»   » బాహుబలి : అమ్మాయిలతో ప్రభాస్ లుక్ కేక (ఫోటో)

బాహుబలి : అమ్మాయిలతో ప్రభాస్ లుక్ కేక (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న 'బాహుబలి' చిత్రం కోసం భారీగా గడ్డాలు, మీసాలు పెంచేస్తున్న సంగతి తెలిసిందే. ఐదుగురు అమ్మాయిలతో కలిసి దిగిన ప్రభాస్ ఫోటోలో.....ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వీరు బహుషా ప్రభాస్ అభిమానులు అయి ఉంటారు.

జానపద చిత్రంగా రూపొందే ఇందులో ప్రభాస్ వీరుని గెటప్‌లో కనిపించనున్నాడు. తాజాగా ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర తీరు ఎలా ఉండబోతుందనే విషయం వెల్లడైంది. 'ఇచ్చిన మాట కోసం బంధాలను, బాంధవ్యాలను కూడా లెక్కచేయని మేరుగనగధీరుడు 'బాహుబలి'. మాట తప్పడం, మడమ తిప్పడం తనకు తెలియదు. తెలిసి ఒక్కటే...రాక్షస అలలకు ఎదురీదడం. రాచరిక అహంభావాన్ని కూకటి వేళ్లతో పెకిలించడం. శత్రుదుర్భేధ్యమైన పద్దెనిమిది అక్షౌహిణిల సైన్యంతో అతనొక్కడే సమానం'....ఈ విధంగా రాజమౌళి బాహుబలి(ప్రభాస్) పాత్రను మలిచాడు.

దాదాపు వంద కోట్ల భారీ వ్యయంతో ఈచిత్రాన్ని ఆర్కామీడియా తెరకెక్కిస్తోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం కోసం గుర్రపుస్వారి, కత్తియుద్ధం, ధనుర్విద్య, కర్రసాము లాంటి విద్యలను ప్రభాస్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధాన భూమిక పోషించనున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు.

అనుష్క హీరోయిన్ కాగా, రానా విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈచిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్ల నుంది. 'బాహుబలి' చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. మరో వైపు ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాకు సంబంధించిన సెట్టింగ్స్ వేసే పనిలో బిజీగా ఉన్నారు.

English summary
Prabhas was recently spotted in his new look. The actor's bushy beard, for a role in his upcoming film Bahubali, is sure to surprise many.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu