»   » అల్లు అర్జున్‌కు అండగా ప్రభాస్.. నా పేరు సూర్య ప్రీరిలీజ్‌కు బాహుబలి

అల్లు అర్జున్‌కు అండగా ప్రభాస్.. నా పేరు సూర్య ప్రీరిలీజ్‌కు బాహుబలి

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య.. నా పేరు ఇండియా చిత్రం రిలీజ్‌కు ముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. ఇటీవల రిలీజైన టీజర్లు, డైలాగ్ ఇంపాక్ట్ అభిమానుల్లో క్రేజ్‌ను పెంచింది. ప్రస్తుతం నా పేరు సూర్య ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ జోష్ ఓ వైపు కొనసాగుతుండగానే అల్లు అర్జున్ అభిమానులకు ఓ మంచి వార్తను అందించాడు.

నా పేరు సూర్య ఆడియో ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా ప్రభాస్ హాజరు కానున్నారనే వార్త మీడియాలో వైరల్ అయింది. అయితే చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ఎలాంటి వార్త రాకపోయినప్పటికీ.. విశ్వసనీయ వర్గాలు ఆ వార్త సరైనదే అని ధ్రువీకరిస్తున్నారు. కథా రచయిత వక్కంత వంశీ దర్శకుడిగా మారి నా పేరు సూర్య సినిమాను తెరకెక్కించాడు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించిన చిత్రం మే 4వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్నది.


Baahubali Prabhas chief guest for Allu Arjuns Naa Peru Surya pre-release event?

English summary
The makers of the film Naa Peru Surya Naa Illu India are planning to hold a pre-release event for the film. And they are looking to rope in Baahubali Prabhas as the chief guest for the function. However, so far, no official announcement has been made regarding the same.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X