»   » క్రైమ్, సెక్స్, బందూక్ బాజ్: అద్బుతమా, రియాలిటీనా, చీప్ గా ఉందా? మీరే చెప్పాలి (వీడియో)

క్రైమ్, సెక్స్, బందూక్ బాజ్: అద్బుతమా, రియాలిటీనా, చీప్ గా ఉందా? మీరే చెప్పాలి (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ తరం బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి. గతం లో బాలీవుడ్ లో ఒక మార్క్ అంటూ పడకుండానే యాక్టింగ్ అంటే ఏమిటో చూపించిన నానా పటేకర్, చుంకీ పాండే, ఇర్ఫాన్ ఖాన్, నసీరుద్దీన్ షా వంటి నటులతో పోల్చదగిన స్థాయిలో చెలరేగి పోతున్నాడీ నటుడు. 'గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్' సిరీస్ వచ్చిన కాలం లో నవాజుద్దీన్ ని చూసిన జనం అతని యాక్టింగ్ కి ఫిదా అయిపోయారు. అందులో తన యాక్టింగ్ స్కిల్స్ తో మతి పోగొట్టేశాడు నవాజ్.

నవాజుద్దీన్ సిద్దిఖి

నవాజుద్దీన్ సిద్దిఖి

అక్కడినుంచీ తను చేసే ప్రతీ పాత్రా చెప్పుకోదగ్గదే. హీరో అన్న మార్క్ లేకుండానే తనకంటూ ఒక ప్రత్యేక అభిమానులని సంపాదించుకోగలిగాడు. విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాదు.. సోలో హీరోగా చేసిన సినిమాల్లోనూ నవాజుద్దీన్ అదరగొట్టేశాడు. గత ఏడాది ‘రామన్ రాఘవ్ 2.0'లో సైకో గా అతనెలా విజృంభించాడో తెలిసిందే. తాజాగా నవాజ్ ఏంటో చూపించే మరో సినిమా బాలీవుడ్లో రెడీ అయింది. అదే.. ‘బాబు మషాయ్ బందూక్ బాజ్'.

బాబు మషాయ్ బందూక్ బాజ్

బాబు మషాయ్ బందూక్ బాజ్

బాలీవుడ్ ఒక్కటే కాదు టాలీవుడ్ లోనూ కోలీవుడ్ లోనూ అంతా నిన్నట్నుంచి ‘బాబు మషాయ్ బందూక్ బాజ్' టీజర్ గురించే చర్చలు . అటూ ఇటుగా ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న టీజర్ లో ఒక పాత్ర మొత్తం స్వభావాన్నీ, మొత్తం సినిమా ఉద్దేశాన్నీ చెప్పేసారు.

బహిర్భూమి కి వెళ్తున్న సీన్

బహిర్భూమి కి వెళ్తున్న సీన్

అసలు టీజర్ చూస్తే చిత్రమైన అనుభూతి కలగడం ఖాయం. మొదటి సీన్లోనే ఒక నీళ్ళ డబ్బా, రేడియో పట్టుకొని బహిర్భూమి కి వెళ్తున్న సీన్ తో మొదలవటమే అసలు సినిమా ని ఎంత రా (రవ్) గా చూపించ బోతున్నారో అర్థమైపోతోంది. ఈసినిమాలో నవాజుద్దీన్ ‘బాబు' అనే కాంట్రాక్ట్ కిల్లర్ క్యారెక్టర్ చేస్తున్నాడిందులో.

హమ్ ఔట్ సోర్సింగ్ కర్తే హై

హమ్ ఔట్ సోర్సింగ్ కర్తే హై

టీజర్లో అతడి పరిచయమే వావ్ అనిపిస్తుంది. ‘హమ్ ఔట్ సోర్సింగ్ కర్తే హై.. యమ్ రాజ్ కే లియే' (ఔట్ సోర్సింగ్ చేస్తాను, యముడి దగ్గర) అంటూ ఏ ఫీలింగ్ లేకుందా ఒకమనిషిని కాల్చేస్తూ చెప్పేసి సినిమాలో తన క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు నవాజ్. ఇక ఆ తర్వాత చూపించిన సీన్లైతే మరింత పచ్చిగా ఉన్నాయి.

ఆర్ట్ కీ అసభ్యతకీ ఉండే సన్నని గీత

అయితే మరీ అసహ్య కరంగా అయితే కాదు. నిజానికి ఆర్ట్ కీ అసభ్యతకీ ఉండే సన్నని గీత ని టచ్ చేసి వదిలేసారు. . వేశ్యల దగ్గరకివెళ్లి వాళ్ల దగ్గర వేసే చీప్ వేషాల్ని అంతే చీప్ గా చూపించారు. ఒక టీజర్లో అన్నన్ని షాట్లు పెట్టేసి దాదాపు ఆ ఒక్క నిమిషం లోనే సినిమా మొత్తం చూపించేసారు. ఇందులో దివ్య దత్తా.. బిడితా బేగ్.. శ్రద్ధా దాస్.. మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కుషన్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుందట.

English summary
The teaser of Nawazuddin Siddiqui's Babumoshai Bandookbaaz was unveiled by the makers of the film today. In the one-and-a-half minute teaser, the 43-year-old actor has been described as a 'show baaz' and 'daaru baaz'
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu