»   » బాహుబలి: మూడు రోజులకు 10 కోట్ల ఖర్చు!

బాహుబలి: మూడు రోజులకు 10 కోట్ల ఖర్చు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రభాస్ హీరోగా 'బాహుబలి' పేరుతో భారీ బడ్జెట్ సినిమాకు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. చారిత్రక నేపథ్యంలో జానపద చిత్రంగా రూపొందుతున్న ఈచిత్రం కోసం ఖర్చు పెడుతున్న తీరు ఇండస్ట్రీ వర్గాలను అవాక్కయ్యేలా చేస్తోంది.

తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం....వచ్చే నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో మూడు ప్రత్యేకమైన సెట్లు వేసారు. ఈ ముడు సెట్లలో కేవలం మూడు రోజులు మాత్రమే షూటింగ్ జరుపునున్నారట. ఆ తర్వాత ఇక్కడ చిత్రీకరించిన సీన్లకు సంబంధించి గ్రాఫిక్స్ వర్క్ చేయనున్నారు.

ఈ మూడు రోజుల షూటింగుకు ఉపయోగించే సెట్లు, ఇతరత్రా ఖర్చులు కలిపి దాదాపు రూ. 10 కోట్ల వరకు వెచ్చిస్తున్నారట. ఎంత బిగ్ బడ్జెట్ సినిమా అయినా మూడు రోజులకు రూ. 10 కోట్ల ఖర్చా? అంటూ అంతా నోరెళ్లబెడుతున్నారు. ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ ఈ సెట్లకు రూపకల్పన చేసారు.

ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధాన భూమిక పోషించనున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. అనుష్క హీరోయిన్ కాగా, రానా విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగున్నాయి.

English summary
'Baahubali' on to floors from next month. Rajamouli and Prabhas are gearing up for a mega shoot at three specially designed sets in Ramoji Film City. The unit will be shooting only for 3 days in these three locations which took 10 crores to get shaped.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu