»   » ప్రపంచంలోనే తొలిసారి: ‘బాహుబలి’ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రత్యేకత ఇదే!

ప్రపంచంలోనే తొలిసారి: ‘బాహుబలి’ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రత్యేకత ఇదే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాహుబలి సెకండ్ పార్ట్ 'బాహుబలి-ది కంక్లూజన్' మూవీ ఏప్రిల్ 28న విడుదలవుతున్న నేపథ్యంలో ఆదివారం రామోజీపిల్మ్ సిటీలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తున్నారు.

ప్రపంచంలో ఇదే తొలిసారి

ప్రపంచంలో ఇదే తొలిసారి

బాహుబలి 2 ప్రి రిలీజ్ వేడుకను వర్చువల్ రియాల్టీలో కూడా ప్రసారం చేస్తున్నారు. ఒక సినిమాకు సంబంధించిన వేడుకను వర్చువరల్ రియాల్టీలో ప్రసారం చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి. ఇందుకోసం బిబి 360 సిసి పేరుతో డెవల్ చేసిన 32 కెమెరాలతో కూడిన సూపర్ వీఆర్ క్యాప్చరింగ్ అనే డివైజ్ లను ఉపయోగిస్తున్నారు.

ఫిల్మ్ సిటీలో భారీ సెట్టింగ్

ఫిల్మ్ సిటీలో భారీ సెట్టింగ్

ప్రి రిలీజ్ వేడుక కోసం రామోజీ ఫిలిం సిటీలోని మాహిష్మతి సెట్ వేసారు. దాదాపు 500 మందికి పైగా నిపుణులైన కార్మికులు ఈ సెట్ రూప కల్పనలో పాల్గొన్నారు. దర్శకుడు రాజమౌళి స్వయంగా ప్రీ రిలీజ్ వేడుక సెట్ పనులను పర్యవేక్షించారు.

సంబ్రమాశ్చర్యాలు

సంబ్రమాశ్చర్యాలు

ప్రీ రిలీజ్ ఫంక్షన్కు వచ్చిన వారు సంబ్రమాశ్చర్యాలకు గురయ్యేలా చుట్టూ మాహిష్మతి సామ్రాజ్యం కనిపించేలా, ఎత్తైన భవంతులు, జలపాతాన్ని తీర్చిదిద్దారు. తొలి భాగంలో భల్లాలదేవుని బంగారు విగ్రహాన్ని ప్రతిష్టించిన ప్రాంతం ముందు ఈ వేడుక జరుగుతుంది.

భారీ రేటుకు ప్రసార హక్కులు

భారీ రేటుకు ప్రసార హక్కులు

టీవీ 9, ఎన్టీవీ కలసి 75 లక్షలకు ఈ వేడుక టీవీ ప్రత్యక్ష ప్రసార హక్కులను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.

rn

బాముబలి 360 డిగ్రీస్ వర్చువల్ రియాల్టీ లైవ్

.

English summary
Check out Baahubali 2 - The Conclusion Pre Release Event LIVE 360°. Baahubali is a two part Indian movie that is simultaneously being shot in Telugu and Tamil. The film will also be dubbed in Hindi, Malayalam and in several other foreign languages.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu