»   » ఇండియన్ సూపర్‌స్టార్ ప్రభాస్.. 1000 కోట్ల హీరో.. కదులుతున్నబాలీవుడ్ హీరోల పీఠాలు..

ఇండియన్ సూపర్‌స్టార్ ప్రభాస్.. 1000 కోట్ల హీరో.. కదులుతున్నబాలీవుడ్ హీరోల పీఠాలు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారతీయ సినిమా పరిశ్రమలో కొన్నేండ్లుగా బాలీవుడ్‌దే హవా కొనసాగుతున్నది. బాలీవుడ్ సినిమా అంటే ఇండియన్ సినిమా అనేంత పేరుంది. బాలీవుడ్ తప్ప మిగితా సినీ పరిశ్రమలన్నీ ప్రాంతీయ సినిమాలుగానే ముద్ర వేసుకొన్నాయి. అందుకు కారణం దేశ అధికార భాష హిందీ కావడం. అయితే బాహుబలి సాధించిన చరిత్రాత్మక విజయంతో బాలీవుడ్ ప్రతిష్ఠ మసకబారుతున్నది. బాహుబలి దెబ్బకు బాలీవుడ్ ప్రాంతీయ సినిమా స్థాయికి దిగజారిందనే మాట బలంగా వినిపిస్తున్నది. భావితరం ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ అనే ప్రచారం ఊపందుకున్నది.

నేషనల్ ఐకాన్స్..

నేషనల్ ఐకాన్స్..

హిందీ చిత్ర పరిశ్రమకు ఉన్న అగ్రస్థానంతో బాలీవుడ్‌లో నటించే హీరోలందరూ నేషనల్ ఐకాన్స్‌గా గుర్తింపబడుతున్నారు. జాతీయ దిన పత్రికలు, మీడియా అంతా ముంబై, ఢిల్లీలోనే ఉండటం వారి ప్రచారానికి బాగా ఉపయోగపడింది. దాంతో జాతీయ వేదికలపైనే బాలీవుడ్ హీరోలకే ప్రాధాన్యం దక్కింది. గత కొన్నేండ్లుగా ఇండియన్ సూపర్ స్టార్లు అనే ట్యాగ్ రాజేష్ ఖన్నా, అమితాబ్, షారుక్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లకే దక్కింది.


రణ్‌వీర్, రణ్‌బీర్‌లకు చెక్..

రణ్‌వీర్, రణ్‌బీర్‌లకు చెక్..

అమితాబ్, షారుక్, సల్మాన్, అమీర్ జనరేషన్ వారికి వయస్సు మీద పడుతుండటంతో భవిష్యత్ సూపర్ స్టార్లు ఎవరు అనే చర్చ మొదలైంది. సంచలన విజయాలను సొంత చేసుకొన్న ప్రాంతీయ నటులకు ఆ హోదా కోసం పరిగణనలోకి తీసుకోలేదు. ఇక భవిష్యత్ సూపర్ స్టార్లు రణ్‌బీర్, రణ్‌వీర్ సింగ్, వరుణ్ ధావన్ అనే చర్చ మొదలైంది. రెండేళ్ల క్రితం బాహుబలి1 రిలీజ్ తర్వాత ప్రభాస్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. బాహుబలి2 తర్వాత ఆ క్రేజ్ దేశం నలుమూలలా పాకింది. ఇప్పుడు కాబోయే ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ అని జాతీయ మీడియా ప్రచారం ఊపందుకున్నది.


ఐదేళ్ల శ్రమకు ప్రతిఫలం..

ఐదేళ్ల శ్రమకు ప్రతిఫలం..

ప్రభాస్‌కు ఓవర్‌నైట్‌తోనే ఈ హోదా దక్కడం లేదు. బాహుబలి కోసం ఐదేళ్లు కెరీర్‌ను పణంగా పెట్టారు. మిర్చి సంచలన విజయం తర్వాత తన భారీగా అవకాశాలను కాదనుకొన్నాడు ప్రభాస్. తాను చేసిన త్యాగానికి ప్రతిఫలాన్ని బహుబలి రూపంలో అందుకొన్నాడు. భారతీయ సినిమా చరిత్రలో ఓ ప్రాంతీయ సినిమా నటుడికి దక్కని హోదా బాహుబలితో చేజిక్కించుకొన్నాడు.


1000 కోట్ల హీరో..

1000 కోట్ల హీరో..

దేశ సినీ చరిత్రలోనే ప్రభాస్ వెయ్యి కోట్ల హీరోగా ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఎవ్వరికీ ఈ గౌరవం దక్కలేదు. బాహుబలి1 సినిమా రూ.650 కోట్లు వసూలు చేసింది. బాహుబలి2 సినిమా మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల కలెక్షన్లను సాధించింది. అంటే దాదాపు బాహుబలి పేరు మీద ఇప్పటికే రూ.1100 కోట్లు వసూలయ్యాయి. అంటే వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఏకైక ఇండియన్ సూపర్ స్టార్‌గా ప్రభాస్‌ ఓ ఖ్యాతిని సొంతం చేసుకొన్నాడు.


రేంజ్ పెంచిన బాహుబలి..

రేంజ్ పెంచిన బాహుబలి..

2002లో ఈశ్వర్‌తో తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెట్టిన ప్రభాస్ ఒక్కో అడుగు వెసుకొంటూ గత 15 ఏళ్ల కాలంలో తాను ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. చత్రపతి, బిల్లా, మిర్చి సినిమాలు టాలీవుడ్‌లో ప్రభాస్ సత్తాను చాటాయి. బాహుబలితో ప్రభాస్ రేంజ్ బాలీవుడ్‌ను దాటింది.


ప్రభాస్ గురించి బాలీవుడ్ ఆరా..

ప్రభాస్ గురించి బాలీవుడ్ ఆరా..

బాహుబలి తర్వాత ఇండియన్ సినిమా అంతా ప్రభాస్‌పై దృష్టి పెట్టింది. తదుపరి సినిమా ఏమిటని బాలీవుడ్ నిర్మాతలు ఆరా తీసున్నారు. తన తదుపరి చిత్రం సాహో కూడా నేషనల్ అప్పీయరెన్స్‌ ఉండటం ప్రభాస్‌కు మరింత ఫాలోయింగ్ ఏర్పడే అవకాశం ఉంది. సాహో చిత్రం జేమ్స్ బాండ్ సినిమా మాదిరిగా రూపొందుతున్నది. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఇటీవల విడుదలైన సాహో టీజర్‌కు అనూహ్య స్పందన లభిస్తున్నది.


బాలీవుడ్ ఎంట్రీకి కరణ్ ప్రయత్నాలు..

బాలీవుడ్ ఎంట్రీకి కరణ్ ప్రయత్నాలు..

బాహుబలి సిరీస్‌ను హిందీలో పంపిణీ చేసిన ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్.. ప్రభాస్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేసే పనిలో ఉన్నాడు. ఆ చిత్రానికి రాజమౌళి దర్శకుడు అనే ప్రచారం జరుగుతున్నది. వీరి మధ్య చర్చలు జరుగుతున్నట్టు వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకవేళ కరణ్ జోహర్ సినిమా నిజమైతే నేరుగా బాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం దక్కుతుంది. దాంతో జాతీయ స్థాయిలో ప్రభాస్ ఎదురే ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.


English summary
Success of Baahubali: The Beginning and Baahubali 2: The Conclusion is evidence that Prabhas is the next big thing in Indian cinema. The Baahubali films, including Baahubali: The Beginning and Baahubali: The Conclusion, made on a budget of Rs 430 crore have already earned up to Rs 1,100 crore as of this moment; Rs 650 crore has come from The Beginning while the recently released The Conclusion just crossed Rs 450 crore worldwide within three days of its release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu