»   »  డబ్బులొచ్చాయి...కాబట్టి మా సినిమా హిట్టే: బాబు బంగారంపై మారుతి

డబ్బులొచ్చాయి...కాబట్టి మా సినిమా హిట్టే: బాబు బంగారంపై మారుతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విక్టరీ వెంకటేష్‌, నయనతార జంటగా ఎస్‌.రాధాకృష్ణ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మారుతి దర్శకత్వంలో ఎస్‌.నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్‌లు నిర్మించిన చిత్రం 'బాబు బంగారం'. ఈ సినిమా ఆగస్ట్‌ 12న విడుదలైంది. సినిమా రిలీజ్ అయి వారం రోజులు పూర్తయి సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినిమా హిట్టయిందని ప్రకటించారు.

ఈ సినిమా రిలీజైన మొదటి రోజే మిక్స్‌డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. చాలా మంది సినిమా ఆశించిన స్థాయిలో లేదని విమర్శించారు. ప్రేక్షకుల నుండి కూడా నెగెటివ్ రెస్పాన్సే వచ్చింది. అయితే బాక్సాఫీసు వద్ద పోటీ లేక పోవడం, ప్యామిలీ ప్రేక్షకులు ఈ సినిమా ఒక్కటే ఆప్షన్ ఉండటంతో వసూళ్లు పెరిగాయి.

సక్సెస్ మీట్లో దర్శకుడు మారుతి మాట్లాడుతూ.... సినిమాపై అంచనాలు భారీగా ఉండటం వల్ల తొలి రోజు మేము ఆశించిన స్థాయిలో ఫీడ్ బ్యాక్ రాలేదు. నానుంచి వ‌చ్చిన క‌మ‌ర్షియ‌ల్ చిత్రాన్ని అల‌వాటు చేసుకోవ‌డానికి ప్రేక్షకులకు ఒక‌టీ, రెండు రోజులు ప‌ట్టింది అన్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా మా సినిమాకు డబ్బులొచ్చాయి. డబ్బులొస్తేనే సినిమా సక్సెస్ అయినట్లు అని మారుతి ప్రకటించారు.

స్లైడ్ షోలో మారుతి చెప్పిన మరిన్ని వివరాలు...

మళ్లీ నాకు ఎనర్జీ వచ్చింది

మళ్లీ నాకు ఎనర్జీ వచ్చింది


ఫ్యామిలీ లేడీస్ అంద‌రూ ఫోన్లు చేసి బావుంద‌ని అంటున్నారు. మ‌ళ్లీ నాకు ఎన‌ర్జీ వ‌చ్చింది అని మారుతి తెలిపారు.

ఫస్ట్ వీక్ ఎంత వసూలైంది?

ఫస్ట్ వీక్ ఎంత వసూలైంది?


తొలి వారం పూర్తయ్యే సరికి ఈ సినిమా రూ. 16 కోట్లకుపైగా వసూలైనట్లు సమాచారం. ఇందులో రూ. 11 కోట్ల వరకు షేర్ వచ్చినట్లు తెలెస్తోంది.

ఎంతక అమ్మారు?

ఎంతక అమ్మారు?


ఈ సినిమాను ఏపీ, తెలంగాణ రైట్స్ రూ. 25 కోట్ల వరకు అమ్మినట్లు తెలుస్తోంది. మరి ఫుల్ రన్ లో ఈ సినిమా ఎంత వసూలు చేస్తుంది? లాభ నష్టాల వివరాలు మరో వారం తర్వాత తేలనుంది.

వెంక‌టేశ్ మాట్లాడుతూ

వెంక‌టేశ్ మాట్లాడుతూ


``సినిమాను బాగా రిజీవ్ చేసుకున్నారు. బాబు బంగారం సినిమాలో నా బాడీ లాంగ్వేజ్‌, డ్ర‌స్సులు ఎలా ఉండాలో ముందు నుంచీ మారుతి చెబుతున్నాడు. అలాగే తీశాడు. నాతో చేసిన మిగిలిన న‌టీన‌టుల‌కు థాంక్స్. నేను ఏం చేసినా పాజిటివ్ ఎన‌ర్జీతో అభినందించారు``అని చెప్పారు.

బాబు బంగారం మూవీలో క్లైమాక్స్ ఫైట్ గురించి...

బాబు బంగారం మూవీలో క్లైమాక్స్ ఫైట్ గురించి...


రామ్‌-ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ ``మా నిర్మాత‌లు బంగారంలాంటివారు. వాళ్ల‌కు ప్రేక్ష‌కులు బంగారంలాంటివారు. వెంక‌టేశ్ బాబు న‌వ్వితే అమ్మాయిల‌కి, కొడితే అబ్బాయిల‌కి న‌చ్చుతాడు. ఆయ‌న‌లాగా అమాయ‌కంగా ఫేస్‌పెట్టి మెప్పించ‌గ‌లిగే హీరో ఇంకెవ‌రూ లేరు`` అని అన్నారు.

పృథ్వి మాట్లాడుతూ

పృథ్వి మాట్లాడుతూ


``నేను ఏ సినిమా చేసినా చూసిన సురేశ్‌బాబుగారు బావుంద‌మ్మా అని వెళ్లేవారు. కానీ ఈ సినిమా చూసి బాగా చేశావ్‌రా. జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకో అని అన‌డం మ‌ర్చిపోలేను` అని చెప్పారు.

ఫిష్ వెంక‌ట్ మాట్లాడుతూ

ఫిష్ వెంక‌ట్ మాట్లాడుతూ


``క‌లియుగ పాండ‌వులు నుంచి నేను వెంక‌టేశ్‌గారికి పెద్ద ఫ్యాన్‌ని. ఆయ‌న‌తో ఇలాంటి సినిమాలు చాలా చేయాల‌ని ఉంది`` అని చెప్పారు.

బాబు బంగారం

బాబు బంగారం


విక్టరీ వెంకటేష్‌, నయనతార జంటగా ఎస్‌.రాధాకృష్ణ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మారుతి దర్శకత్వంలో ఎస్‌.నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్‌లు నిర్మించిన చిత్రం 'బాబు బంగారం'. ఈ సినిమా ఆగస్ట్‌ 12న విడుదలైంది.

English summary
Babu Bangaram Movie Suceses meet held at Dasapalla Hotel in Hyderabad today (17th Aug) evening.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X