twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ నటులు రాజకీయాల్లో రాణించడం కష్టం.. ఆ సినిమా అందుకే ఫ్లాప్.. బాలకృష్ణ

    By Rajababu
    |

    గతేడాది గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంతో సంచలన విజయాన్ని అందుకొన్నారు. పైసా వసూల్ తర్వాత 102 చిత్రంగా ప్రస్తుతం జై సింహా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలకానున్నది. ఈ సందర్భంగా ఇటీవల బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను వెల్లడించారు.

    Recommended Video

    ఆ విషయంలో పవన్.. బాలయ్య.. ఇద్దరూ తగ్గట్లేదు..!
    కొత్త బాలకృష్ణను చూస్తారు.,

    కొత్త బాలకృష్ణను చూస్తారు.,

    పైసా వసూల్ తర్వాత నేను చేసిన సినిమా ఇది. నటీనటుల పనితీరు, సాంకేతిక నిపుణుల ప్రతిభకు సమిష్టి కృషి తోడవ్వడంతో బ్రహ్మాండంగా వచ్చింది. ఈ సినిమాలో కొత్త బాలకృష్ణను చూస్తారు.

     నిర్మాతలు తీరు సరికాదు..

    నిర్మాతలు తీరు సరికాదు..

    నిర్మాతలు పదికాలాల పాటు పరిశ్రమలో నిలబడాలి అనేది నా సిద్దాంతం. పరిశ్రమలో మేము తప్ప మరొకరు లేరనే ధోరణిలో కొంతమంది నిర్మాతలు ఉన్నారు. అదిసరి కాదు. చిత్రపరిశ్రమ బాగుండాలని, మరింత కాలం మనుగడ సాగించాలంటే ఎవరికి వారు తమని తాము సంస్కరించుకోవాలి.

    అందుకే సినిమా ఫ్లాప్

    అందుకే సినిమా ఫ్లాప్

    ఓసారి ఓ భారీ బడ్జెట్ సినిమాతో మేము ఢీకొన్నాం. ఆ చిత్రానికి పోటీగా చిన్న బడ్జెట్‌తో రూపొందిన సినిమాను రిలీజ్ చేశాం. ఆ భారీ బడ్జెట్ చిత్రం ఆడలేదు. మా చిత్రం సిల్వర్ జూబ్లీ విజయాన్ని అందుకొన్నది. మా చిత్రం ఎందుకు ఆడలేదని సదరు నిర్మాత అడిగాడు. మీ సినిమాలో కథకు తగినట్టుగా నటీనటుల ఎంపిక జరుగలేదు. అందుకే మీ సినిమా ఫ్లాప్ అయిందని కారణం చెప్పాను.

     ముక్కుసూటితనం మాకే సాధ్యం

    ముక్కుసూటితనం మాకే సాధ్యం

    రాజకీయాల్లో ముక్కుసూటితనం నందమూరి వంశానికే సాధ్యం. సినిమా నటులందరూ రాజకీయాల్లో రాణించలేరని నా అభిప్రాయం. నా రాజకీయ ప్రవేశంపై ఎంతో మంది సందేహాలను వ్యక్తం చేశారు. నాన్నగారిలా, నా మాదిరిగా రాజకీయాల్లో విజయం సాధించలేరు.

     పాలిటిక్స్ టైమింగ్ ముఖ్యం

    పాలిటిక్స్ టైమింగ్ ముఖ్యం

    రాజకీయాల్లో ఏం చేసినా టైమింగ్ ముఖ్యం. సరైన సమయంలో రంగ ప్రవేశం చేయాలి. అప్పుడే వారు నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది. అవకాశం లేని పరిస్థితుల్లో సినీ నటులు రాజకీయాల్లోకి వస్తే దెబ్బ తింటారు అని రజనీ, కమల్ పొలిటికల్ ఎంట్రీ గురించి కామెంట్లు చేశారు.

    ఈ ఏడాదే మోక్షజ్ఞ సినిమా

    ఈ ఏడాదే మోక్షజ్ఞ సినిమా

    జై సింహా తర్వాత ఆగస్టు నుంచి బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా వుంటుంది. మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం ఈ ఏడాదే వుంటుంది. ఆగస్టు లేదా సెప్టెంబర్ తర్వాత మోక్షజ్ఞ సినిమా ప్రారంభం కావొచ్చు అని బాలకృష్ణ తెలిపారు.

    English summary
    Jai Simha is a upcoming 2018 Telugu, Action film, produced by C. Kalyan on CK Entertainments banner and directed by K. S. Ravikumar. Starring Nandamuri Balakrishna, Nayanthara, Natasha Doshi, Hariprriya in the lead roles and music composed by Chirantan Bhatt. This movie is set release on January 12. In this occassion, Balakrishna speaks to media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X