయడం అందరికీ తెలిసిందే. ఆయా ఫంక్షన్లకు చిరంజీవి వచ్చినా సరే పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు తమ గోల కొనసాగించడం కొత్తేమీ కాదు.

బాహుబలి

బాహుబలి

విజయేంద్రప్రసాద్ రాసిన ఈ సీన్ బాహుబలి-2 సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్‌కు మరింత బలాన్ని ఇచ్చింది. సినిమా చూసే వారి రోమాలు నిక్కపొడిచేలా ఆ సీన్ ను తెరకెక్కించారు దర్శకుడు రాజమౌళి.

English summary
Speaking to a leading Telugu daily, Vijayendra Prasad revealed that it was Pawan’s enviable fan following that has inspired the interval block of Baahubali 2.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu