»   » మళ్ళీ ఒకసారి మాహిష్మతి లోకి : బాహుబలి ది బిగినింగ్ మళ్ళీ రిలీజ్

మళ్ళీ ఒకసారి మాహిష్మతి లోకి : బాహుబలి ది బిగినింగ్ మళ్ళీ రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి - ది బిగినింగ్' ఎంతటి విజయం సాధించిందో వేరే చెప్పనక్కర్లేదు.2015 జూలై 10.. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిచెప్పిన బాహుబలి సినిమా విడుదలైన రోజు. ఒక్కటేమిటి.. అదీ..ఇదీ అన్న తేడా లేకుండా రికార్డులను తిరగరాసిందీ సినిమా. అందుకే ఇంకొక్కసారి థియేటర్లోకి తెస్తున్నారట... ఆ వివరాలు.....

బాహుబలి ముందు తర్వాత అనే రేంజ్‌లో

బాహుబలి ముందు తర్వాత అనే రేంజ్‌లో

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీని సృష్టించింది. దాదాపు రూ.600 కోట్ల గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టేసింది సినిమా. బాహుబలి సినిమాకు ముందు తర్వాత అనే రేంజ్‌లో తెలుగు సినిమా స్థాయి, మార్కెట్‌ పెరిగింది. అంతర్జాతీయంగా చైనా సహా పలు దేశాల్లో ఈ చిత్రం సూపర్‌ సక్సెస్‌ను సాధించింది.

ప్రపంచ వ్యాప్తంగా

ప్రపంచ వ్యాప్తంగా

బాహుబలి వరకు ప్రభాస్‌ తెలుగు హీరో. బాహుబలి2కి ఇంటర్నేషల్‌ హీరో అయ్యాడు. బాహుబలి 650 కోట్లకు పైగా కలెక్ట్‌ చేయడంతోపాటు పలు దేశాల్లో ఈ చిత్రం ప్రదర్శించడం ద్వారా ఇంటర్నేషనల్‌ హీరో అయ్యాడు. బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు బాహుబలి2లో ప్రభాస్‌ను చూసేందుకు ప్రపంచమంతా ఎదురుచూస్తోందంంటే అతిశయోక్తి కాదు...

బాహుబలి మరోసారి

బాహుబలి మరోసారి

దీనికి సీక్వెల్ గా వస్తున్న ‘బాహుబలి 2' ఇంకో రెండు నెలల్లో రిలీజ్ కానున్నా ప్రేక్షకులపై ఈ మొదటి భాగం ప్రభావం మాత్రం ఇంకా తగ్గలేదు. ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ థియేటర్లో చూడటానికి ప్రేక్షకులు అమితోత్సాహంతో ఉన్నారు. అందుకే బాహుబలిని మరోసారి థియేటర్లలో ప్రదర్శించేందుకు రంగం సిద్ధమవుతోంది. బాహుబలి మొదటి పార్ట్ జులై 10, 2015న విడుదలైంది. అంటే దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఇప్పుడు బాహుబలి రెండో పార్ట్ కూడా మరో నెల రోజుల్లో విడుదల కాబోతోంది.

 కీలక నిర్ణయం

కీలక నిర్ణయం

2017 ఏప్రిల్ 28న బాహుబలి 2 థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే విడుదలైన పార్ట్ 2 ట్రైలర్‌కు విశేష స్పందన రావడంతో రాజమౌళి మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. బాహుబలి 2 విడుదలయ్యే రెండు వారాల్లోపు మరోసారి బాహుబలి మొదటి పార్ట్‌ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు రాజమౌళి ప్రకటించాడు.

వ్యాపార దృక్ఫథం లేదు

వ్యాపార దృక్ఫథం లేదు

అయితే ఇందులో ఎలాంటి వ్యాపార దృక్ఫథం లేదని, బాహుబలి2లో ఉన్న కథ విషయంలో ప్రేక్షకుడు తికమకకు లోనవ్వకూడదనే ఉద్దేశంతోనే మొదటి పార్ట్‌ను మరోసారి రిలీజ్ చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించాడు. అయితే కొన్ని థియేటర్లలో మాత్రమే ఈ ప్రత్యేక షో ప్రదర్శించనున్నట్లు తెలిసింది.

English summary
Director S S Rajamouli wants the audiences to revisit the world of 'Bahubali' before the release of "Bahubali: The Conclusion". Rajamouli on Thursday said they are planning to show the first part a week before the second edition hits theatres on April 28.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu