»   » కాబోయే శ్రీమతి ఎలా ఉండాలంటే.. నాకు సిగ్గు ఎక్కువ.. యాక్టర్ అవుతానని.. ప్రభాస్

కాబోయే శ్రీమతి ఎలా ఉండాలంటే.. నాకు సిగ్గు ఎక్కువ.. యాక్టర్ అవుతానని.. ప్రభాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి2 ప్రభంజనం సృష్టిస్తూ కలెక్షన్ల వరద పారుతున్న నేపథ్యంలో యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ జాతీయ మీడియాకు ఈమెయిల్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయానలు వెల్లడించారు. బాహుబలి చిత్రం భారీ కలెక్షన్లు సాధిస్తుందని ఊహించాను కానీ రూ.1500 దాటి వెళ్తుందని అనుకోలేదు అని ప్రభాస్ అన్నారు. 'రాజమౌళి సార్‌పైన చాలా నమ్మకంతో ఉన్నాను. నా నటజీవితంలో బాహుబలి చాలా మార్పు తెస్తుందని ముందే అనుకొన్నాను. విధిరాత, అదృష్టం కారణంగానే బాహుబలి నాకు వచ్చింది' అని ప్రభాస్ చెప్పారు.

రాజమౌళి విజన్‌కు తగినట్టుగా..

రాజమౌళి విజన్‌కు తగినట్టుగా..

రాజమౌళి విజన్‌కు తగినట్టు నేను నటించాను. అందుకే వెండితెర మీద ఆ చిత్రం అంత గొప్పగా పండింది. ఆ చిత్రం నాకు ఎనలేని సంతృప్తిని ఇస్తున్నది. బాహుబలి సినిమా సరిహద్దులను చెరిపేసింది. బాహుబలి చిత్రం ప్రాంతీయ సినిమా దర్శకులకు, నిర్మాతలకు స్ఫూర్తిగా నిలిచింది అని ప్రభాస్ పేర్కొన్నారు.


నటుడిగా కావాలని లేదు..

నటుడిగా కావాలని లేదు..

నటుడిగా కావాలన్నది నా చిన్ననాటి కల కాదు. నాకు మొదటి నుంచి సిగ్గు ఎక్కువ. అసలు యాక్టింగ్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. సుమారు 19వ ఏట యాక్టర్ కావాలనే కోరిక కలిగింది. అప్పుడు నా తండ్రి (ఉప్పలపాటి సూర్యనారాయణరాజు)కు, ఆ తర్వాత మా పెదనాన్న (కృష్ణంరాజు)కు చెపితే వారు చాలా హ్యాపీగా ఫీలయ్యారు అని యంగ్ రెబల్ స్టార్ చెప్పారు.


సాహో కోసం సిద్దమవుతున్నాను..

సాహో కోసం సిద్దమవుతున్నాను..

బాహుబలి2 సినిమా హ్యాంగోవర్ ఇంకా దిగలేదు. ఆ చిత్రానికి సంబంధించిన విషయాలు ఇంకా వెంటాడుతునే ఉన్నాయి. ప్రస్తుతం సాహో చిత్రంపై దృష్టిపెడుతున్నాను. ఆ సినిమా ప్రస్తుత జనరేషన్‌కు తగినట్టుగా ఉంటుంది. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నాం. ఆ క్యారెక్టర్ కోసం మానసికంగా సిద్ధమవుతున్నాను అని ప్రభాస్ వెల్లడించారు.


మరికొన్నాళ్లు పెళ్లి వాయిదా

మరికొన్నాళ్లు పెళ్లి వాయిదా

పెళ్లి గురించి ఇప్పుడేమీ ఆలోచించడం లేదు. ఇంకా కొద్దిరోజులు ఆగాల్సిందే. సాహో సినిమా షూటింగ్ కోసం మరో ఆరు నెలలపాటు పెళ్లి వాయిదా వేయాలనుకొంటున్నాను. ప్రస్తుతం ఇంకా బాహుబలి నుంచి బయటపడలేదు. ఎంజాయ్ చేస్తున్నాను. త్వరలోనే పెళ్లి సంగతి చూద్దాం అని ప్రభాస్ అన్నారు.


జీవిత భాగస్వామి గురించి..

జీవిత భాగస్వామి గురించి..

నాకు కాబోయే శ్రీమతి ఎలా ఉండాలో అనే అంశంపై నాకు ఎలాంటి ఆలోచనలు లేవు. జీవిత భాగస్వామి ఇలా ఉండాలి అనే స్పష్టమైన కోరికలు ఏమిలేవు. సమయాన్ని బట్టి అభిరుచులు, ఆలోచనల్లో మార్పులు జరుగుతున్నాయి. పర్టిక్యులర్‌గా ఫిక్స్ అయినట్టు లేను అని ప్రభాస్ తెలిపారు. ఒకసారి ఫిక్స్ అయితే అలాంటి అమ్మాయి దొరకనప్పుడు అసంతృప్తి, ఇబ్బంది కలుగుతుంది అని చెప్పారు.English summary
Actor Prabhas started his career with Telugu film Eeshwar in 2002, says acting was not his childhood dream. “I never thought I will pursue acting because I was a shy person. Around the age of 18 or 19 it struck me that I want to be an actor. I told my dad and uncle about it, they felt very happy,” Prabhas said. And Prabhas said that the idea of miss perfect keeps changing with time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu