twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బహుబలి’ పూర్తి స్థాయి ఫాంటసీ: రాజమౌళి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఛత్రపతి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న భారీ చిత్రం 'బహుబలి'. రాజమౌళి ఇప్పటి వరకు తాను తీసిన సినిమాలకు పూర్తి భిన్నంగా, భారీ హంగులతో, చారిత్రక నేపథ్యాన్ని తలపించేలా ఈచిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.

    ఈ చిత్రం గురించి ఇటీవల రాజమౌళి మాట్లాడుతూ...ఛత్రపతి తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ప్రభాస్‌తో కలిసి 'బహుబలి' చిత్రం చేయబోతున్నాను. నా గత చిత్రాల్లో కొంత మేరకు మాత్రమే ఫాంటసీ ఉండేది. కానీ ఈ చిత్రం పూర్తి స్థాయి ఫాంటసీ చిత్రం. హిస్టారికల్ మరియు జానపద చిత్రాన్ని పోలి ఉంటుందన్నారు.

    అదే విధంగా ఈ చిత్రానికి సంబంధించిన బడ్జెట్... మగధీర చిత్రం కంటే ఎక్కువగా ఉంటుందని, సినిమాలో భారీగా విజువల్ ఎఫెక్స్ట్ ఉండబోతున్నాయని రాజమౌళి చెప్పుకొచ్చారు. రాఘవేంద్రరావు నాకు గురువు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'ఘరానా బుల్లోడు' చిత్రంతో నా కెరీర్ ప్రారంభించాను. ఇప్పుడు ఆయన బ్యానర్లో దర్శకుడిగా పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది నా సొంత బేనర్ లాంటిదని రాజమౌళి వెల్లడించారు.

    ఈ సినిమాలో ఎక్కువ పాత్రలు ఉండటంతో రాజమౌళి కొత్త వారిని తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ తన కొత్త సినిమా చారిత్రాత్మక కథాంశంతో రూపొందే సినిమా కాకపోయినా, కత్తులూ, యుద్ధాలు తమ సినిమాలో ఉంటాయిని తెలిపాడు. ఆసక్తి ఉన్న వారికి తమ సినిమాలో అవకాశం ఇస్తానని, ఆసక్తి ఉన్నవారు వివరాలు పంపించాలని కోరాడు.

    ప్రభాస్ కు పత్యర్థిగా విలన్ పాత్రలో రాణా దగ్గుబాటి నటిస్తున్నాడు. అనుష్క హీరోయిన్ గా చేస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్కా మీడియా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ పని చేయబోతున్నారు. సాబు జాతీయస్థాయిలో నాలుగు పర్యాయాలు ఉత్తమ కళాదర్శకుడిగా పురస్కారాలు అందుకున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్‌ మీదకు తీసుకెళ్తారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెట్స్ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం భారీ స్థాయిలో గుర్రాలను, ఏనుగులను, ఒంటెలను హైదరాబాద్‌కు తరలించనున్నారని కూడా సమాచారం.

    English summary
    "I am working with prabhas after Chatrapati. I wanted to take sufficient break after Magadheera by doing Maryada Ramanna and Eega... My earlier movies had a bit of fantasy, but this movie is a full-fledged fantasy. It could be historical or folk. and the budget of this movie will be higher than that of Magadheera. There are going to be humongous visual effects" SS Rajamouli told.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X