»   » ‘బాహుబలి 2’ట్రైలర్ లాంచ్ మీట్ : రాజమౌళి, ప్రభాస్, రానా ఏం మాట్లాడారో..వింటే ఆశ్చర్యపోతారు

‘బాహుబలి 2’ట్రైలర్ లాంచ్ మీట్ : రాజమౌళి, ప్రభాస్, రానా ఏం మాట్లాడారో..వింటే ఆశ్చర్యపోతారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'బాహుబలి 2' ట్రైలర్‌ విడుదలైంది. అలా వచ్చిందో లేదో ట్రెండింగ్‌లో నిలిచింది. నిమిషాల వ్యవధిలోనే లక్షల మంది వీక్షించడం మొదలైంది. 'అమరేంద్ర బాహుబలి అనే నేను అశేషమైన మాహిష్మతి ప్రజల ధన, మాన, ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని, రాజమాత శివగామీ దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను' అంటూ ప్రారంభమయ్యే ట్రైలర్‌ ఆద్యంతం విజువల్‌ వండర్‌గా నిలిచింది.

ప్రతి ఫ్రేమ్‌ కన్నుల పండగే అంటే అతిశయోక్తి కాదేమో. వీడియోలో కళ్లకు ఇంపైన స్పష్టత అద్భుతం. 4కె టెక్నాలజీతో వచ్చిన ఈ ట్రైలర్‌ను వీక్షిస్తుంటే పాత్రలు కళ్లముందే కదలాడుతున్నాయా... అనిపిస్తోందని అభిమానులు అంటున్నారు.

గురువారం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. రెండో భాగంలో కథలోని పాత్రలు సవివరంగా ఆవిష్కృతమవుతాయని దర్శకుడు రాజమౌళి అన్నారు. మీడియావారు అడిగిన పలు ప్రశ్నలకు చిత్ర యూనిట్ సమాధానాలు ఇచ్చింది.

అసలైన డ్రామా ఇందులోనే

అసలైన డ్రామా ఇందులోనే

‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌' నుంచి అభిమానులు ఏం ఆశించవచ్చు? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ రాజమౌళి....పాత్రల పరిచయం, వాటి స్వభావాలు సవివరంగా ఉంటాయి. అసలైన డ్రామా ఇందులోనే ఉంటుంది అన్నారు.

అందరికీ తెలిసినా

అందరికీ తెలిసినా

ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్లు ఈ ట్రైలర్‌ చూసిన తర్వాత ఇలా జరుగుతుందేమో అని ముందే వూహించే అవకాశం ఉంది. దీనిపై మీరేమంటారు అనే ప్రశ్నకు రాజమౌళి జవాబు ఇస్తూ... నాకు ఎలాంటి ఆలోచన లేదు. సినిమా ప్రారంభమైన 20 నిమిషాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుస్తుంది. కొందరు అనుకున్నది నిజం కావచ్చు. కాకపోవచ్చు. కానీ కథను ఎంత చక్కగా చూపామన్నదే ముఖ్యం. రెండో భాగానికి సంబంధించి ఇప్పటివరకూ వచ్చిన వివిధ వూహలు తప్పు. కొన్ని మాత్రం దగ్గరగా ఉన్నాయి. కథ గురించి అందరికీ తెలిసినా నాకేం బాధలేదు అన్నారు.

వెనక్కి, ముందుకూ

వెనక్కి, ముందుకూ

ఈ ట్రైలర్‌తో మీరు సంతృప్తి చెందారా అనే ప్రశ్నకు సమాధానంగా... రాజమౌళి..... డైరెక్టర్‌గా సినిమా తీసేటప్పుడు ముందుకూ, వెనక్కి వెళ్తుంటా. ట్రైలర్‌ కట్‌ చేసినప్పుడూ అంతే. కానీ కీరవాణి బీజీఎం జోడించిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నా అన్నారు.

సినిమాపై విమర్శలు లేవు

సినిమాపై విమర్శలు లేవు

‘బాహుబలి' చిత్రానికి మీకు స్ఫూర్తి? అని మీడియావారు..రాజమౌళిని అడగగా... చిన్నప్పటి నుంచి చూసిన ప్రతీ సినిమా, కథ నాకు స్ఫూర్తి. తొలి నుంచే ఇది ఉండేది. ప్రతీ దర్శకుడిలో సినిమా కథలో రామాయణ, భారత కథలు స్ఫూర్తి కచ్చితంగా ఉంటుంది. సినిమా ఓ స్థాయి వెళ్లాలంటే అన్ని విభాగాల నుంచి సహకారం ఉండాలి. ‘బాహుబలి'ని అందరూ ఇది తమ సినిమా అనుకుని చేశారు. మీడియా కొన్ని సార్లు మాపై విమర్శలు రాసినా, చిత్రంపై మాత్రం ఎలాంటి విమర్శలు చేయలేదు. శిఖరస్థాయిలో నిలబెట్టారు అన్నారు.

సాదాసాదీగా చేస్తా

సాదాసాదీగా చేస్తా

ఈ సినిమా తర్వాత ఇంతకన్నా గొప్ప సినిమా తీస్తారా? అని అడగగా...రాజమౌళి సమాధానమిస్తూ..‘బాహుబలి2' విడుదలైన తర్వాత రెండు మూడు నెలలు సెలవులు తీసుకుని ఎక్కడికైనా వెళ్లిపోతా. తర్వాత తీసే సినిమాలు వీఎఫ్‌ఎక్స్‌తో పనిలేకుండా సాదాసీదాగా చేస్తాం అన్నారు.

ఎలాంటి మార్పులూ లేవు

ఎలాంటి మార్పులూ లేవు

తొలి భాగం విడుదల తర్వాత అంచనాలకు తగినట్టు రెండో భాగంలో ఏమైనా మార్పులు చేశారా? అనే ప్రశ్నకు... రాజమౌళి సమాధానమిస్తూ...చాలా తక్కువ మార్పులు చేశాం. బాహుబలి తొలిభాగం అయిన తర్వాత రెండో భాగం తీయడం కాదు. ఒకే కథ. సినిమా అనుకున్నప్పుడే రెండు భాగాలు అనుకున్నాం. తొలిభాగం విడుదలైన తర్వాత దానికి వచ్చిన సమీక్షలను దృష్టిలో పెట్టుకుని రెండో భాగంలో ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాల్లో మార్పులు చేశాం. ప్రాథమికంగా కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. 30శాతం వరకూ ముందే షూట్‌ చేశాం అన్నారు.

రెండో భాగంలో అదే చూపిస్తున్నాం

రెండో భాగంలో అదే చూపిస్తున్నాం

మాహిష్మతి సామ్రాజ్యం ఇందులో కొత్తగా ఉంది ఏమైనా మార్పులు చేశారా? అనే ప్రశ్నకు రాజమౌళి సమాధానమిస్తూ... తొలి భాగంలో మీరు చూసిన మాహిష్మతి సామ్రాజ్యంలో కొంత భాగమే. రెండో భాగంలో మిగిలిన ప్రాంతం చూపిస్తున్నాం అన్నారు.

అందరిపని అయ్యిపోయింది

అందరిపని అయ్యిపోయింది

నాలుగు క్లైమాక్స్‌లు షూట్‌ చేశారని సమాచారం అని మీడియావారు అడిగితే... దానికి రాజమౌళి నవ్వుతూ.. నాలుగు క్లైమాక్స్‌లా. ఒకదాన్ని తీసే సరికి అందరి పని అయిపోయింది అన్నారు.

ఫేస్ బుక్ లో వచ్చిన బగ్ వల్లే..

ఫేస్ బుక్ లో వచ్చిన బగ్ వల్లే..

సినిమాకు సంబంధించిన విషయాలు ఎలా బయటకు వస్తున్నాయి? అని అడగగానే ...రాజమౌళి సమాధానమిస్తూ...పైరసీ వేరు, లీకేజీ వేరు. ఈ రోజు కూడా సాయంత్ర 5గం.కు ట్రైలర్‌ విడుదల చేద్దాం అనుకున్నాం. కానీ ఫేస్‌బుక్‌లో వచ్చిన బగ్‌ కారణంగా ముందే వచ్చేసింది. ఎందుకు అలా జరిగిందో చూస్తున్నాం. దీనికి ఎవరూ బాధ్యులు కాదు. అయితే ఇప్పుడు అభిమానులు సంతోషంగా ఉన్నారు కదా! అని చెప్పారు.

ఒంటిచేత్తో దున్నపోతును..

ఒంటిచేత్తో దున్నపోతును..

ట్రైలర్‌లో ప్రభాస్‌-రానా ఫైట్‌పై ఆసక్తిని పెంచారు. మూవీలో ఎలా ఉంటుంది అని రాజమౌళి ని అడగ్గా....ఇదో ట్రేడ్‌ ట్రిక్‌. శివుడి పాత్రను చెప్పడానికి తొలిభాగంలో అమ్మ కోసం శివుడు శివలింగాన్ని ఎత్తుతాడు. భళ్లాలదేవుడు ఒంటిచేత్తో దున్నపోతును మట్టికరిపిస్తాడు. వీరిద్దరూ రైవల్స్‌ అని తెలుసు. రెండో భాగంలో వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్‌ సన్నివేశాలు అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నా అని చెప్పారు.

ఆ ప్రపంచంలోకి...

ఆ ప్రపంచంలోకి...

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు సింపుల్‌గా చెప్పొచ్చుగా? అని మీడియావారు అడగగా...రాజమౌళి సమాధానమిస్తూ... అది సింగిల్‌ లైన్‌ సమాధానం కాదు. ఇందుకు చంపేశాడని సింపుల్‌గా చెప్పడానికి లేదు. సినిమా ప్రారంభమైన తర్వాత అందరూ సినిమాలో మునిగిపోతారు. ఆ ప్రపంచంలోకి వెళ్లిపోతారు. వారిని థియేటర్లకు రప్పించడానికే ఆ ప్రశ్న. అందుకే అలా చూపించి తొలి భాగాన్ని వదిలేశాం అని చెప్పారు.

శివగామి సపోర్ట్

శివగామి సపోర్ట్

ఇక ట్రైలర్‌లో ‘అంతర్యుద్ధం' అని వినిపించింది. శివగామి ఎవరికి సపోర్ట్‌ చేస్తారు? అని అడగగానే ... దర్శకుడు రాజమౌళి సమాధానమిస్తూ... అది సినిమా చూస్తే అర్థమవుతుంది అని చెప్పారు.

ప్రబాస్ ఏమన్నారంటే

ప్రబాస్ ఏమన్నారంటే

అమరేంద్ర బాహుబలి కోసం ఎక్కువ కష్టపడ్డారా?మహేంద్ర బాహుబలి కోసం ఎక్కువ కష్టపడ్డారా? అనే ప్రశ్నకు హీరో ప్రభాస్‌ సమాధానమిస్తూ.. అమరేంద్ర బాహుబలి కోసమే ఎక్కువ కష్టపడ్డాను అని చెప్పారు.

అలాంటివేమీ లేవు

అలాంటివేమీ లేవు

షూటింగ్‌ సందర్భంగా రాజమౌళిలో మీరు గుర్తించిన వీక్‌ పాయింట్‌ ఏమిటి? అని అడగగా..హీరో ప్రభాస్‌ మాట్లాడుతూ... ఆయనలో ఎలాంటి వీక్‌ పాయింట్‌లు లేవు అని సమాధానమిచ్చారు.

సిన్సియర్ గా పనిచేస్తూంటా

సిన్సియర్ గా పనిచేస్తూంటా

రానాను ఉద్దేశించి... తొలి భాగంలో మీకూ పాట ఉంటే బాగుండేది అని అభిమానులు ఆశించారు. ఇందులో ఏమైనా ఉందా? అని మీడియావారు అడిగారు. దానికి రానా సమాధానం ఇస్తూ... ఈ ఫొటోలు చూస్తుంటే పాటలు పాడే వాడిలా ఉన్నానా? ‘మనోహరి'లో కూడా నేను చాలా సిన్సియర్‌గా పనిచేస్తుంటా. అని నవ్వుతూ సమాధానమిచ్చారు.

విభిన్న కథతో

విభిన్న కథతో

బాహుబలి పాత్రలు ఇతర ఫ్లాట్‌ఫాం ద్వారా కొనసాగుతాయా? అనే ప్రశ్నకు .. నిర్మాత ..శోభు యార్లగడ్డ మాట్లాడుతూ... అన్ని పాత్రలు విభిన్న కథతో ఇతర ఫ్లాట్‌ఫాం వేదికగా కొనసాగుతాయి అన్నారు.

అదృష్టవంతులు

అదృష్టవంతులు

ఈ సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘ఇలాంటి అద్భుతాన్ని నా సమర్పణలో ఆవిష్కరిస్తారని జన్మలో అనుకోలేదు. ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. హ్యాట్సాప్‌ రాజమౌళి. మీ చిత్ర బృందమంతా ఎంతో అదృష్టవంతులు. ట్రైలర్‌లో అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఇక సినిమా కోసం నెలరోజులు ఆగాలంటే పరిస్థితి ఏంటో. నేను మాత్రం రోజుకు పదిసార్లు దీన్నే చూస్తా. ఇంతకన్నా మాట ఏం చెప్పాలో మాటలు రావడం లేదు. సాహో.. సాహోరే బాహుబలి' అని అన్నారు.

ఉరుమే వచ్చింది

ఉరుమే వచ్చింది

సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ.. ‘సినిమా రిలీజ్‌ కావడం వాన అయితే.. ట్రైలర్‌ ఉరుములాంటిది. నా లాంటి వాడికి వానలో తడిస్తేనే ఆనందం. త్వరలోనే అందరం ఆ వానలో తడుస్తాం' అని అన్నారు.

ఆశ్చర్యపోతారు

ఆశ్చర్యపోతారు

రానా మాట్లాడుతూ.. ‘రాఘవేంద్రరావు గారు అన్నట్లు మాటలు రావడం లేదు. నటుడిగా నాకు ఏడేళ్లు అయితే ఐదేళ్లు ఇక్కడే అయిపోయాయి. మహిష్మతి లాంటి గొప్ప సామ్రాజ్యాన్ని ఏప్రిల్‌లో మీరు చూస్తారు. అందరూ ఆశ్చర్యపోతారు. ఇందులో నన్ను భాగస్వామిని చేసింనందుకు రాజమౌళికి ధన్యవాదాలు' అని పేర్కొన్నారు.

వీరంతా ఈ కార్యక్రమంలో

వీరంతా ఈ కార్యక్రమంలో

ఈ కార్యక్రమం హీరో ప్రభాస్‌, రానా, నిర్మాతలు.. శోభుయార్ల గడ్డ, ప్రసాద్‌ దేవినేని, ఛాయాగ్రాహకుడు కె.కె. సెంథిల్‌, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. ‘బాహుబలి' తొలి భాగాన్ని మించి రెండో భాగం ఉంటుందని అన్నారు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌'. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించారు. ‘బాహుబలి: ది బిగినింగ్‌'కు కొనసాగింపుగా ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు.

మర్చిపోలేం

మర్చిపోలేం

ఒళ్లు గగుర్పొడిచే కోట గోడలు, ఎత్తైన ప్రాకారాలు, కొండలు, నదులు, ప్రవాహ ఝరులతో ట్రైలర్‌ వైభవంగా ఉంది. ఇక తొలి భాగంలో డీగ్లామరైజ్‌డ్‌గా కనిపించిన అనుష్క.. కనురెప్పలు మూస్తే ఎక్కడ తన అందాన్ని ఆస్వాదించకుండా ఉండిపోతామో అనేంత సొగసునీ, అందచందాలనీ ప్రదర్శించింది. అమరేంద్ర బాహుబలితో ఆమె ప్రణయ రాగాలు పలికిస్తున్నది కొద్ది క్షణాలే అయినా మరిచిపోలేనంత మధురానుభూతి కలిగిస్తుంది. రానా రౌద్రం, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ఉత్సుకత ట్రైలర్‌లో కనిపించింది.

English summary
The makers of Baahubali: The Conclusion have finally released the trailer from the film. Going the trailer, SS Rajamouli's epic sequel is very likely to emerge as the highest grossing Indian film of all time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu