»   »  బిహైండ్ సీన్స్ అదిరాయి... ఆ ఫొటోలు

బిహైండ్ సీన్స్ అదిరాయి... ఆ ఫొటోలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై ‌: ఇప్పుడు బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం ఏదీ అంటే 'భజరంగీ భాయ్‌జాన్‌'. కబీర్‌ఖాన్‌ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్‌, కరీనా కపూర్‌ జంటగా నటించిన భజరంగీ భాయిజాన్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ పాకిస్థాన్‌ బాలిక తన సొంత ఇంటికి చేరుకునేందుకు ఓ భారతీయుడు సహాయం చేసే నేపథ్యంలో తీసిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిహైండ్ సీన్స్ కు చెందిన ఫొటోలు మీకు అందిస్తున్నాం.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

బజ్రంగి భాయిజాన్ కథ: ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇదరు దేశాల అభిమానులు ఆసక్తిగా చూస్తున్న సన్నివేశంతో సినిమా మొదలవుతుంది. అదే సమయంలో కెమెరా...సుల్తాన్‌పూర్ విలేజ్‌లోని ప్రెగ్నెంట్ ఉమెన్ వైపు తిరుగుతుంది. ఆమె తన కూతురుకి షహీదా పేరు పెట్టాలని నిర్ణయించుకుంటుంది. ఆరు సంవత్సరాల ముందుకు వెళితే.....షహీదా(హర్షాలీ మల్హోత్రా) సంజోతా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తూ కనిపిస్తుంది. తన కూతురు కండీషన్ గురించి ప్రార్థించడానికి తల్లి ఆమెను ఢిల్లీలోని నిజాముద్దీన్ హజ్రత్ అలీకి తీసుకెలుతూ ఉంటుంది.

తిరుగు ప్రయాణంలో పాకిస్థాన్ వెళ్లాల్సిన షహీదా తన రైలు మిస్సవుతుంది. ఏం చేయాలో తెలియని షహీదా పవన్ కుమార్ చతుర్వేది(సల్మాన్ ఖాన్) వద్దకు చేరుకుంది. ఆమె ఎవరు, ఎక్కడి నుండి వచ్చింది తెలుసుకోవడానికి సల్మాన్ ఖాన్ చాలా విధాలుగా ప్రయత్నిస్తాడు. పవన్ కుమార్ చతుర్వేది ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే... తండ్రి అతన్ని ఎందుకూ పనికి రాని వాడిగా చూస్తాడు. తండ్రి మరణం తర్వాత పవన్ కుమార్ ఢిల్లీ బయల్దేరుతాడు.

దయానంద్ అకాడాలో చేరుతాడు. ఇక్కడే అతనికి రసికా(కరీనా కపూర్) పరిచయం అవుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. ఈ క్రమంలో పవన్ కుమార్ షహీదాను వ్యబిచార ముఠా నుండి కాపాడుతాడు. ఆమెను ఎలాగైనా సేప్ గా ఇంటికి చేర్చాలని నిర్ణయించుకుంటాడు. షహీదాను పవన్ కుమార్ ఇంటికి ఎలా చేర్చాడు? రసికాను పెళ్లాడటానికి ఆమె తండ్రిని ఒప్పించడానికి ఏం చేసాడు అనేది తెరపై చూడాల్సిందే. రెండు మతాల భావోద్వేగాలు, దేశ సరిహద్దులో పరిస్థితిని బ్యాలెన్స్ చేస్తూ సాగిన బజ్రంగి భాయిజాన్ స్టోరీ పాయింట్ ఆకట్టుకుంది.

బిహైండ్ సీన్స్ ఫొటోలు స్లైడ్ షోలో

 డైరక్టర్ తో

డైరక్టర్ తో

హర్షాలీ మల్హోత్రా తో దర్శకుడు కబీర్ ఖాన్ ఇలా సెట్స్ లో ఉన్నప్పుడు

సల్లూభాయ్ తో

సల్లూభాయ్ తో

సల్మాన్ ఖాన్ తో హర్షాలీ మల్హోత్రా ఇలా సెట్స్ పైనే సరదాగా

ఒకే ఎత్తులో

ఒకే ఎత్తులో

పవన్ (సల్మాన్ ఖాన్) పాప హర్షాలీ మల్హోత్రా తో కలిసి ఒకే ఎత్తులో

షూటింగ్ టైమ్ లో

షూటింగ్ టైమ్ లో

కాశ్మీర్ లో షూటింగ్ జరిగేటప్పుడు ఇలా హర్షాలీ మల్హోత్రా

షూటింగ్ లో భాగంగా

షూటింగ్ లో భాగంగా

సల్మాన్, హర్షాలీ మల్హోత్రా కలిసి షూటింగ్ చేసేటప్పుడు క్లిక్ మనిపించారు

డైరక్టర్ డైరక్షన్స్ ఇస్తున్నప్పుడు

డైరక్టర్ డైరక్షన్స్ ఇస్తున్నప్పుడు

హర్షాలీ మల్హోత్రా కి దర్శకుడు కబీర్ ఖాన్ సూచనలు ఇస్తున్నప్పుడు

పాప ఏడుస్తూంటే

పాప ఏడుస్తూంటే

సెట్స్ పాప హర్షాలీ మల్హోత్రా ఏడుస్తూంటే ఇలా సల్మాన్ ఏం చెయ్యాలో తెలియక చూస్తూ...

సెల్ఫీ

సెల్ఫీ

పాప హర్షాలీ మల్హోత్రా తో కలిసి సల్మాన్ ఖాన్ సెల్ఫీ దిగిన క్షణాలు

దర్శకుడుతో కలిసి

దర్శకుడుతో కలిసి

దర్శకుడు కబీర్ ఖాన్ తో కలిసి సెట్స్ పై పాప హర్షాలీ మల్హోత్రా

కీలకమైన సీన్ లో

కీలకమైన సీన్ లో

సినిమాలో కీలకంగా నిలిచే సన్నివేశంలో సల్మాన్ ..పాప హర్షాలీ మల్హోత్రా

దర్శకుడు చెప్తుంది వింటూ

దర్శకుడు చెప్తుంది వింటూ

షూటింగ్ సమయంలో దర్శకుడు కబీర్ ఖాన్ చెప్పింది వింటూ హర్షాలీ మల్హోత్రా.

ఇలా తెరవెనుక..

ఇలా తెరవెనుక..

తెర వెనక దర్శకుడు, సల్మాన్ తో కలిసిమెలిసి పాప హర్షాలీ మల్హోత్రా..

English summary
Bajrangi Bhaijaan's Munni aka Harshaali Malhotra has won the nation's heart with her innocence and power packed performance in Kabir Khan's film. We bring to you Harshaali's behind the scenes pictures from the movie Bajrangi Bhaijaan.
Please Wait while comments are loading...