»   » ప్రభాస్.. వీడ్కోలు చెప్పడం కష్టంగా.... బాహుబలి ఓ సినిమా కాదు.. రాజమౌళి ఉద్వేగం

ప్రభాస్.. వీడ్కోలు చెప్పడం కష్టంగా.... బాహుబలి ఓ సినిమా కాదు.. రాజమౌళి ఉద్వేగం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రతిష్టాత్మకంగా రూపొందించిన బాహుబలి సినిమా కోసం ఐదేళ్లు కలిసి పనిచేసిన హీరో ప్రభాస్, రానా, హీరోయిన్ అనుష్కలకు దర్శకుడు రాజమౌళి ఉద్వేగంతో ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు రాజమౌళి వారికి వరుస ట్వీట్లు చేసి తన అభిమానాన్ని చాటుకొన్నారు.

 మీకు దూరమవ్వడం కష్టంగా ఉంది..

మీకు దూరమవ్వడం కష్టంగా ఉంది..

ఊహకందని విధంగా బాహుబలిని ఐదేళ్లపాటు తెరకెక్కించిన తర్వాత ఒక టీమ్‌గా మీకు దూరమవ్వడం కష్టంగా మారింది. వీడ్కోలు చెప్పడం మరీ చాలా కష్టంగా ఉంది. బాహుబలి ఓ సినిమాగా కాకుండా ఓ బ్రాండ్‌గా మారింది. ప్రతి ఒక్కరు హాలీవుడ్ చిత్రాలతో పోల్చిచూడటం గర్వంగా ఉంది అని ట్వీట్ రాజమౌళి పేర్కొన్నారు.

నీ అభిమానులు ఉప్పొంగుతారు..

నీ అభిమానులు ఉప్పొంగుతారు..

ప్రభాస్‌ను ఉద్దేశించి స్వీటూ.. బాహుబలి వెనుక నీ విశేష కృషి దాగి ఉన్నది. బాహుబలి2లో నీ ఫెర్ఫార్మెన్స్ చూసి నీ అభిమానులు మంత్రముగ్ధులవుతారు.. ఉప్పొంగుతారు అని బలంగా విశ్వసిస్తున్నాను.

మాటలు వెతుక్కోవాల్సి వస్తున్నది..

మాటలు వెతుక్కోవాల్సి వస్తున్నది..

ప్రభాస్ గురించి చెప్పడానికి మాటలు వెతుక్కోవాల్సి వస్తుంది. త్వరలో నేను ఇంటర్వ్యూలో వెల్లడించే అంశాలు బాహుబలి అంటే ఏమిటో తెలుస్తుంది. ప్రభాస్ బాహుబలిగా ఎందుకు ఎలా మారాడో కచ్చితంగా తెలుస్తుంది.

రానా ఉద్వేగానికి గురయ్యా..

రానా ఉద్వేగానికి గురయ్యా..

రానా.. షూటింగ్ చివరి రోజున నేను ఉద్వేగానికి గురికాకపోవడం ఆశ్చర్యమనిపించింది. కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజున నీ ప్రసంగం చూసి నేను ఉద్వేగానికి గురయ్యాను.

తన్నుకొని ప్రవాహంలా

తన్నుకొని ప్రవాహంలా

ఓ డ్యామ్ గేట్లను తన్నుకొచ్చిన నీటి ప్రవాహంలో ఉద్వేగం బయటకు వచ్చింది. బాహుబలిలో నా భల్లాళదేవగా నీవు నాకు దొరికినందుకు ధన్యవాదాలు అని రానాకు రాజమౌళి ట్వీట్ చేశారు.

వైరల్‌గా బాహుబలి సెల్ఫీ

వైరల్‌గా బాహుబలి సెల్ఫీ

మార్చి 26న (ఆదివారం) నాడు హైదరాబాద్‌లో బాహుబలి2 ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను రామోజీ ఫిలిం సిటీలో వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ వేడుకలో బాహుబలి2 యూనిట్ అంతా కలిసి దిగిన సెల్ఫీ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

100 మిలియన్ల వ్యూస్

100 మిలియన్ల వ్యూస్

బాహుబలి2 చిత్రానికి సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్‌లో ప్రభంజనం స‌ృష్టిస్తున్నది. ఇప్పటికే 100 మిలియన్ల వ్యూస్‌ను సాధించి సినీ చరిత్ర రికార్డులను తిరగరాసింది.

ఏప్రిల్ 28న విడుదల

ఏప్రిల్ 28న విడుదల

ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, సత్యరాజ్, నాజర్ నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధమవుతున్నది.

English summary
Filmmaker SS Rajamouli thanked his lead actors Prabhas, Rana Daggubati and Anushka Shetty for their contribution to make Baahubali possible. In a series of emotional tweets, the father of Baahubali bid farewell to his artists.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu