»   »  'బాహుబలి 2' ట్రైలర్ గురించి లేటెస్ట్ ఇన్ఫో... పూర్తి వివరాలతో

'బాహుబలి 2' ట్రైలర్ గురించి లేటెస్ట్ ఇన్ఫో... పూర్తి వివరాలతో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ హిట్ 'బాహుబలి - ది బిగినింగ్' చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ప్రపంచ సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రంపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.ఈ నేపధ్యంలో తమదైన శైలి లో చిత్ర ప్రమోషన్స్ మొదలు పెట్టారు దర్శక,నిర్మాతలు.

మొదటి భాగం విజయవంతం కావడంతో రెండో భాగాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలు అత్యంత అద్భుతంగా ఉంటాయని ఇప్పటికే రాజమౌళి హింట్‌ ఇచ్చాడు.కాగా, 'బాహుబలి: ది కంక్లూజన్‌' ట్రైలర్‌ ఈ నెల 16న విడుదల కాబోతోంది.

Baahubali 2 trailer to be screened in 200 screens

అందుతున్న సమాచారం ప్రకారం ఈ ట్రైలర్ తెలుగు రెండు రాష్ట్రాల లోనూ రెండు వందల ధియోటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు నిర్మాతలు ...ధియోటర్స్ ని ఫైనలైజ్ చేసారు. ట్రైలర్ ఉదయం 9 గంటల నుంచి పది గంటల దాకా ఎంపిక చేసిన అన్ని ధియోటర్స్ లో ఉచితంగా ప్రదర్శించబడుతుంది. ట్రైలర్ రన్ టైమ్ 2.40 నిమషాలు (ఉజ్జాయింపుగా) ఉండబోతోంది.

రాజమౌళి చెప్పేదాని ప్రకారం.... మార్చి 16న ఉదయం ఈ బాహుబలిః ది కంక్లూజన్ ట్రైలర్ రిలీజవుతుంది. ముఖ్యంగా ఈ ట్రైలర్ ను ఉదయం 10 గంటల సమయానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ధియేటర్లలో రిలీజ్ చేస్తారు తప్పించి.. దీనిని ఆన్ లైన్లో మాత్రం రిలీజ్ చేయరు.

ధియేటర్లలో ట్రైలర్ ను చూసేసిన తరువాత.. అప్పుడు సాయంత్రం 5 గంటలకు యుట్యూబ్ లో రిలీజ్ చేస్తారట. బాహుబలి 1 సినిమా రిలీజ్ సమయంలో కూడా.. ముందుగా ట్రైలర్ ను ధియేటర్లలో వేసిన తరువాతనే యూట్యూబ్ లో పెట్టారు. ఇప్పుడు బాహుబలి 2 విషయంలో కూడా సేమ్ టు సేమ్ అదే ఫాలో అవుతున్నారనమాట.

English summary
That the trailer of 'Baahubali 2' will be screened in about 200 movie theatres in two Telugu states. The trailer will be screened at 9 am for one hour for all the patrons without any charge.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu