»   »  కీరవాణి ఉద్వేగం.. రాజమౌళి కంటతడి.. ప్రభాస్ హీరోనే కాదు.. కీరవాణి

కీరవాణి ఉద్వేగం.. రాజమౌళి కంటతడి.. ప్రభాస్ హీరోనే కాదు.. కీరవాణి

Written By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి ది కన్‌క్లూజన్ ప్రీ రిలీజ్ వేడుకలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఉద్వేగానికి లోనయ్యారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బాహుబలి చిత్రానికి సంగీతం అందించడమే కాదు, పాటలు రాసి పాడే అవకాశం వచ్చింది. అందుకు కారణమైన సోదరుడు రాజమౌళిపై ఓ పాట రాసి పాడారు. పాటను ఆలపిస్తూ రాజమౌళిని వేదికపైకి పిలువగా రాజమౌళి ఆనందబాష్ఫాలు రాల్చాడు. వేదికను ఎక్కేముందు కళ్లలో నీళ్లను తుడుచుకొన్నాడు.

Baahubali2
కీరవాణి రాసిన పాట ఏంటంటే

కీరవాణి రాసిన పాట ఏంటంటే

‘ఎవ్వడంటా ఎవ్వడంట..? బాహుబలి తీసింది!,
మా పిన్నికి పుట్టాడు ఈ నంది కాని నంది.
ఎవరూ కనందీ..ఎప్పుడూ వినందీ..
శివుని ఆన అయ్యిందమో హిట్లు మీద హిట్లు వచ్చి ఇంతవాడు అయ్యింది.
పెంచింది రాజనందిని.. కొండంత కన్న ప్రేమతో..
ఎంతెంత పైకి ఎదిగినా అంతంత ఒదుగు వాడిగా..
చిరాయువై యశస్సుతో ఇలా సాగి పొమ్మని
పెద్దన్న నోటీ దీవెన శివుణ్ని కోరు ప్రార్థన' అంటూ పాట ముగించాడు.

తమ్ముడిని దీవించకూడదు..

తమ్ముడిని దీవించకూడదు..

వేదికపైనే గాడ్ బ్లెస్ యూ అంటూ రాజమౌళిని కీరవాణి దీవించాడు. తమ్ముడి దీవించకూడదు.. ఆశీర్వదించాలి అని అన్నాడు. మళ్లీ మళ్లీ పైకి వస్తుండాలి.. కాస్త రిలాక్స్ కావాలి అని కీరవాణి అన్నాడు.

కంటతడితో రాజమౌళి.. అక్కున చేర్చుకొన్న..

కంటతడితో రాజమౌళి.. అక్కున చేర్చుకొన్న..

కంటితడిని తుడుచూకొంటూ వేదిక దిగిన రాజమౌళిని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అక్కున చేర్చుకొన్నారు. వెంటనే నిర్మాత శోభు కూడా ఓదార్చారు.

కూతురు కౌగిలించుకొని కంటతడి..

కూతురు కౌగిలించుకొని కంటతడి..

వేదిక నుంచి కిందికి వచ్చిన తన సీట్లో కూర్చోని ఉండగా రాజమౌళిని తన కూతురు వచ్చి కౌగిలించుకొని కంటతడి పెట్టారు. ఈ సన్నివేశం అందర్నీ ఆకట్టుకున్నది.

ప్రభాస్‌లో లేనిది నాకు తెలుసు.

ప్రభాస్‌లో లేనిది నాకు తెలుసు.

ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ఆయన వద్ద ఉన్నది ఎంటో తెలుసు.. లేనిది ఏంటో కూడా తెలుసు అని కీరవాణి కాదు. ప్రభాస్‌లో లేనిది గర్వం అని అన్నారు. కొందరూ హీరోలు హిట్టు పడితే తల తప్పుకొని పోతారు. కాని అలాంటి పనులు ప్రభాస్‌కు చేతకాదు. ప్రభాస్ అసలు అలాంటి హీరో కాదు అని అన్నారు.

English summary
In Baahubali Pre Release function Keeravani got emotional. He praised his brother, director Rajamouli, In this situation Rajamouli gets tear.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu