»   » రాజమౌళి చుతియా, ప్రభాస్ ఒంటె, బాహుబలి చెత్త సినిమా.... రివ్యూ పేరుతో అడ్డమైన వాగుడూ వాగాడు

రాజమౌళి చుతియా, ప్రభాస్ ఒంటె, బాహుబలి చెత్త సినిమా.... రివ్యూ పేరుతో అడ్డమైన వాగుడూ వాగాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమాల్ ఆర్ ఖాన్ బాలీవుడ్ లో పెద్ద చెప్పుకోదగ్గ నటుడేం కాదు 2008 లో దేశ్ ద్రోహీ అనే ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా తీసి అది కనీస స్థాయి సినిమాకూడా కాదు అనిపించుకున్నాక ఇలా అయితే లాభం లేదనుకున్నాడో ఏమో గానీ ట్విట్టర్ మీద పడ్డాడు. రీసెంట్ గా అలియా భట్ చేసిన ఒక బికినీ షూట్ ఫొటోపై అభ్యంతరకర కామెంట్స్ చేసి, బాలీవుడ్ కోపానికి గురయ్యాడు ఈ ప్రబుద్ధుడు. ఒక సారైతే ఇతగాడి పిచ్చి చేష్టలని భరించలేక బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కలిసి వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వద్దకు వెళ్లి, కమాల్ ఖాన్ ను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశాయి.

కమేడియన్ ఆఫ్ బాలివుడ్

కమేడియన్ ఆఫ్ బాలివుడ్

ఈ కమేడియన్ ఆఫ్ బాలివుడ్ గా కొందరి చేత పిలవబడే కమాల్ ఆమధ్య సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు.పవన్ కళ్యాణ్ మీద పిచ్చి కామెంట్స్ చేశాడు. అసలు ఇలాంటి జోకర్, కార్టూన్ లాంటి హీరో కంటే రాజ్ పాల్ యాదవ్ (బాలీవుడ్ కమెడియన్) సినిమాలు చూడటానికి ప్రిఫర్ చేస్తాను.


సౌత్ ఇండియన్ పీపుల్ కు ఏమైంది.

సౌత్ ఇండియన్ పీపుల్ కు ఏమైంది.

ఇలాంటి కార్టూన్ ను సినిమాల్లో హీరోగా ఎలా చూస్తారు..? వెరీ బ్యాడ్ ఛాయిస్. ఇతనే హీరో అంటే, ప్రపంచంలో ఎవరైనా హీరో అయిపోవచ్చు అంటూ ట్వీట్లు పెట్టి సౌత్ ఇండియాలోనూ పాపులర్ అయ్యాడు. పాపులర్ అవటం అంటే అందరితో బూతులు తిట్టించుకున్నాడు అని అర్థం లెండి.


పవన్ కళ్యాణ్ జోకర్ - కార్టూన్

పవన్ కళ్యాణ్ జోకర్ - కార్టూన్

సమంతా..! నువ్వు దీపికా పదుకోణే హెయిర్ డ్రెస్సర్ లా ఉన్నావ్, నువ్వు సౌత్ లో టాప్ హీరోయిన్ అటకదా అంటూ వెటకారంగా ట్వీట్ లు చేసాడు. 'ఈ పవన్ కళ్యాణ్ కూడా హీరో అయితే.. ప్రపంచంలో ఎవ్వరైనా హీరో కావచ్చు. అసలీ సౌత్ ఇండియా జనాలకు ఏమైంది? సినిమాల్లో ఈ కార్టూన్ ను వాళ్లెలా చూస్తారు? అంటూ ట్వీట్స్ చేసాడు.


థూ..! అనిపించుకున్నాడు.

థూ..! అనిపించుకున్నాడు.

అజయ్‌ ఫ్యాన్స్‌ అందరికీ నేను ఛాలెంజ్‌ చేస్తున్నాను. 'శివాయ్‌' సినిమా సోమవారం వరకు బాక్సాఫీస్‌ వద్ద నిలవదు. ఒకవేళ బాగా ఆడితే.. నేను అజయ్‌ దేవగణ్‌ ఆఫీస్‌లో పనివాడిగా చేరతాను'' అని ట్వీట్‌ చేశాడు. అయితే దీని తర్వాత కరణ్ జోహార్ ఇచ్చిన డబ్బు కోసమే అలా మాట్లాడాడన్న విషయం తెలిసి పోయి .. థూ..! అనిపించుకున్నాడు.


రజనీకాంత్ చండాలంగా ఉంటాడు

రజనీకాంత్ చండాలంగా ఉంటాడు

రజనీకాంత్ చూడటానికి చాలా చండాలంగా ఉంటాడు కానీ ఆయన ఇప్పుడు సూపర్ స్టార్ అయ్యాడా ? లేదా ? సూపర్ స్టార్ కావడానికి అందం ఒక్కటే సరిపోదని రజనీ నిరూపించాడని అంతే కాదు అందంగా ఉండే వారు మత్రమే సూపర్ స్టార్ కారని రజినీ ని ఘోరంగా అవమానించాడు. ఇలా చీప్ ట్రిక్స్ తో పబ్లిసిటీ చేసుకునే కమాల్ ఖాన్ ని పటించుకోవటం బాలీవుడ్ ఎప్పుడో మానేసింది. అందుకే ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టార్లను టార్గెట్ చేయటం మొదలు పెట్టాడు.


మోహన్ లాల్

మోహన్ లాల్ "చోటా భీమ్ లా ఉన్నాడు" అంటూ

మొన్నటికి మొన్న మళయాలీ సీనియర్ హీరో మోహన్ లాల్ ని "చోటా భీమ్ లా ఉన్నాడు" అంటూ చేసిన వ్యాఖ్యలకు విపరీతమైన విమర్శలు రావటం తో వెనక్కి తగ్గి పబ్లిక్ గా క్షమాపనలు కూడా చెప్పాడు. అయినా కూడా ఇంకా దక్షిణాది సినిమా బాలీవుడ్ కి సమానం అవటాన్ని జీర్ణించుకోలేని తత్వం ఇంకా మండుతుందేమో. బాహుబలి మీద పిచ్చి పిచ్చి కమెంట్లన్నీ చేసాడు...


వీడియో పోస్ట్‌ చేశాడు

వీడియో పోస్ట్‌ చేశాడు

ట్విట్టర్‌ వేదికగా బాలీవుడ్‌ -2 సినిమాను రివ్యూ చేస్తూ ఒక వీడియోను పోస్ట్‌ చేశాడు. ఇందులో విమర్శల బుల్లెట్ల వర్షం కురిపించాడు. అంతేకాదు హీరో ప్రభాస్‌పైకూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒంటెలా కనిపించే ప్రభాస్‌ను హిందీ నిర్మాతలు ఎవరైనా తీసుకుంటే, వారు కచ్చితంగా ఇడియట్స్ అంటూ చెలరేగిపోయి ట్వీట్‌ చేశాడు.


రాజమౌళి దర్శకత్వం అస్సలు బాగోలేదు

రాజమౌళి దర్శకత్వం అస్సలు బాగోలేదు

బాహుబలి‌2 లో కథే లేదు. రాజమౌళి ఒక చూతియా డైరెక్టర్, దర్శకత్వం అస్సలు బాగోలేదు. సంగీతం గురించి అసలు మాట్లాడక్కర్లేదు. ఎంటర్‌ టైన్‌మెంట్‌ లేదు. ఎమోషన్‌ లేదు. విఎఫ్‌ఎక్స్‌ గ్రాఫిక్స్‌ ఘోరం. థియేటర్లో ఉన్న ప్రేక్షకులను చాలా డిస్టర్బ్‌ చేస్తుంది. రియాల్టీకి దగ్గరగా లేదు. వాస్తవానికి వేలమైళ్ల దూరంలోఉంది. సంగీతం హిందీ ప్రేక్షకులకు అస్పలు నచ్చదు. ఇది కమల్‌ ఆర్‌ ఖాన్‌ రివ్యూ.


సినిమా చూడడం శుద్ధ దండుగ

సినిమా చూడడం శుద్ధ దండుగ

అంతేకాదు ఈ సినిమా చూడడం శుద్ధ దండుగ అని తేల్చేశాడు. డబ్బులు, సమయం వృధా చేసుకోవద్దంటూ ప్రేక్షకులకు ఓ సలహా ఇచ్చేశాడు. ఫస్ట్ పార్ట్‌తో పోల్చితే పదిశాతం కూడా బాగా లేదన్నాడు. ఇక ఎడిటర్‌పై అయితే తీవ్ర విమర్శలు గుప్పించాడు. అసలు ఈ సినిమా లో


"సరైన" సమాధానం చెప్పేదాకా

మూడు గంటలు తీయాల్సిన మెటీరియలేదు.. వేస్ట్ అంటూ ప్రస్తావించాడు. అంతేకాదు ఈ సినిమా పిల్లలు కంప్యూటర్‌ వీడియో గేమ్‌లా చూడ్డానికి బావుంటుందంటూ పేర్కొన్నాడు. ఎవరో ఒకరు "సరైన" సమాధానం చెప్పేదాకా సౌత్ ఇండియన్ సినిమా మీద ఈ వాగుడు ఆగదేమో.


English summary
Kamaal R Khan tweeted his valuable review to director SS Rajamouli and expressed his disappointment on watching Bahubali 2 and compared it to a cartoon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu