twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవిపై పేలిన బాలయ్య డైలాగ్...!

    By Bojja Kumar
    |

    balakrishna
    'అధినాయకుడు' చిత్రంలో మెగా స్టార్, కాంగ్రెస్ నాయకుడు చిరంజీవిపై సెటైర్లు ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన అధినాయకుడు ట్రైలర్లో చిరంజీవిపై సెటైర్లు ఓ రేజింలో పేలాయి. 'పదవులు ఇస్తామంటే వచ్చే వాడు నాయకుడు కాదు' అంటూ బాలయ్య ఇందులో చెబుతున్న డైలాగు ఖశ్చితంగా చిరంజీవిని ఉద్దేశించినవే అని చర్చించుకుంటున్నారు.

    ఆసక్తికరంగా మారిన మరో డైలాగ్ ఏమిటంటే...'అభిమానుల్ని రెచ్చగొట్టొద్దు' అని బాలయ్య అనడం. దీన్ని బట్టి ఇటీవల రచ్చ సినిమాలో రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ బాలయ్యకు కౌంటర్‌గా ఉందనే వార్తలు వచ్చాయి. దానికి కౌంటర్ గా బాలయ్య ఈ డైలాగ్ విసిరి ఉంటాడని సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

    ఇక ఈచిత్రంలో జగన్‌ను టార్గెట్ చేస్తూ భారీ డైలాగులు పేలిన విషయం తెలిసిందే. 'మంచి నాయకులు ప్రజల గుండెల్లో ఉండాలి కానీ...రోడ్డు మీద బొమ్మల్లో కాదు, విగ్రహాల రాజకీయం చేస్తావా' అంటూ పవర్ ఫుల్ సెటర్లు విసిరారు నట సింహం. నిన్న బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై సినిమా ఉంటుందని, పొలిటికల్ సెటైర్లు ఉన్న మాట వాస్తవమే అన్నారు.

    జరుగబోయే ఉప ఎన్నికల్లో టీడీపీ తరుపున ప్రచారానికి వెళతారా? అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ 'అధినాయకుడు' సినిమానే ప్రచారానికి వెలుతుంది అని సమాధానం ఇచ్చారు. దీన్ని బట్టి ఈచిత్రం పొలిటికల్‌గా తెలుగు దేశం పార్టీకి అనుకూలంగా, కాంగ్రెస్, వైఎస్ఆర్‌సి పార్టీలను టార్గెట్ చేసినట్లు ఉందని స్పష్టం అవుతోంది.

    ఎంఎల్ కుమార్ చౌదరి నిర్మించిన ఈచిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహించారు. లక్ష్మిరాయ్, సలోని హీరోయిన్లు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. జూన్ 1న ఈచిత్రం గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    Not only on YSR Congress president YS Jagan, Balakrishna's role in Adhinayakudu film, thunders with his dailogues on Congress Rajyasabha member Chiranjeevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X