»   » ఫ్లాఫ్ డైరెక్టర్‌తో బాహుబలి నిర్మాతల క్రేజీ ప్రాజెక్ట్.. ఆ ధైర్యమేందో..

ఫ్లాఫ్ డైరెక్టర్‌తో బాహుబలి నిర్మాతల క్రేజీ ప్రాజెక్ట్.. ఆ ధైర్యమేందో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి చిత్రంతో ప్రపంచస్థాయి ఖ్యాతిని ఆర్జించిన నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. బాహుబలి అందించిన విజయంతో మరో ఫాంటసీ చిత్ర నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ సారి ఎస్ఎస్ రాజమౌళి లాంటి సెన్సేషనల్ డైరెక్టర్‌తో కాకుండా ఫెయిల్యూర్స్‌ను మూటగట్టుకొన్న దర్శకుడితో ప్రయోగం చేయడం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

తొలి సినిమాతో షేక్..

తొలి సినిమాతో షేక్..

నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని తొలిచిత్రంతోనే రికార్డు సృష్టించారు. ఒక్క సినిమానే ఐదేళ్లు ప్రాజెక్ట్‌గా మలిచారు. భారీ బడ్జెట్‌తో టాలీవుడ్‌ను షేక్ చేశారు. బాహుబలి తొలి భాగానికి భారీ లాభాలేం రాకున్నా.. రెండో భాగాన్ని ఖర్చుకు వెనకాడకుండా ముందుకు నడిపించారు. వారి కష్టానికి బాహుబలి2 బంపర్ కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ నిర్మాతలు మరో సినిమాకు సిద్ధమవుతున్నారు.


శర్వానంద్ హీరోగా..

శర్వానంద్ హీరోగా..

మలి చిత్రాన్ని భారీ చిత్రంగానో లేదా స్టార్ హీరోతో చేస్తారని ఎవరైనా ఊహిస్తారు. కానీ వరుస హిట్లను సొంతం చేసుకొంటున్న యువనటుడు శర్వానంద్‌తో సినిమా చేయనున్నారనే వార్త నిజంగానే సెన్సేషనల్‌గా మారింది. ఈ చిత్రానికి రూ.40 కోట్లను కేటాయించినట్టు సమాచారం.


ఫ్లాఫ్ డైరెక్టర్.. రాఘవేంద్రరావు తనయుడు

ఫ్లాఫ్ డైరెక్టర్.. రాఘవేంద్రరావు తనయుడు

హీరోగా శర్వానంద్ ఓకే అయినా.. డైరెక్టర్ మాత్రం ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తనయుడు కేఎస్ ప్రకాష్. ఈయన డైరెక్షన్‌లో సినిమాను నిర్మించబోతున్నారు. కెరీర్ పరంగా కేఎస్ ప్రకాష్‌కు ఇప్పటిదాకా చెప్పుకోదగిన హిట్ అంటూ లేదు. సిద్ధార్థ్, శ్రుతిహాసన్ జంటగా కేఎస్ ప్రకాష్ డైరెక్షన్‌లో వచ్చిన అనగనగా ఓ ధీరుడు సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్నే చవిచూసింది. ఆ తర్వాత కేఎస్ ప్రకాష్ నుంచి అడపా..దడపా సినిమాలు వచ్చినా అవి అంతగా సక్సెస్ కాలేదు.


ఈసారైనా హిట్ కొడుతాడా?

ఈసారైనా హిట్ కొడుతాడా?

తాజాగా బాహుబలి నిర్మాతల అండతో శర్వానంద్‌తో సినిమాకు డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు. ఈ సినిమాకు ప్రకాష్ భార్య కనిక స్క్రీన్‌ప్లే బాధ్యతలు తీసుకున్నట్టు తెలుస్తున్నది. కాగా, శర్వానంద్ కెరీర్లో కలెక్షన్ల పరంగా భారీ హిట్ అంటే రీసెంట్‌గా విడుదలైన శతమానంభవతి. ఆ సినిమా సుమారు రూ.22 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక, బాహుబలి బ్రాండ్ ఈ సినిమాకు బాగా ఉపకరిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారట. ఈ సారైనా ప్రకాష్ తనకంటూ ఓ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంటాడా..? బాహుబలి ఇమేజ్ ఆ సినిమాపై పనిచేస్తుందా..? అనే ప్రశ్నల సమాధానం కోసం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.English summary
Baahubali2 Producers Shobu Yarlagadda, Prasad Devineni are planning a movie with Director KS Prakash. Hero will be Shatamanam Bhavati Fame Sharvanand. Interesting thing in this project is.. KS Prakash has not had a single hit in his career. But this sensation producers opted KS Prakash.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu