»   » బాహుబలి1 కంటే బాహుబలి2 100 రెట్లు బాగుంది.. ఉమేర్ సంధూ రివ్యూ వచ్చేసింది..

బాహుబలి1 కంటే బాహుబలి2 100 రెట్లు బాగుంది.. ఉమేర్ సంధూ రివ్యూ వచ్చేసింది..

Posted By:
Subscribe to Filmibeat Telugu

విడుదలకు ముందే సినిమా రివ్యూలతో సోషల్ మీడియాలో అదరగొట్టే ఉమేర్ సంధూ మరోసారి బాహుబలి2పై జోస్యం చెప్పింది. గతంలో పవన్ కల్యాణ్ చిత్రాలకు ప్రత్యేకించి రిలీజ్ కు ముందే రివ్యూ పెట్టే ఉమేర్ బాహుబలి2 అహో ఒహో అంటూ తన కామెంట్లను పోస్ట్ చేసింది. గతంలో కాటమరాయుడు చిత్రం బ్లాక్ బస్టర్ అంటూ పెట్టిన రివ్యూ చాలా విభిన్నంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆమె చెప్పిన విధంగా కాకుండా కాటమరాయుడు టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలువడంతో ఉమేర్ రివ్యూలపై సందేహం మొదలైంది.

అద్భుతంగా ఉంది..

అద్భుతంగా ఉంది..

ఇక బాహుబలి ది కన్‌క్లూజన్ విషయానికి వస్తే బాహుబలి ఫస్ట్ కాపీ వచ్చింది. ఆ సినిమాపై టాక్ అద్భుతంగా ఉంది అని కొందరు ప్రముఖులు చెప్పారు. వీఎఫ్ఎక్ష్, స్టోరీ టెర్రిఫిక్‌గా ఉంది. సినీ చరిత్రలో మరో కలెక్షన్ల తుఫాను రావడం ఖాయం అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు.

వందరెట్లు బాగుంది..

వందరెట్లు బాగుంది..

బాహుబలి1 కంటే బాహుబలి2 100 రెట్లు బాగుందనే ఇన్‌సైడ్ టాక్. ఈ సినిమా బ్రహ్మండంగా ఉందనే రిపోర్టులు వస్తున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్, టాలీవుడ్ ప్రేక్షకులకు ఇది పండుగ సమయం అని ట్వీట్ చేశారు.

ఉమేర్ సంధూ ఎవరు..

ఉమేర్ సంధూ ఎవరు..

భారీ చిత్రాల రిలీజ్‌కు ముందు రివ్యూలతో సంచలనం రేపే ఉమెర్ సంధూ ఎవరనే సందేహం అందరిలోనూ నెలకొన్నది. ఉమేర్ సంధూ ఇండియా, బ్రిటన్, యూఏఈలోని సౌత్ ఏషియన్ సినిమా మ్యాగజైన్‌లో ఫిలిం అండ్ ఫ్యాషన్ క్రిటిక్ పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఆసియా సినిమాలకు మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్‌గా సేవలందిసతున్నారు. యూఏఈ సెన్సార్ బోర్డు మెండర్గా కూడా పనిచేస్తున్నారు.

 సోషల్ మీడియా మార్కెటింగ్..

సోషల్ మీడియా మార్కెటింగ్..

ఉమేర్ సంధూ రివ్యూలన్నీ సెన్షేషనల్‌గా ఉంటాయి. సినిమాలను ప్రమోట్ చేసే లక్ష్యంగా సోషల్ మీడియా మార్కెటింగ్‌ చేస్తారనే విమర్శ ఉంది. గతంలో ఉమేర్ రాసిన రివ్యూలు ప్రేక్షకుల టేస్ట్‌కు దూరంగా ఉన్నాయి. దాంతో ఉమేర్ చెప్పేదాంట్లో ఎంత నిజముందనే టాక్ ప్రస్తుతం ఉంది. కానీ బాహుబలి2 విషయానికి వస్తే ఉమేర్ రివ్యూ నిజమయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే బాహుబలి2 లో ఉండే కంటెంట్‌కు అలాంటి క్రేజ్ ఉంది.

English summary
Umair Sandhu tweets thatBaahubali2 is 100 % better than Baahubali!! Insider reports are OUTSTANDING ! Celebration Time Tollywood & Prabhas Fans. First Copy of Baahubali2 is OUT & Response is OUTSTANDING ! As per Insiders, VFX & Story is TERRIFIC ! STORM is Coming
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu