»   » బాహుబలి దండయాత్ర: ఇప్పటివరకూ ఎవ్వరూ సాధించలేదు...

బాహుబలి దండయాత్ర: ఇప్పటివరకూ ఎవ్వరూ సాధించలేదు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి-ది కంక్లూజన్ బాక్సాఫీసు వద్ద అప్రతిహతంగా దూసుకెలుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈచిత్రం షేర్ రెండు రోజుల్లోనే రూ. 60 కోట్లకు చేరువైంది. ఉత్తరాంధ్రలో బాహుబలి-ది కంక్లూజన్ భారీ వసూళ్లు సాధించింది. తొలి రెండు రోజుల్లో ఈ చిత్రం ఇక్కడ రూ. 6.85 కోట్లు రాబట్టింది.

ఇప్పటి వరకు ఇదే రికార్డ్

ఇప్పటి వరకు ఇదే రికార్డ్

ఈ ఏరియాలో ఇప్పటి వరకు ఇదే రికార్డ్. ఇక తొలి నాళ్ళ వసూల్లే ఇంతలా ఉంటే 100 కొట్లకు చేరటం లో ఆశ్చర్యం ఏముందీ. ఇప్పటికైతే మామూలుగా ఒక సినిమా ఓవరాల్ గా 50 కోట్లు సాధిస్తేనే సూపర్ హిట్ అనుకునే స్థితిలో ఉన్నాం. అలాంటిది ఒక్క ఏరియాలోనే 50 కోట్ల షేర్ సాధించటం అనే ఫీట్ ఒక్క బాహుబలికే సాధ్యం అయ్యింది.


11 రోజులకి నలభై ఏడు కోట్లు

11 రోజులకి నలభై ఏడు కోట్లు

ప్పటికే బాలీవుడ్ లో తన హవా కొనసాగిస్తూనే ఉన్నాడు బాహుబలి. 11 రోజులకి నలభై ఏడు కోట్లకి పైగా షేర్ సాధించిన బాహుబలి-2 ఈరోజు (మంగళవారం) లేదంటే బుధవారం రూ.50 కోట్ల షేర్ మార్కును అధిగమిస్తుందని భావిస్తున్నారు.నాన్-బాహుబలి సినిమాల్లో ఏవీ కూడా ఇప్పటిదాకా నైజాం ఏరియాలో పాతిక కోట్ల షేర్ మార్కును కూడా అందుకోలేదు.


రూ.60 కోట్ల మార్కు

రూ.60 కోట్ల మార్కు

అలాంటిది ఈ సినిమా రూ.50 కోట్ల షేర్ సాధించడం అంటే అసాధారణ విషయం. ‘బాహుబలి: ది బిగినింగ్' సాధించిన రూ.44 కోట్ల షేర్ రికార్డుకే అబ్బుర పడితే.. ఇప్పుడు ‘ది కంక్లూజన్' ఏకంగా రూ.60 కోట్ల మార్కును అందుకునేలా కనిపిస్తోంది. ఈ సినిమా హక్కుల్ని రూ.40 కోట్లకు అమ్మబోతే కొనడానికి చాలామంది సందేహించారు.


అదనపు లాభం

అదనపు లాభం

ఫస్ట్ పార్ట్ ను డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు కూడా వెనుకంజ వేశాడు. దీంతో నిర్మాతలు అడ్వాన్స్ పద్ధతిలో హక్కులు అమ్మారు. వాళ్లు రైట్స్ ఔట్ రేట్ గా అమ్మినట్లయితే రూ.40 కోట్లు మాత్రమే వచ్చి వుండేవి. కానీ ఇప్పుడు నైజాం నుంచే అరవై కోట్ల షేర్ గ్యారెంటీ అన్నట్లే ఉంది. నిర్మాతలకు దీని వల్ల అదనపు లాభం వస్తోంది.English summary
The Beginning' is the only movie to cross Rs 25 crore (Share) in Nizam territory. Now, 'Baahubali 2' emerges as the first feature film to join Rs 50 crore club in Telangana state.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu