»   » ఇది ఇంకా కేక:‘బాహుబలి -ది కన్‌క్లూజన్‌’ మోషన్ పోస్టర్ (వీడియో)

ఇది ఇంకా కేక:‘బాహుబలి -ది కన్‌క్లూజన్‌’ మోషన్ పోస్టర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అందరూ ఎంతో ఆసక్తిగా , కళ్లు కాయలు కాచేటట్లు ఎదురుచూసిన 'బాహుబలి -ది కన్‌క్లూజన్‌' ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది. ఈ సినిమా మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. వీటిని చూసిన అభిమానులు తొలి చిత్రం బాహుబలిని మించి మరెన్ని అద్భుతాలు ఆవిష్కృతమవుతాయో అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోషన్ పోస్టర్ ని మీరు ఇక్కడ చూడండి.ముఖ్యంగా వెనకాల వచ్చే రీరికార్డింగ్ అయితే అద్బుతం అనిపిస్తుంది.

ఇక బాహుబలి ది బిగినింగ్ కి ఫస్ట్ లుక్ ఇచ్చేముందు ఒకే ఒక్క ట్వీట్ తో దాని స్దాయి ఏంటో చెప్పాడు రాజమౌళి. 'ప్రతీ కథకు కీలకంగా ఓ సింగిల్ పాయింట్ ఉంటుంది. అదే మొత్తం కథను బాహుబలి ది బిగినింగ్ ను నడిపిస్తుంది' అంటూ ట్వీట్ చేశాడు రాజమౌళి.

అలాగే బాహుబలి2 ఫస్ట్ లుక్ రిలీజ్ కి ముందు 'తన ఎదురులేని శక్తిని ఉపయోగించి మాహిష్మతి రాజ్యాన్ని ఎలా దక్కించుకున్నాడన్నదే బాహుబలి2 ది కంక్లూజన్' అంటూ.. ఒకే వాక్యంలో బాహుబలి2 సీక్వెల్ గురించి చెప్పాడు జక్కన్న. కట్టప్ప గురించి అయితే కొత్త ట్వీట్ కూడా పెట్టలేదు.

ఆదివారం ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ 'బాహుబలి 2'లో ప్రభాస్‌ లుక్‌ని ఆవిష్కరించి అభిమానులకు పండగ చేసింది. ఓ చేతిలో గొలుసులు, మరో చేతిలో ఆయుధం, సిక్స్ ప్యాక్ , కళ్లలో మెరుపు, చూపులో చురుకు, నడకలో రాజసం... ఇవన్నీ కలగలిపి మహేంద్ర బాహుబలి ని చిర స్దాయిగా నిలిచేలా చేసాయి.

 baahubali2

షూటింగ్ దాదాపుగా పూర్తికావచ్చిన సమయంలో ప్రభాస్ పుట్టినరోజు బహుమతిగా బాహుబలి 2 ఫస్ట్‌లుక్‌ను,మోషన్ పోస్టర్ ను గ్రాండ్‌గా ఏర్పాటుచేసిన ఈవెంట్‌లో విడుదల చేశారు. సంకెళ్లు తెంచుకుంటూ సిక్స్‌ప్యాక్ బాడీతో, మెడలో గంటతో రఫ్ లుక్‌లో కనిపించిన ప్రభాస్ పోస్టర్‌ను ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆ మోషన్ పోస్టర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

English summary
The first look motion poster of SS Rajamouli's Baahubali: The Conclusion, popularly known as Bahubali 2, unveiled at the ongoing Jio MAMI (Mumbai Academy of Moving Image) Film Festival.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu