»   »  'బాహుబలి' గురించి రేణు దేశాయ్ రిక్వెస్ట్

'బాహుబలి' గురించి రేణు దేశాయ్ రిక్వెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ ఒక్క 'బాహుబలి' సినిమా కోసం అంతా ఫ్యానిజం ప్రక్కన పెట్టేసి అందరూ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం సినిమా చూసి సపోర్ట్ చెయ్యండి, నా పర్శనల్ రిక్వెస్ట్ అంటూ రేణూ దేశాయ్...తన అభిమానులను ట్వీట్టర్ లో రిక్వెస్ట్ చేసారు. ఆమె ఇంకా ఈ చిత్రం గురించి ఏమందో క్రింద ట్వీట్స్ చదివి తెలుసుకోండి.


ట్వట్టర్ లో ఎప్పటికప్పుడు రేణు దేశాయ్ సమకాలీన అంశాలు, సినిమాలు పట్ల స్పందిస్తూనే ఉంది. ఈసారి బాహుబలిపై స్పందించటంతో టీమ్ కూడా ఉత్సాహంగా ధాంక్స్ తెలియచేసింది.తాను కూడా బాహుబలిని తమ పిల్లలిద్దరు తో కలిసి చూస్తానని రేణు దేశాయ్ తెలియచేసింది. ముఖ్యంగా పైరిసి చేయవద్దని పెద్ద సినిమాని పెద్ద ధియోటర్ లోనే చూడాలని ఆమె చెప్పుకొచ్చింది.ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


మరో ప్రక్క


పైరసీకి వ్యతిరేకంగా కొంతమంది తెలుగు సినీ నిర్మాతలు సంఘటితమై హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ''తెలుగువాళ్లంతా గర్వంగా చెప్పుకొనే చిత్రం 'బాహుబలి'. మూడేళ్లు కష్టపడి 'బాహుబలి'ని తెరకెక్కించారు. దాన్ని వెండితెరపై చూసి ఆస్వాదించండి. పైరసీ చూడొద్దు'' అని నిర్మాతలు అభ్యర్థించారు.


Baahubali: Renu Desai makes an Appeal!

ఈ సందర్భంగా అరవింద్‌ మాట్లాడుతూ ''జులై 10న 'బాహుబలి' వస్తోంది. ఆ రోజు యావత్‌ చిత్ర పరిశ్రమ మన వైపు చూస్తుంది. కనుల పండగలాంటి చిత్రాన్ని పైరసీలో చూస్తే సంతృప్తి దొరకదు. పైరసీని అరికట్టడానికి తెలుగు చిత్రసీమ ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తోంది. న్యాయస్థానం కూడా 'జాండో ఆర్డరు' జారీ చేసింది. ఏం చేసినా ఆన్‌లైన్‌లో జరిగే పైరసీని ఆపడం కష్టమైపోతోంది. అందుకోసం సర్వీస్‌ ప్రొవైడర్ల సహకారం తీసుకొంటున్నాం.


ఏయే వెబ్‌సైట్లు పైరసీకి పాల్పడుతున్నాయో గుర్తించాం. థియేటర్లలో జరిగే పైరసీని అడ్డుకోవడానికి మావంతు సన్నాహాలు చేస్తున్నాం. ఇక మీదట ఏ థియేటర్లో పైరసీ జరిగినా ఆ సమాచారం క్షణాల్లో తెలిసిపోయే ఏర్పాట్లు చేశాం. పైరసీ జరిగినట్టు రుజువైతే ఆ థియేటర్లపై ఏడాది పాటు నిషేధం విధిస్తాం. ఈ విషయంలో బెంగళూరు పోలీసులు కూడా మాకు పూర్తిగా సహకరించారు.


అక్కడ పైరసీ ముఠా ఒకటి నడుస్తోంది. ఇప్పటికే తొమ్మిది మంది పైరసీ నిందితులను అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ పోలీసులు కూడా చిత్రసీమకు సహకారం అందిస్తున్నారు. వాళ్లందరికీ మా ధన్యవాదాలు'' అన్నారు.


రాజమౌళి మాట్లాడుతూ ''పైరసీని అడ్డుకోవడానికి ఇది వరకు చాలా సార్లు ప్రయత్నించాం. కొన్ని సార్లు మాత్రమే విజయవంతమయ్యాం. థియేటర్లు డిజిటలైజ్డ్‌ చేయడం వల్ల పైరసీ ఎక్కడ జరిగింది? ఏ సమయంలో జరిగింది? అనే విషయాలు ఆధారాలతో సహా తెలిసిపోతున్నాయి. అలాంటి థియేటర్లను సీజ్‌ చేయడానికి చలనచిత్ర వాణిజ్య మండలి చర్యలు తీసుకొంటుంది.


అందరూ సినిమాపై బతుకుతున్నవాళ్లమే. కాబట్టి పరిస్థితి చేయిదాటకుండా థియేటర్ల యాజమాన్యమే జాగ్రత్తలు తీసుకోవాలి. 'బాహుబలి' అనేది పెద్ద సినిమా. దాన్ని పెద్ద తెరపైనే చూడండి. పైరసీ జోలికి వెళ్దొద్దు'' అన్నారు.


''సినిమా అనేది ఓ కళ. కళని దొంగతనం చేయొద్దు. పైరసీ చేయడం అంటే పక్కవాడి సెల్‌ఫోన్‌ లాక్కోవడమే..'' అని రానా చెప్పారు.English summary
Renu Desai tweeted :" E oka #Baahubali film kosam antha 'fanism' pakkan pettesi andaru,Telugu film industry kosam cinema chusi support cheyaandi,naa personal req😊"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu