»   » రాజమౌళి సినిమా పై పవన్ సంచలన కామెంట్

రాజమౌళి సినిమా పై పవన్ సంచలన కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ మామూలుగానే ఎవరి జోలికీ వెళ్ళడు. కనీసం ప్రాజెక్ట్ పూర్తయ్యాక తన సినిమా గురించి కూడా ఎప్పుడూ మాట్లాడని పవన్ ఈ సారి మాత్రం మరొక సినిమా విషయం లో అదీ ఇప్పటి దర్శక దిగ్గజం రాజమౌళి తీసిన రెండు విజువల్ వండర్స్ మధ్య పోలిక తెస్తూ....

మగధీర కన్నా బాహుబలి గొప్పేంకాదు కానీ మగధీర వేరే భాషల్లో సరిగా ప్రమోట్ చేయలేదని., ఆసినిమాని సరిగా రిలీజ్ చేయలేదని వ్యాఖ్యానించాడు."సర్దార్ గబ్బర్ సింగ్" ను హిందీలో ఎందుకు రిలీజ్ చేశారో చెబుతూ పవన్ ఈ వ్యాఖ్యలు చేశాడు..

దక్షిణాది భాషే అయిన తమిళ సినిమాలకు తెలుగు లో చెప్పుకోదగ్గ మార్కెట్ ఉంది. కానీ మన సినిమాలకి అక్కడ ఏమాత్రం మార్కెట్ లేదు. తెలుగు లో 40-50 కోట్లు పెట్టి తీసిన సినిమాను తమిళంలో 50 లక్షలకు కూడా ఎవ్వరూ కొనరు. కానీ తమిళంలో 30 కోట్లు పెట్టి సినిమా తీస్తే మూడింట రెండొంతుల డబ్బులు తెలుగులోనే వచ్చేస్తాయి.

Bahubali is not great as Magadheera..?

మన సినిమాల్ని వేరే భాషల్లోకి తీసుకెళ్లే విషయంలో నిర్మాతలు ఎప్పుడూ ధైర్యం చేయలేదు. "మగధీర" నే తీసుకుంటే అది అద్భుతమైన సినిమా. కానీ దాన్ని వేరే భాషల్లో సరిగా ప్రమోట్ చేయలేదు. బాహుబలి కంటే ముందు "మగధీర" నే హిందీలో రిలీజ్ చేయాల్సింది. సరైన స్థాయి లో ప్రమోట్ చేయాల్సింది. అలా చేస్తే బాహుబలి కంటే ఆ సినిమానే బాగా ఆడేది. ఇప్పుడు బాహుబలి సాధించే రికార్డులని ఎప్పుడో మగధీర బద్దలు కొట్టి ఉండేది.

ఇప్పటికైనా మన నిర్మాతలు మేల్కోవాలి. మన సినిమాలకు వేరే భాషల్లో మార్కెట్ పెంచుకోవాలి. అందుకే రిజల్ట్ ఎలా ఉంటుందో ఆలోచించకుండా "సర్దార్ గబ్బర్ సింగ్"ను హిందీలో రిలీజ్ చేశాం" అంటూ చెప్పుకొచ్చాడు పవన్. ఎవరి జోలికీ వెళ్ళని పవర్ స్టార్ ఇలా మాట్లాడటం కొత్తగానే ఉంది. మరి రాజమౌళి దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి మరి....

English summary
Magadheera May do good better than baahubali In Bollywood: says Pawn kalyan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu