»   » ‘బాహుబలి-2’ రిలీజ్ డేట్ ఇచ్చారు... (ఫోటోస్)

‘బాహుబలి-2’ రిలీజ్ డేట్ ఇచ్చారు... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో గతేడాది వచ్చిన పార్ట్ 1 'బాహుబలి-ది బిగినింగ్' చూసిన ప్రతి ఒక్కరూ.... పార్ట్ 2 'బాహుబలి-ది కంక్లూజన్' ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకు సమాధానం తెలసుకోవడానికైనా చాలా మంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

2016 లోనే పార్ట్ 2 విడుదల కావాల్సిన ఉన్న షూటింగ్ షెడ్యూల్ అనుకున్న సమయానికి మొదలు కాక పోవడంతో వాయిదా పడింది. 2017లోనే సినిమా రిలీజ్ చేయాలని డిసైడ్ చేసారు. తాజాగా బాహుబలి-2 రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ విషయాన్ని బాలీవుడ్ పాపులర్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఏప్రిల్ 14, 2017లో బాహుబలి సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తున్నట్లు ఆయన ఖరారు చేసారు.

బాహుబలి పార్ట్-1 భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, మళయాలంతో పాటు హిందీలో కూడా రిలీజైన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. దాదాపు రూ. 650 కోట్లు వసూలు చేసింది. ఇంతర భారీ మొత్తం వసూళ్లు ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకే సాధ్యం అనే ఒక వాదన ఉండేది. సౌత్ సినిమాలకు కూడా ఆ సత్తా ఉందని బాహుబలి సినిమా నిరూపించింది.

బాలీవుడ్ లో 'బాహుబలి' చిత్రాన్ని ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నారు. తొలి భాగం కంటే భారీ స్థాయిలో బాహుబలి-2 చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 'బాహుబలి-2' రిలీజ్ కావడానికి ఇంకా సంవత్సరానికి పైగా టైం ఉంది. ఈ గ్యాపులో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

బాహుబలి పార్ట్ 1 విడుదల సందర్భంగా తెలుగునాట థియేటర్ల వద్ద జాతర వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల టికెట్ల కోసం గొడవలు జరిగాయి. పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సారి అలాంటి ఇబ్బందులు, బ్లాక్ మార్కెటింగ్ లాంటివి జరుగకుండా పకడ్భంధీ ఏర్పాట్లు చేయనున్నారు.

స్లైడ్ షోలో బాహుబలికి సంబంధించిన రేర్ ఫోటోస్...

అసలు స్టోరీ అంతా పార్ట్ 2లోనే..

అసలు స్టోరీ అంతా పార్ట్ 2లోనే..


బాహుబలి పార్ట్ 1లో కేవలం పాత్రల ఇంట్రడక్షన్ మాత్రమే జరిగింది. అసలు స్టోరీ అంతా పార్ట్ 2లోనే ఉండబోతోంది.

సెకండ్ పార్ట్

సెకండ్ పార్ట్


తొలి భాగంలో ప్రభాస్, తమన్నాల రొమాన్స్ హైలెట్ అయింది. పార్ట్ 2లో ప్రభాస్, అనుష్కల రొమాన్స్ హైలెట్ కాబోతోంది.

ఉత్కంఠ భరిత సన్నివేశాలు..

ఉత్కంఠ భరిత సన్నివేశాలు..


పార్ట్ 2లో పోరాట సన్నివేశాలు మరింత ఉత్కంఠ భరితంగా ఉండబోతున్నాయి.

బాహుబలి

బాహుబలి


బాహుబలి బిగినింగ్ లో యుద్ధ సన్నివేశాలు హైలెట్ అయ్యాయి. మరి పార్ట్ 2లో రాజమౌళి ఎలా ప్లాన్ చేసాడో?

ప్రభాస్, రానా

ప్రభాస్, రానా


పార్ట్ 2లో ప్రభాస్, రానా మధ్య వచ్చే సన్నివేశాలు ఉత్కంఠ భరితంగా ఉండబోతున్నాయి.

డిఫరెంటుగా...

డిఫరెంటుగా...


పార్ట్ లో రాజమౌళి తన సినిమాల్లోని పాత్రలో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ చూపించబోతున్నారు.

రాజమౌళి

రాజమౌళి


రాజమౌళి సినిమా రేంజి హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని బాహుబలి తర్వాత గానీ అర్థం కాలేదు...

రానా

రానా


పార్ట్ 2లో రానా పాత్ర మరింత క్రూరంగా కనిపించబోతోంది.

అనుష్క

అనుష్క


పార్ట్ 1లో పూర్తి డీగ్లామరస్ గా కనిపించిన అనుష్క... పార్ట్ 2లో ఫుల్ గ్లామర్ తో కనిపించబోతోంది.

ప్రభాస్

ప్రభాస్


పార్ట్ 2 షూటింగు కోసం ప్రభాస్ మళ్లీ కసరత్తులు మొదలు పెట్టాడు.

ఫ్లాష్ బ్యాక్

ఫ్లాష్ బ్యాక్


పార్ట్ 2 మొత్తం ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో సాగుతుందని అంటున్నారు.

బాహుబలి

బాహుబలి


బాహుబలి సూటింగ్ సెట్లో రాజమౌళి.

రేర్ ఫోటో

రేర్ ఫోటో


బాహుబలి సినిమా సెట్స్ కు సంబంధించిన రేర్ ఫోటోల్లో ఇదీ ఒకటి.

బాహుబలి

బాహుబలి


బాహుబలి సినిమా కోసం రానా కూడా భారీగా కండలు పెంచాల్సి వచ్చింది.

ప్రభాస్...

ప్రభాస్...


బాహుబలి మూవీలో పచ్చబొట్టేసిన సాంగుకు సంబంధించిన ఫోటో..

సెట్స్ లో..

సెట్స్ లో..


బాహుబలి సెట్స్ లో రానా, ప్రభాస్, నిర్మాత శోభు

రొమాంటిక్

రొమాంటిక్


బాహుబలి సినిమాకు సంబంధించి ప్రభాస్, తమన్నా రొమాంటిక్ పిక్.

ప్రభాస్

ప్రభాస్


బాహుబలి సినిమా కోసం ప్రభాస్ కండలు మాత్రమే కాదు... భారీగా గడ్డాలు, మీసాలు పెంచాల్సి వచ్చింది

బాహుబలి సెట్స్ లో...

బాహుబలి సెట్స్ లో...


బాహుబలి సెట్స్ లో ప్రభాస్, రానా

రమ్యకృష్ణ

రమ్యకృష్ణ


బాహుబలి మూవీలో శివగామి పాత్రలో రమ్య కృష్ణ కీలకమైన రోల్ చేసింది.

యుద్ధ వీరుడు

యుద్ధ వీరుడు


బాహుబలి మూవీలో ప్రభాస్ యుద్ద వీరుడిగా పర్ ఫెక్ట్ లుక్ లో కనిపించాడు.

తమన్నా

తమన్నా


బాహుబలిలో తమన్నా సెక్సీ లుక్ తో ఆకట్టుకుంది.

రేర్ ఫోటో...

రేర్ ఫోటో...


బాహుబలి సినిమా సెట్స్ కు సంబంధించి రేర్ ఫోటో...

రేర్ ఫోటో...

రేర్ ఫోటో...


బాహుబలి సినిమా సెట్స్ కు సంబంధించి రేర్ ఫోటో...

English summary
The much awaited project of Indian cinema, Baahubali 2 finally gets a release after several postponements. Bollywood's popular trade analyst Taran Adarsh confirmed that the second instalment of Rajamouli's magnum opus has been scheduled for 14 April 2017 release.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu