»   »  ‘బాహుబలి’ న్యూ ఇయిర్ విషెష్ (వీడియో)

‘బాహుబలి’ న్యూ ఇయిర్ విషెష్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో రూపొంది ఘన విజయం సాధించిన చిత్రం బాహుబలి . 2015 జులై 10న విడుదలైన ఈ చిత్రం అంతర్జాతీయంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచింది. ఈ చిత్రం విశేషంగా ప్రేక్షకుల ఆదరణ పొందడమే కాకుండా, అనేక విజయాలను సొంతం చేసుకుంది. ఈ ఉత్సాహంలో వారు రెండో పార్ట్ ని రూపొందించంటంలో బిజీగా ఉన్నారు. న్యూ ఇయిర్ ని పురస్కరించుకుని పోస్టర్స్ , ఓ వీడియోని విడుదల చేసారు. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు.ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. సుమారు రూ.500 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాల సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రం ప్రభాస్‌కు అంతర్జాతీయంగా స్టార్‌ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఇక 'బాహుబలి' రెండో భాగం రీసెంట్ గా మొదలైంది. ఈ సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరమైన అంశం. ఈ చిత్రానికి ''బాహుబలి - ది కంక్లూజన్‌' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలు అన్నీ కంక్లూజన్ దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.


 Baahubali new Year wishes video


'బాహుబలి 2' గురించి రానా మాట్లాడుతూ... ''బాహుబలి - ది కంక్లూజన్‌' వచ్చాక 'బాహుబలి - ది బిగినింగ్‌' చాలా చిన్నదిగా కనిపిస్తుంది. రెండో భాగంలో పోరాట సన్నివేశాలు, భావోద్వేగాలు, సెట్లు... ఇలా అన్నీ ఇంకా భారీగా ఉంటాయి''అన్నాడు రానా. టైటిల్ తో పాటు అన్ని విషయాల్లోనూ అత్యంత భారీతనం కనిపించిన బాహుబలి చిత్రం కలెక్షన్లను కూడా భారీగానే కొల్లగొట్టి సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.


English summary
Baahubali team Shared a video with New Year Wishes.
Please Wait while comments are loading...