»   »  అదిరిపోయే యాక్షన్ : ‘బాహుబలి-ది కంక్లూజన్’ ట్రైలర్ రిలీజ్

అదిరిపోయే యాక్షన్ : ‘బాహుబలి-ది కంక్లూజన్’ ట్రైలర్ రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాహుబలి-ది కంక్లూజన్ ట్రైలర్ గురువారం ఉదయం రిలీజైంది. మొదటి భాగంకంటే మరింత అద్భుతంగా ఈ సినిమా ఉండబోతోంది. అన్నికంటే ముఖ్యంగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్నకు ఈ చిత్రంతో సమాధానం దొరకనుంది.

విజువల్స్ పరంగా, యాక్షన్ సన్ని వేశాల పరంగా, కథ పరంగా 'బాహుబలి-ది కంక్లూజన్' ప్రేక్షకులను మరింత మెప్పిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. అయితే ట్రైలర్ చూసిన వారిలో కొందరు మరీ అంత ఎగ్జైటింగ్ గా ఏమీ లేదని అంటున్నారు.

Baahubali The Conclusion trailer released

బాహుబలి-2 ట్రైలర్

ట్రైలర్లో ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలే చూపించారు. కథ గురించిన క్లూ ప్రేక్షకులకు దొరకకుండా జాగ్రత్త పడ్డట్లు స్పష్టమవుతోంది. మీరూ ఈ ట్రైలర్ చూసి మీ అభిప్రాయాలేమిటో కామెంట్ బాక్సులో వెల్లడించండి.

బాహుబలి-2 బడ్జెట్ ఎంత? నిర్మాతలకు లాభం ఎంత?

బాహుబలి-2 బడ్జెట్ ఎంత? నిర్మాతలకు లాభం ఎంత?

'బాహుబలి-ది బిగినింగ్' ఊహించిన దానికంటే భారీ విజయం సాధించింది. ఈ చిత్రం దాదాపు 650 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. మొదటి భాగం భారీ విజయం సాధించడం, భారీ వసూల్లు రాబట్టడంతో రెండో భాగం 'బాహుబలి-ది కంక్లూజన్' పై నిర్మాతలు ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే ఖర్చు పెట్టారని తెలుస్తోంది... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

‘బాహుబలి-2' ఫుల్ స్టోరీ లీక్... సోషల్ మీడియాలో వైరల్!

‘బాహుబలి-2' ఫుల్ స్టోరీ లీక్... సోషల్ మీడియాలో వైరల్!

ఈ మధ్య కాలంలో లీక్ వ్యవహారాలు సినిమా ఇండస్ట్రీని బాగా ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ ముందే సినిమాలోని క్లిప్స్ లీక్ కావడం, స్టోరీ లీక్ కావడం, కొన్ని సార్లు సినిమా మొత్తం లీక్ కావడం లాంటివి జరుగుతున్నాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియా విస్తృతంగా వినియోగిస్తున్న ఈ రోజుల్లో అత్యంత వేగంగా ఈ లీక్ స్టఫ్ అందరికీ షేర్ అవుతోంది. తాజాగా బాహుబలి-2 కథ లీకైందంటూ సోషల్ మీడియాలో ఓ స్టోరీ చక్కర్లు కొడుతోంది. వాట్సాఫ్, ఫేస్ బుక్ ద్వారా ఇది వైరల్ అయింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

తమిళ ట్రైలర్

బాహుబలి-ది కంక్లూజన్ తమిళ ట్రైలర్

హిందీ ట్రైలర్

బాహుబలి-ది కంక్లూజన్ హిందీ వెర్షన్ ట్రైలర్. ధర్మ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేస్తున్నారు

English summary
Baahubali The Conclusion trailer released. Baahubali: The Conclusion is an upcoming Indian epic historical fiction film directed by S. S. Rajamouli. It is the continuation of Baahubali: The Beginning. Initially, both parts were jointly produced on a budget of ₹2.5 billion (US$37 million), however the budget of the second part was increased later. Baahubali: The Conclusion has made a business of ₹5 billion (US$74 million) before release. The film is scheduled for a worldwide release on 28 April 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu