twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ లోపమే ‘బాహుబలి-2’ పైరసీకి కారణం.... ముఠా సభ్యులు వీరే! (ఫోటోస్)

    ‘బాహుబలి-2’ హెచ్‌డి ప్రింటును శాటిలైట్ సర్వర్ నుండి కాపీ చేసిన కొందరు కేటుగాళ్లను సైబర్ క్రైం పోలీసులు ముఠా సభ్యులను అరెస్టు చేసారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సినీ పరిశ్రమకు తీవ్రంగా నష్టం కలిగిస్తున్నపైరసీని అరికట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒకరకంగా పైరసీ ముఠాలు తమ చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నాయి. తాజాగా విడుదలైన 'బాహుబలి-2' సినిమాకు కూడా పైరసీ బెడద తప్పలేదు.

    'బాహుబలి-2' హెచ్‌డి ప్రింటును శాటిలైట్ సర్వర్ నుండి కాపీ చేసిన కొందరు కేటుగాళ్లు.... ఏకంగా నిర్మాతలను డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేయడం, వారు పోలీసులను ఆశ్రయించడంతో ముఠా గుట్టురట్టయింది. ఈ వ్యవహారంపై వేగంగా స్పందించిన సైబర్ క్రైం పోలీసులు ముఠా సభ్యులను అరెస్టు చేసారు.

    ఆ లోపమే పైరసీకి కారణం

    ఆ లోపమే పైరసీకి కారణం

    సినిమా ప్రదర్శించడానికి ఒకప్పుడు థియేటర్లు ప్రింట్లు పంపేవారు. ఇప్పుడంతా డిజిటలైజ్ కావడంతో శాటిలైట్ సిగ్నల్ ద్వారా నేరుగా థియేటర్లలో సినిమాలను ప్రదర్శిస్తున్నారు. శాటిలైట్ ద్వారా సినిమాను ప్రదర్శించే సంస్థల్లో యూఎండబ్ల్యూ డిజిటల్ సర్వీసెస్ ఒకటి. ఈ సంస్థలో గతంలో పని చేసిన మోను అలియాస్ అంకిత్ కుమార్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ థియేటర్లో ఉండే శాటిలైట్ సర్వర్ లో సినిమా కాపీ చేసే విధానం కనిపెట్టేసాడు. దీని ఆధారంగా సినిమాను పైరసీ చేసాడు.

    పైరసీ ముఠాలతో జతకట్టి...

    పైరసీ ముఠాలతో జతకట్టి...

    బాహుబలి-2 సినిమాపై దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉండటంతో.....బీహార్ కు చెందిన దివాకర్ ను సంప్రదించి అతడి థియేటర్లో సర్వర్ కు ల్యాప్ టాప్ అనుసంధానించి బాహుబలి-2 సినిమాను కాపీ చేసారు. పైరసీ ద్వారా డబ్బలు సంపాదించడానికి పాట్నాకు చెందిన చందన్ కు సమాచారం అందించారు. అతడు బాహుబలి-1 ను పైరసీ చేసిన ముఠా సభ్యుడు రాహుల్ మెహతాను సంప్రదించాడు. గతంలో రాహుల్ తో పాటు అతడి ముఠా సభ్యులు జితేందర్, తౌఫీఖ్, అలీ పలు సినిమాలు పైరసీ చేసారు.

    హైదరాబాద్‌లో మకాం వేసిన రాహుల్

    హైదరాబాద్‌లో మకాం వేసిన రాహుల్

    బాహుబలి 2 నిర్మాతలను బెదరించి డబ్బులు గుంజడానికి రాహుల్ హైదరాబాద్ వచ్చి నేరుగా బేరసారాలు సాగించాడు. తన వద్ద బాహుబలి-2 హెచ్‌డి ప్రింట్ ఉందని, సినిమా థియేటర్లలో ప్రదర్శితం అయినన్ని రోజులు వారానికి 15 లక్షలు ఇవ్వాలని, లేకుంటే సినిమాను ఆన్ లైన్లో పెట్టేస్తామని నిర్మాతలను బెదిరించాడు.

    పోలీసులకు ఫిర్యాదు

    పోలీసులకు ఫిర్యాదు

    అయితే నిర్మాతలు విషయాన్ని సైబర్ క్రైం పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో.... ఇన్ స్పెక్టర్ చాంద్ బాషా నేతృత్వంలోని బృందం ఢిల్లీ, బీహార్, పాట్నా ప్రాంతాల్లో వరుస దాడులు నిర్వహించి రాహుల్, జితేందర్, తౌఫీఖ్, అలీ, దివాకర్, చందన్ లను అరెస్టు చేసారు. పరారీలో ఉన్న మెను, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

    కరణ్ జోహార్ కు కూడా బెదిరింపులు

    కరణ్ జోహార్ కు కూడా బెదిరింపులు

    ఈ మఠా సభ్యులు హిందీలో సినిమాను విడుదల చేసిన ప్రముఖ నిర్మాత కరణ్ జహార్ ను కూడా బెదిరించడం గమనార్హం.

    English summary
    Cyber Crime sleuths of Hyderabad have busted an inter-state movie piracy gang for illegally downloading HD print of 'Bahubali - The Conclusion' from a theatre in Bihar and blackmailing the producers for money. They reportedly even blackmailed filmmaker Karan Johar. Police nabbed Rahul Mehta, 26, Jitender Kumar Mehta, 37, Taufiq, 27, Md Ali, 39, all from Delhi, Divakar Kumar of Begusarai in Bihar and Chandan from Patna. Another accused Monu, also from Begusarai, is absconding.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X