»   » తెలుగులో రిలీజవుతున్న మరో భారీ బాలీవుడ్ మూవీ!

తెలుగులో రిలీజవుతున్న మరో భారీ బాలీవుడ్ మూవీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్‌ సినీ ఇండస్ట్రీలో తెలుగు, తమిళంలో మంచి మార్కెట్ ఉంది. అయితే ఇక్కడ ప్రాంతీయ భాష చిత్రాలదే ఆధిపత్యం. ఇతర బాషా చిత్రాలైనా ఇక్కడి బాషలో రిలీజ్ చేస్తేనే మంచి వసూళ్లు వస్తాయి. ఇటీవల సల్మాన్ ఖాన్ ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో' తెలుగులో విడుదలై మంచి వసూళ్లు సాధించింది.

తాజాగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న‘బాజీరావు మస్తానీ' మూవీ కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 18న విడుదలకు సిద్ధమవుతున్నఈ మూవీ ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న చారిత్రక బాలీవుడ్ చిత్రం 'బాజీరావ్‌ మస్తానీ'. 18వ శతాబ్దానికి చెందిన మరాఠా యోధుడు బాజీరావ్ పేష్వా-1‌, అతని ప్రేయసి మస్తానీ ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. రణ్‌వీర్‌ సింగ్‌, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 18న విడుదల కాబోతున్న ఈ చిత్రం అఫీషియల్ ట్రైలర్ విడుదల చేసారు. 3.45 నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది.

Bajirao Mastani to also release in Tamil & Telugu

బాజీ రావ్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తుండగా.... అతని ప్రియురాలు మస్తానీ పాత్రలో దీపిక పదుకోన్ నటిస్తోంది. బాజీరావ్‌ భార్య కాశీబాయిగా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఈ సినిమాలోని ‘దీవాని మస్తానీ' అనే సాంగులో దీపిక పదుకోన్ లుక్ అదిరిపోయింది.

బాజీరావ్‌గా గుండు, కోరమీసంతో రణ్‌వీర్‌ కొత్తగా కనిపిస్తున్నారు. నుదుట చందన తిలకం, చెవిదుద్దులు, బంగారు పూసల దండలు ధరించిన ఆయన ముఖంలో రాజసం ఉట్టిపడుతోంది. బాజీరావ్‌ ప్రేయసి మస్తానీగా నటిస్తున్న దీపికా పదుకోన్ చేతిలో విల్లుతో వీరనారిగా పెర్ఫార్మెన్స్ అరదగొట్టింది.

ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా ధ‌రించే చీర‌లు చాల హైలెట్ అవుతాయని అంటున్నారు. స‌వ్వారి అని 11 మీట‌ర్లు పొడ‌వుండే మ‌రాఠీ సంప్ర‌దాయ చీర‌ను ప్రియాంక ధ‌రించ‌నుంద‌ని తెలుస్తోంది.రాచ‌రికం ఉట్టి ప‌డేలా ఉండ‌టంతో పాటు అప్ప‌టి కాలాన్ని ప్ర‌తిబింబించాల‌న్న‌ది భ‌న్సాలీ ఆలోచ‌న‌. ఇత‌ర‌త్రా క‌థ డిమాండ్ మేర‌కు ముక్క పుడ‌క‌, చేవి రింగులు వంటి విష‌యంలో చారిత్రిక అంశాల్ని ప‌రిశీలించి ప‌రిశోధించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు డైరెక్ట‌ర్ సంజ‌య్ లీలా భ‌న్సాలీ. మ‌రి ఏదైనా భారీ త‌నం ఉట్టి ప‌డేలా చూపించే సంజ‌య్ లీలా.. బాజీరావు మ‌స్తానీ చిత్రాన్ని అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నారు.

English summary
Eros International and Sanjay Leela Bhansali’s forthcoming magnum opus Bajirao Mastani, slated to release on December 18 worldwide, will also release in Tamil and Telugu languages. The period drama will be dubbed in these languages to reach out to a wider audience base in the south markets.
Please Wait while comments are loading...